మే నెల ప్రారంభంలో అజయ్ కుమార్ సా కు జ్వరం వచ్చింది. అతను జార్ఖండ్ లో ఛత్ర జిల్లాలో తన గ్రామమైన అసరియా నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇత్ఖోరి  పట్టణంలోని ప్రైవేట్ క్లినిక్ డాక్టరుని సంప్రదించాడు.

ఆ డాక్టరు కోవిడ్ టెస్ట్ చేయకుండా బట్టలు అమ్ముకునే  ఇరవై ఐదేళ్ల అజయ్ కి(పైన కవర్ ఫొటోలో తన కొడుకు తో ఉన్నాడు) టైఫాయిడ్, మలేరియా ఉన్నాయని చెప్పాడు. ఆయన అజయ్ బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ ని మాత్రం పరీక్షించాడు. అది 75-80 శాతం మధ్య ఉంది. మామూలుగా అయితే 95 నుంచి 100 వరకు ఉంటుంది. ఆ తరవాత అజయ్ ని ఇంటికి పంపించి వేశాడు.

ఆ తరవాత 2-3 గంటలకు, అజయ్ కి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. ఇక అదే రోజు, కంగారుగా,  తన గ్రామానికి 45 కిలోమీటర్ల దూరం లో ఉన్న హజారీబాద్ లోని  ఇంకో డాక్టర్ ని కలిసాడు. ఇక్కడ కూడా అతనికి టైఫాయిడ్, మలేరియాకి పరీక్షలు రాసారు కానీ కోవిడ్-19 పరీక్ష చేయలేదు.

ఏదేమైనా, తన గ్రామానికి చెందిన హైయుల్ రెహమాన్ అన్సారీ  అనే వీడియో ఎడిటర్ తో అతను చెప్పాడు- “డాక్టర్ నాకు పరీక్ష జరపకపోయినా నన్ను చూసి, నాకు కరోనా ఉంది అని చెప్పాడు. అతను నన్ను సదర్ ఆసుపత్రి(హజారీబాగ్ లోని ప్రభుత్వ ఆసుపత్రి) కి వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఇక్కడ చికిత్స ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. కానీ భయంతో మేము ఎంత ఖర్చయినా పర్లేదని అని అన్నాము. మేము ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మము. అక్కడికి కరోనా చికిత్స కోసం వెళ్లిన వాళ్లెవరూ బ్రతకరు.”

మహమ్మారి రాక ముందు అజయ్ తన మారుతి వాన్ లో ఊరూరూ తిరిగి, బట్టలు అమ్మి, నెలకు 5000 నుంచి 6000 రూపాయిల వరకు సంపాదించేవాడు.

“ఈ వీడియో చూడండి: అసారియా లో: కోవిడ్ తో సహజీవనం, అప్పులతో పోరాటం”

ఈ కథనాన్ని రాసిన సహరచయిత, హైయుల్ రెహమాన్ అన్సారీ, ఏప్రిల్ లో రెండో సారి తన గ్రామమైన  అసరియాకి వచ్చాడు. అతనికి ముంబై లో కొత్తగా వీడియో ఎడిటర్ గా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం లో చేరేలోగానే  మహారాష్ట్రలో 2021 లాక్డౌన్ ప్రకటించారు. అతను మొదట 2020 మే మొదటి వారం లో ఇంటికి వెళ్ళాడు, అప్పుడు దేశవ్యాప్తంగా కోవిడ్ 19 లాక్డౌన్ ప్రకటించారు (అతని గురించి PARI ఇటీవల రాసిన కథనాన్ని ఇక్కడ చదవండి). అతను, అతని కుటుంబం వారి పదెకరాల పొలంలో వచ్చిన వరిపంట దిగుబడితో, కొంత ధాన్యం తమ కోసం ఉంచుకుని, మరి కొంత మార్కెట్ లో అమ్మి, ఆ సంవత్సరాన్ని నడిపారు.

అసరియాలో తనకేమి పని లేదని  రెహమాన్ అర్థం చేసుకున్నాడు. అతని వీడియో ఎడిటింగ్ నైపుణ్యం ఆ పల్లెటూరిలో పనికిరాదు. అతని కుటుంబానికున్న పదెకరాల పొలంలో నాట్ల పనులు జూన్ మధ్యలో కానీ మొదలవవు. అతనికి మీడియా లో ఉన్న అనుభవం, అతను మాస్ కమ్యూనికేషన్స్ లో బి ఏ చదవడం, పదేళ్లుగా ముంబై లో వీడియో ఎడిటర్ గా పని చేయడం వలన, అసరియాలో మనుషులు మహమ్మారి వలన ఎలా ప్రభావితం అవుతున్నారో నివేదికలు అందిస్తాడేమోనని మేము అడిగాము. అతను ఆ ఆలోచనకి చాలా ఉత్సాహపడ్డాడు.

ఈ వీడియోలో రెహమాన్ మనకు అజయ్ కుమార్ కోవిడ్ తో ఎలా పోరాడాడో, అతని అప్పులు ఎలా పెరిగాయో చెబుతాడు. అజయ్, అతని కుటుంబం అతనిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చడానికి భయపడి, ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అతనికి ఆక్సిజన్ పెట్టి, మందులు అందించారు. ఆతను మే 13 వరకు, అంటే ఏడు రోజులు అక్కడే ఉండవలసి వచ్చింది. అందుకు 1.5 లక్షలు ఖర్చు అవుతుందని అతనికి అవగాహన లేదు. ఈ ఖర్చుని భరించడానికి అజయ్ కుటుంబం వద్ద ఒకటే మార్గం ఉంది. అతని అమ్మ, అమ్మమ్మలు  స్త్రీ పొదుపు సంఘ సభ్యులు. అదే సంఘంలో ఉన్న కొందరు వడ్డీవ్యాపారుల వద్ద నుండి అప్పు తెచ్చుకున్నారు.

మహమ్మారికి ముందు అజయ్ తన మారుతివ్యాన్ లో ఊరూరూ తిరిగి, బట్టలు అమ్మి, నెలకు 5000-6000 రూపాయిలు సంపాదించేవాడు. పోయిన సంవత్సరం లాక్డౌన్ కారణంగా అతను తన వ్యాపారాన్ని నిలిపివేయవలసి వచ్చింది. డిసెంబర్ 2018 లో అతను మూడు లక్షల అప్పు మీద వాన్ ని కొన్నాడు, అది ఇంకా తీర్చవలసి ఉంది. అతని కుటుంబం పోయిన ఏడాది వారికున్న ఒకే ఒక ఎకరపు పంటను అమ్ముకుని, మరికొన్ని అప్పులు చేసి  బతికింది. అతను రెహమాన్ తో అన్నాడు, “మళ్లీ మేము డబ్బులు సంపాదించడం మొదలుపెడితే, నెమ్మదిగా అంతా తిరిగి ఇచ్చేస్తాము.”

అనువాదం: అపర్ణ తోట

Subuhi Jiwani

Subuhi Jiwani is a writer and video-maker based in Mumbai. She was a senior editor at PARI from 2017 to 2019.

Other stories by Subuhi Jiwani
Haiyul Rahman Ansari

Haiyul Rahman Ansari, originally from Asarhia village in Jharkhand’s Chatra district, has worked as a video editor in Mumbai for a decade.

Other stories by Haiyul Rahman Ansari
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota