అంధకారంలో వజీరిథల్ గ్రామ ఆరోగ్య సంరక్షణ
జమ్మూకశ్మీర్, బాందీపుర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీలు-అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా, దీనావస్థలో ఉన్న ప్రజా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పోరాడుతున్నారు. ఒక వృద్ధురాలైన దాయి (మంత్రసాని) తప్ప వాళ్లకు వేరే గత్యంతరం లేదు



















































