వీడియో చూడండి: మేం చచ్చేంతవరకూ మాకున్న పని ఇదొక్కటే

2019లో బకింగ్‌హామ్ కెనాల్ ప్రాంతంలో ప్రయణిస్తుండగా నేనామెను మొదటిసారిగా గమనించాను. ఒక గ్రీబ్ పక్షిలాగా ఆ కాలువలోకి దూకిన ఆమె, నీటి అడుగున ఈత కొట్టడంలో ఆమె చూపించిన నేర్పు నా దృష్టిని ఆకర్షించాయి. నదీగర్భంలో ఉండే గండ్ర ఇసుకలోకి తన చేతులను వేగంగా పోనిచ్చి, అక్కడ ఉన్న అందరికంటే కూడా వేగంగా ఆమె రొయ్యలను పట్టుకుంటారు.

గోవిందమ్మ వేలు తమిళనాడులో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన ఇరుళర్ సముదాయానికి చెందినవారు. ఆమె చిన్న బాలికగా ఉన్నప్పటి నుండి రొయ్యలను పట్టుకోవడానికి చెన్నై సమీపంలోని కొసస్తలైయాఱు నదిలో తిరుగుతూనేవున్నారు. ఇప్పుడు 70ల మలివయసులో చూపు మందగించి, గాయాలతో బాధపడుతున్నప్పటికీ, భయంకరమైన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె ఈ పనిని కొనసాగించేలా బలవంతం చేస్తున్నాయి.

చెన్నై ఉత్తర భాగంలోని కొసస్తలైయాఱు నది పక్కనే ఉన్న బకింగ్‌హామ్ కాలువలో ఆమె తన పనిలో మునిగివుండగా నేనీ వీడియోను చిత్రీకరించాను. రొయ్యలను పట్టుకోవడానికి కాలువలోకి దూకుతూనే, మధ్య మధ్య తన జీవితం గురించీ, రొయ్యలను ఇలా పట్టుకోవటమే తనకు తెలిసిన ఏకైక విద్య ఎలా అయిందో దానిగురించీ ఆమె మాట్లాదుతున్నారు.

గోవిందమ్మ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar
Text Editor : Vishaka George

Vishaka George is Senior Editor at PARI. She reports on livelihoods and environmental issues. Vishaka heads PARI's Social Media functions and works in the Education team to take PARI's stories into the classroom and get students to document issues around them.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli