ఈ ఆవరణ గుర్తుకొస్తుంది, నీ పనిపాటలు గుర్తుకొస్తాయి
పరాయిని, అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది

ఒక యువతి తన వివాహ వేడుక ముగిసిన తర్వాత అత్తమామల ఊరికి వెళుతూ దిగులుగా ఈ పాట పాడుతుంది. ఒక స్త్రీ తన కుటుంబం నుంచీ స్నేహితుల నుంచీ బాధాకరంగా విడిపోవడం గురించిన పాటలు, బాణీలు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్కృతీ సంప్రదాయాలలో సర్వసాధారణం. వివాహ సమయంలో పాడే ఈ పాటలు మౌఖిక సంప్రదాయాల గొప్ప భాండాగారంలో ఒక ముఖ్యమైన భాగం.

పాటలు, వాటి రూపంలోనూ విషయంలోనూ సరళంగా కనిపిస్తాయి, వివిధ తరాల ద్వారా ప్రయాణించి, సంరక్షించబడి, కొన్నిసార్లు సొంతంచేసుకోబడతాయి. గుర్తింపు- తరచుగా జెండర్‌పరమైన - సామాజిక నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. పితృస్వామ్య సమాజంలో వివాహం అనేది స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక సంఘటన మాత్రమే కాదు, అది ఆమె గుర్తింపు నిర్మాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి కూడా. ఇప్పటివరకు ఆమె జ్ఞాపకాలు, కుటుంబాలు, స్నేహాలు, స్వేచ్ఛకు నెలవుగా నిలబడిన ఇంటి ఆవరణలు, ఇప్పటి నుండి ఆమెకు అపరిచితంగా, దూరంగా మారతాయి. సంస్కృతుల ఆదేశంతో, ఆమె జీవితంలో అప్పటివరకూ దగ్గరగా ఉన్న ప్రతిదీ దూరమైపోతుంది. ఇది ఆమెలో బలమైన భావోద్వేగాలను మేల్కొల్పుతుంది.

ముంద్రా తాలూకాలోని భద్రేశర్ గ్రామంలోని ముస్లిమ్ సముదాయానికి చెందిన జూమా వా ఘేర్ అనే మత్స్యకారుడు అందించిన ఈ పాట, 2008లో ప్రారంభమైన సాముదాయక రేడియో స్టేషన్ సుర్‌వాణి రికార్డ్ చేసిన 341 పాటలలో ఒకటి. కెఎమ్‌విఎస్ ద్వారా PARIకి లభించిన ఈ పాటలు ఈ ప్రాంతపు అపారమైన సాంస్కృతిక, భాషా, సంగీత వైవిధ్యాన్ని సంగ్రహిస్తాయి. ఎడారి ఇసుకలో మసకబారుతున్న రాగాల కచ్ ప్రాంతపు సంగీత సంప్రదాయాన్ని సంరక్షించడంలో ఈ పాటల సేకరణ సహాయపడుతుంది.

తాను స్వేచ్ఛగా చెప్పుకోలేని భావనలను, తన ఆందోళనలను, భయాలను పాటల ద్వారా, పాడటం ద్వారా వ్యక్తీకరించడం ఆమెకు సురక్షితం.

భద్రేశర్‌కు చెందిన జూమా వాఘేర్ పాడుతోన్న జానపద గీతాన్ని వినండి

કરછી

અંઙણ જાધ પોંધા મૂકે વલણ જાધ પોંધા (૨)
આંઊ ત પરડેસણ ઐયા મેમાણ. જીજલ મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા,મિઠડા ડાડા જાધ પોંધા (૨)
આઊ ત પરડેસણ ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
આઊ ત વિલાતી ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા બાવા જાધ પોંધા (૨)
આઊ તા રે પરડેસણ બાવા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
આઊ તા વિલાતી ઐયા મેમાણ, જીજલ મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા કાકા જાધ પોંધા (૨)
આઊ તા પરડેસણ કાકા મેમાણ,માડી મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા મામા જાધ પોંધા (૨)
આઊ તા રે ઘડી જી મામા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા (૨)
આઊ તા વિલાતી ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મિઠડા વીરા જાધ પોંધા (૨)
આઊ તા રે પરડેસી મેમાણ, વીરા મૂકે અંઙણ જાધ પોંધા
અંઙણ જાધ પોંધા મૂકે વલણ જાધ પોંધા (૨)
આઊ તા રે પરડેસણ ઐયા મેમાણ, માડી મૂકે અંઙણ જાધ પોંધા
આઊ તા વિલાતી ઐયા મેમાણ, જીજલ મૂકે અંઙણ જાધ પોંધા
આઊ તા રે ઘડી જી ઐયા મેમાણ,માડી મૂકે અંઙણ જાધ પોંધા (૨)
અંગણ યાદ પોધા મુકે વલણ યાદ પોધ

తెలుగు

ఈ ఆవరణ గుర్తుకొస్తుంది, నీ పనిపాటలు గుర్తుకొస్తాయి
పరాయిని, అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది
ఈ ఆవరణ గుర్తుకొస్తుంది, నా ప్రియమైన దాదా- మా తాత గుర్తుకొస్తాడు (2)
నేనొక పరాయిని తాతా, ఒక అతిథిని. నా ప్రియమైన అమ్మా, నాకీ ఆవరణే గుర్తుకొస్తోంది
పరాయిని, అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది
ఈ ఆవరణ, నా ప్రియమైన బావా- నా ప్రియమైన నాన్న గుర్తుకొస్తాడు(2)
నేను మరో ప్రాంతానికి చెందినదాన్నయిపోతాను నాన్నా, నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఆవరణే గుర్తుకొస్తుంది
పరాయిని, అతిథిని. ప్రియమైన జీజల్- నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది
ఈ ఆవరణ, నా ప్రియమైన కాకా, నాకు నా చిన్నాన్న గుర్తుకొస్తాడు (2)
నేనొక పరాయిని నా ప్రియమైన చిన్నాన్నా, ఒక అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది
ఈ ఆవరణ, నా ప్రియమైన మామా- నాకు నా మేనమామే గుర్తుకొస్తాడు (2)
నేనొక పరాయిని నా ప్రియమైన మామయ్యా, ఒక అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఆవరణే గుర్తుకొస్తుంది
పరాయిని, అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది
ఈ ఆవరణ, నా ప్రియమైన వీరా- నాకు నా ప్రియమైన తమ్ముడే గుర్తుకొస్తాడు (2)
నేనొక పరాయిని నా ప్రియమైన తమ్ముడా, ఒక అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది
ఈ ఆవరణ, నీ పని పాటలు, అవన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి (2)
పరాయిని, అతిథిని. నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది
నేనొక పరాయిప్రాంతపు అతిథిని. ప్రియమైన జీజల్- నా ప్రియమైన ఓ అమ్మా నాకు మన ఆవరణే గుర్తుకొస్తుంది
నేను చాలా కొద్ది కాలమే ఇక్కడ ఉండేందుకు వచ్చాను, ఓ నా ప్రియమైన అమ్మా నాకు మన ఇల్లే గుర్తుకొస్తుంది (2)
ఈ ఆవరణ, నీ పనిపాటలు. అన్నీ, అందరూ, నాకు ఎంతగానో గుర్తుకు వస్తుంటారు...

PHOTO • Priyanka Borar

పాట స్వరూపం : సంప్రదాయ జానపద గీతం

శ్రేణి : పెళ్ళి పాటలు

పాట : 4

పాట శీర్షిక : ఆండణ్ జాధ్ పోంధా మూకే, వలణ్ జాధ్ పోంధా

స్వరకర్త : దేవల్ మెహతా

గానం : ముంద్రా, భడేశర్‌కు చెందిన జూమా వాఘేర్. ఈయన 40 ఏళ్ళ వయసున్న మత్స్యకారుడు

ఉపయోగించిన వాయిద్యాలు : హార్మోనియం, డ్రమ్ బాంజో

రికార్డ్ చేసిన సంవత్సరం : 2012, కెఎమ్‌విఎస్ స్టూడియో

గుజరాతీ అనువాదం : అమద్ సమేజా, భారతి గోర్


ప్రీతి సోనీ, కెఎమ్‌విఎస్ కార్యదర్శి అరుణా ఢోలకియా, కెఎమ్‌విఎస్ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమద్ సమేజాల సహకారానికి; గుజరాతీ అనువాదంలో అమూల్యమైన సహాయం చేసినందుకు భారతీబెన్ గోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli