'కనిపించే పని, కనిపించని మహిళలు' దృశ్యప్రయాణానికి (విజువల్ టూర్) స్వాగతం

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

దేశంలోని గ్రామీణ ప్రాంతాల  మహిళలు చేసే వివిధ రకాల ఉన్నతస్థాయి పనుల వాస్తవ చిత్రాలను చూపించే ఈ దృశ్య ప్రయాణంలో పాఠకులు, సందర్శకులు మొత్తంగా అసలు సిసలైన ఛాయాచిత్ర ప్రదర్శనను చూస్తారు. ఈ ఛాయాచిత్రాలన్నీ 1993 నుండి 2002 వరకు భారతదేశంలోని పది రాష్ట్రాల్లో తిరుగుతూ పి. సాయినాథ్ తీసినవి. ఇందులో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన మొదటి దశాబ్దం మొదలుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం కావడానికి రెండు సంవత్సరాల ముందు వరకు తీసిన ఛాయాచిత్రాలు ఉన్నాయి.

ఈ ప్రదర్శనలో చేర్చబడిన నాలుగు సెట్ల ఛాయాచిత్రాలను 2002 నుండి, ఒక్క భారతదేశం నుండే 700,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ ఛాయాచిత్రాలు బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఫ్యాక్టరీ గేట్లు, వ్యవసాయ కార్మికులు, ఇంకా ఇతర రంగాల కార్మికులు తీసే పెద్ద పెద్ద ర్యాలీలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌లో మొదటిసారిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.

'కనిపించే పని, కనిపించని మహిళలు ' అనే ఈ ప్రదర్శన, పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన, జాగ్రత్తగా ఎంపిక చేయబడిన నిశ్చల ఛాయాచిత్రాలతో [చాలా పెద్దసైజు ఛాయాచిత్రాలతో సహా వీటి గురించి వివరించే కొన్ని మాటలు కూడా] సృజనాత్మకంగా ఆన్‌లైన్‌లో పరిచయం చేయబడినది. ఇటువంటి ప్రదర్శనలలో బహుశా, ఇదే మొట్టమొదటి ప్రదర్శన కావచ్చు.  ప్రతి ప్యానెల్‌లో సగటున 2 నుండి 3 నిమిషాల నిడివిగల వీడియో కూడా చేర్చబడింది. ప్రదర్శన ముగిసే చివరి ప్యానెల్‌లో 7 నిమిషాల నిడివిగల వీడియో ఉంటుంది.

ఈ ప్రదర్శనలో మీరు, ఏకకాలంలో వీక్షకులుగా వీడియోను చూడవచ్చు, ఫోటోగ్రాఫర్ వ్యాఖ్యానాన్ని వినవచ్చు, ఫోటో గురించి రాసివున్న మాటలను కూడా చదవవచ్చు, ప్రతి స్టిల్-ఫోటోను మెరుగైన రిజల్యూషన్‌లో చూడవచ్చు.

పేజీలోని వీడియోను చూసిన తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి మీరు ఇవన్నీ చేయవచ్చు. ప్రతి పేజీలోని వీడియో క్రింద, ఆ నిర్దిష్ట ప్యానెల్‌కు సంబంధించిన టెక్స్ట్, స్టిల్ ఫోటోలు ఉంటాయి.

మీకు కావాలంటే, ఈ క్రింద ఒక్కో ప్యానెల్ కింద ఇచ్చిన లింక్‌లపై క్లిక్ చేసి, ఆయా ప్యానెల్‌ను చూడవచ్చు. ఆ విధంగా మీరు మీకు ఆసక్తిని కలిగించే వాటిపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే, మొత్తం ప్రదర్శనను ఒకే వీడియోలో కూడా చూడవచ్చు. అందుకు సంబంధించిన లింక్ దిగువ సిరీస్‌లో చివర ఉంది.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ప్యానల్ 9బి: తలపై ' మల' భారం!


PHOTO • P. Sainath

లేదా మొత్తం ఒకే షాట్‌లో (దీనికి 32 నిమిషాలు పడుతుంది, అయితే మొత్తం ప్రదర్శనను ప్యానెల్ వారీగా మీకు చూపెడుతుంది). టెక్స్ట్‌ని చదవడానికి, మీరు ఒక్కో ప్యానెల్ పేజీలకు వెళ్లాల్సివుంటుంది. 32 నిమిషాల పూర్తి ప్రదర్శనకు లింక్ ఇక్కడ ఉంది:

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli