‘ఓ, ఆ ఇల్లా? అది ఇప్పుడు సముద్రంలో ఉంది- అక్కడ!’

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో, ఉప్పాడ గ్రామ నివాసితులు సముద్రం తదుపరి చర్యలను అర్ధం చేసుకోవడానికి వారి ఆలోచనల పై ఆధారపడతారు. వేగంగా తరిగిపోతున్న తీరప్రాంతం వారి జీవనోపాధిని, సామాజిక సంబంధాలను, సామూహిక జ్ఞాపకశక్తిని మార్చేసింది

ఫిబ్రవరి 28, 2022 | రాహుల్ ఎమ్.

మారుతున్న వాతావరణ రెక్కలపై కీటకాల యుద్ధం

భారతదేశంలో స్థానిక కీటకాల జాతులు భారీగా క్షీణిస్తున్నాయి - అందులో ఎన్నో జాతులు మన ఆహార భద్రతతో ముడిపడి ఉన్నాయి. కానీ మనుషులకు, బొచ్చు జంతువులపై ఉన్నప్రేమ, కీటకాల పై చూపడం కష్టం

సెప్టెంబర్ 22, 2020 | ప్రీతి డేవిడ్

లక్షద్వీప్ దీవుల తీరని దుఃఖం

లక్షద్వీప్, భారతదేశంలోకెల్లా అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం. సముద్రమట్టానికి కేవలం 1-2 మీటర్ల ఎత్తులో ఉండే ఈ దీవులలో ప్రతి ఏడవ మనిషి, చేపల వేటకు వెళతాడు. ఈ దీవులు ఇప్పుడు తాము నిలబడడానికి ఆధారంగా ఉన్న పగడపు దిబ్బలను కోల్పోతున్నాయి. అనేక విధాలుగా వాతావరణ మార్పు ఈ దీవులపై ప్రభావం చూపుతోంది

సెప్టెంబర్ 12, 2020 | శ్వే తా దాగా

థానేలో వర్షం సోమరిగా తయారు అయింది

అవ్వి మహారాష్ట్రలోని షాహాపూర్ తాలూకాకు చెందిన ఆదివాసీ గ్రామాలు. ఆడ ఉండే ధర్మ గారెల్ ఇంకా తతిమ్మోళ్ళు, ఊకూకే 'వాతావరణ మార్పు' గురించి మాట్లాడకపోవచ్చు, కానీ ప్రతిరోజు దాని ప్రభావాలను మాత్రం ప్రత్యక్షంగా ఎదురుకుంటున్నరు. వాతావరణ మార్పులతో పాటు ఆడుండే అస్థిరమైన వర్షపాతం మరియు దిగుబడి తగ్గుదల వాళ్ళకు బాగా ఎరుకనే

ఆగస్ట్ 25, 2020 | జ్యోతి శినోలి

భానుడి ప్రతాపం, చలి తీవ్రత, వేడెక్కిపోతున్న చూరూ

జూన్ 2019 లో, ప్రపంచంలో ఎన్నడూ లేనట్లుగా, రాజస్థాన్‌లోని చూరూ ప్రాంతంలో అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ప్రజలకు ఈ సంఘటన సుదీర్ఘ వేసవి కాలంలో ఒక మైలురాయిగానో, అనూహ్య వాతావరణం లాగానో అనిపించి ఉండవచ్చు కానీ, ఇది వాతావరణ మార్పులను సూచిస్తుంది

జూన్ 02, 2020 | షర్మిలా జోషి

యమునలో 'చనిపోయిన చేపలు తాజాగా ఉన్నప్పుడు'

మురుగునీరు, ఉదాసీనత ఢిల్లీ జీవనరేఖను మురుగు కాలువగా మారేలా చేసాయి. ఏటా వేల సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి, కానీ యమున అసలు సంరక్షకులు ఏమి చేయలేకపోతున్నారు. ఇవన్నీ వాతావరణ సంక్షోభాన్ని పెంచి ప్రోత్సహించేలా ఉన్నాయి

జనవరి 22, 2020 | శాలిని సింగ్

పెద్ద న‌గ‌రం, చిన్న‌రైతులు; ఎండిపోతున్న ఒక న‌ది

న‌గ‌ర రైతులా? అవును, దేశ రాజ‌ధానిలో య‌మునా న‌ది పారే ప్రాంతాల్లో త‌ర‌చూ వ‌ర‌ద‌లు, మైదానాల విధ్వంసం; తీవ్రంగా పెరిగిపోయిన న‌గ‌ర వాతావ‌ర‌ణ కాలుష్యం, ఆ ప్రాంతాల్లోని నివాసితుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, త‌ద్వారా వారి జీవ‌నోపాధి మార్గాలు నాశ‌న‌మ‌వుతున్నాయి

డిసెంబర్ 19, 2019 | శాలిని సింగ్

ముంబై శివార్లలో తగ్గిపోతున్న పాంఫ్రెట్

వర్సోవా కొలివాడలో నివసించే జాలర్లు మత్స్య సంపద తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. స్థానికంగా పెరుగుతున్న కాలుష్యం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ వార్మింగ్ వరకు, వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ పెను మార్పులు ముంబై సముద్ర తీరాలపై తీవ్ర ప్రభావాలను చూపుతున్నాయి

డిసెంబర్ 4, 2019 | సుబుహి జివాని

తమిళనాడులో సముద్రపు నాచును వెలికితీసే కార్మికుల ఎదురీత

తమిళనాడులోని భారతీనగర్‌లోని మత్స్యకారుల పని వల్ల వాళ్లు పడవల్లో కంటే నీటిలోనే ఎక్కువ సేపు ఉండాల్సి వస్తోంది. అయితే గ్లోబల్ వార్మింగ్‌తో పాటు సముద్ర వనరులను కొల్లగొట్టడం వల్ల, వారి జీవనోపాధి దెబ్బతింటోంది

అక్టోబర్ 31, 2019 | ఎమ్ పళని కుమార్

ఆలస్యమవుతున్న ఋతుపవనాలు, నష్టపోతున్న భండారా రైతులు

చాలా కాలంగా తగినంత నీటి వనరులను కలిగి ఉన్న విదర్భలోని భండారా జిల్లాలో ఇప్పుడు వర్షపాత తీరుతెన్నులు మారిపోయాయి. 'వాతావరణ హాట్‌స్పాట్'లలో ఒకటిగా గుర్తించబడిన భండారాలో కనబడుతున్న ఈ పెనుమార్పులు, అక్కడి వరి రైతులకు తీవ్ర అనిశ్చితిని, నష్టాలను కలిగిస్తున్నాయి

అక్టోబర్ 23, 2019 | జైదీప్ హర్దీకర్

‘పత్తి ఇప్పుడు తలనొప్పిగా మారింది’

ఒడిశాలోని రాయగడ జిల్లాలో రసాయనాలతో కూడిన బిటి పత్తి ఏకపంట సాగు వ్యాపిస్తోంది - ఈ ప్రక్రియ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది, అప్పుల తీవ్రతను పెంచుతుంది, స్థానిక జ్ఞానాన్ని కోలుకోలేనంతగా క్షీణింపజేస్తుంది, వాతావరణ సంక్షోభానికి విత్తనాలు నాటుతోంది

అక్టోబర్ 7, 2019 | అనికేత్ ఆగా , చిత్రాంగద చౌదురి

ఒడిశాలో వాతావరణ సంక్షోభానికి పడిన బీజం

రాయగఢలో గత పదహారేళ్ళలో బీటీ పత్తి విస్తీర్ణం 5,200 శాతం పెరిగింది. దాని ఫలితం: స్వదేశీ చిరుధాన్యాలు, వరి రకాలు, అటవీ ఆహారాలతో సమృద్ధిగా ఉన్న ఈ జీవవైవిధ్య హాట్‌స్పాట్ ప్రమాదకర పర్యావరణ మార్పుకు లోనవుతుంది

అక్టోబర్ 4, 2019 | చిత్రాంగద చౌదురి , అనికేత్ ఆగా

గుజరాత్‌లో కనుమరుగవుతున్న పచ్చిక బయళ్లు, కష్టాల్లో గొర్రెల కాపరులు

గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన పశుపోషకులు గొర్రెల మేత కోసం ప్రతి సంవత్సరం దాదాపు 800 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణిస్తున్నారు. అంతరించి పోతున్న పచ్చిక బయళ్లు, అస్థిరమైన వాతావరణం వల్ల వారీ యాత్ర చేయాల్సివస్తోంది

సెప్టెంబర్ 23, 2019 | నమిత వైకర్

సుందర్‌బన్స్: 'ఒక్క గడ్డి పోచయినా మొలవలేదు...'

దీర్ఘకాలంగా దారిద్య్రం అంచున జీవిస్తున్న పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌ ప్రజలు ఇప్పుడు- పదేపదే వచ్చిపడే తుఫానులు, ఎప్పుడంటే అప్పుడు కురిసే వానలు, నీటిలో పెరుగుతున్న లవణీయత, పెరిగిపోతున్న వేడి, క్షీణిస్తున్న మడ అడవులు వంటి మరెన్నో వాతావరణ మార్పులను కూడా ఎదుర్కొంటున్నారు

సెప్టెంబర్ 10, 2019 | ఊర్వశి సర్కార్

'సంతోషకరమైన రోజులు ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే'

తూర్పు హిమాలయలలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటున్న సంచార బ్రోక్పా సంఘం వాతావరణ మార్పులను గుర్తించి, సంప్రదాయక జ్ఞానం ఆధారంగా జీవంచగలిగే పద్ధతులు అనుసరించారు

సెప్టెంబర్ 2, 2019 | రితాయన్ ముఖర్జీ

లాతూర్‌లో 43°C వద్ద కురిసిన వడగళ్ల వానలు, దెబ్బ తిన్న వ్యవసాయం

గత దశాబ్ద కాలంగా, వేసవిలో కురుస్తున్న భారీ వర్షాలు, తీవ్రమైన వడగళ్ల వానలతో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని గ్రామస్తులు సతమతమవుతున్నారు. కొందరు రైతులైతే తమ పండ్లతోటలపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు

ఆగస్ట్ 26, 2019 | పార్థ్ ఎమ్.ఎన్.

సంగోలే లో, ‘అంతా తల్లకిందులు అయింది’

మంచి వర్షపాతం, వర్షాభావం - ఈ పాత క్రమం ఎలా చెడిపోయిందో తెలిపే కథలతో మహారాష్ట్రలో సోలాపూర్ జిల్లాలోని సంగోలే తాలూకాలోని పల్లెలు నిండిపోతున్నాయి. ఇలా ఎలా జరిగింది? ఎటువంటి ప్రభావం చూపుతోంది?

ఆగస్ట్ 19, 2019 | మేధా కాలే

‘ఇప్పుడు ఆ చేపల్ని డిస్కవరీ ఛానల్లో వెతుక్కుంటున్నాం’

కడల్ ఒసై - తమిళనాడులోని పంబన్ దీవిలో మత్స్యకారులు తమ సమూహం కోసం నడుపుకుంటున్న రేడియో పేరు. ఈ వారంతో కడల్ ఒసైని మొదలుపెట్టి మూడేళ్ళవుతుంది. ప్రస్తుతం వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్న అ రేడియో ప్రసారాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి

ఆగస్ట్ 12, 2019 | కవిత మురళీధరన్

‘వాతావరణం ఎందుకు ఈ విధంగా మారుతోంది?’

ఒక్కప్పుడు కేరళలోని వేయనాడ్ వాసులు గర్వంగా చెప్పుకునే ‘చల్లని అనుకూల వాతావరణం’ ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం, అస్థిర వర్షపాతం వల్ల, అక్కడి కాఫీ మరియు మిరియాలు పండించే రైతులు నష్టాలలో కొట్టుమిట్టాడుతున్నారు

ఆగస్ట్ 5, 2019 | విశాఖ జార్జ్

‘మేము పర్వతాల దేవుళ్లకి కోపం తెప్పించినట్టున్నాం’

లడాఖ్ లోని ఎత్తైన పచ్చిక బయళ్ళలో సంచరించే చంగ్పా పశుపోషకుల యాక్ సంబంధిత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. దీనికి కారణం, ఎంతో సున్నితంగా ఉండే పర్వతాల పర్యావరణ వ్యవస్థపై వాతావరణ మార్పులు చూపిస్తున్న ప్రభావమే

జూలై 22, 2019 | రితాయన్ ముఖర్జీ

వాతావరణ మార్పుల వలన కొల్హాపూర్ లో ‘గౌర్’ల మందలు

కొల్హాపూర్ లోని రాధానగరిలో మనుషులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ పెరుగుతోంది. అడవుల నరికివేత, సాగుచేసే పంటల్లో మార్పులు, కరువు, వాతావరణ మార్పులు ఈ ఘర్షణలను తీవ్రతరం చేస్తున్నాయి

జూలై 17, 2019 | సంకేత్ జైన్

రాయలసీమలో ఇసుక వర్షం కురుస్తోంది

పంటల సరళిలో మార్పులు, తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం, భారీ సంఖ్యలో బోరుబావులు, ఒక నది మరణం ... ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో భూమి, గాలి, నీరు, అడవులు, వాతావరణం పైన నాటకీయంగా ప్రభావాలు కనిపిస్తున్నాయి

జూలై 8, 2019 | పి. సాయినాథ్

Translator : PARI Translations, Telugu