గ్రామీణ భారతీయులు స్వతంత్రానికి సైనికులుగా, ఇప్పటివరకు చూడని గొప్ప వలస వ్యతిరేక తిరుగుబాట్లకు నాయకులుగా వ్యవహరించారు. భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడానికి లెక్కలేనంతమంది  తమ జీవితాలను త్యాగం చేశారు. కానీ వీరిలో చాలామంది, స్వాతంత్య్రం వచ్చాక దేశం, భారతదేశపు స్వేచ్ఛా వక్రీకరించి దానిని అసలు అర్థం కోల్పోవడాన్ని స్వయంగా చూసి చాలా యాతనపడ్డారు. 1990ల నుండి, నేను చివరిగా జీవించిన అనేకమంది స్వాతంత్య్ర  సమరయోధుల జీవితాలను రికార్డ్ చేసాను. వాటిలో ఐదు కథలను ఇక్కడ మీరు చూడవచ్చు:

సాలిహాన్ రాజు మీద ఎదురుదాడి చేయగా

ఒడిశాలోని నువాపడాలో డేమాతి డే సబర్, ఆమె స్నేహితులు తుపాకీతో బ్రిటిష్ అధికారులను ఎదుర్కొన్నారు

ఆగష్టు 14, 2015 I పి సాయినాథ్

పనిమారా స్వాతంత్ర క్షేత్ర యోధులు - 1

సంబాల్పూర్ కోర్టును ఒడిషా గ్రామ పేదలు ఆధీనంలోకి తీసుకున్న వైనం

జులై 22, 2014 l పి సాయినాథ్

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2

ఒడిశాలోని చిన్న ఊరు 'ఫ్రీడమ్ విలేజ్' అనే పేరును సంపాదించుకుంది

జులై 22, 2014 l పి సాయినాథ్

లక్ష్మీ పాండా ఆఖరి పోరాటం

పేదరికంలో కొట్టుమిట్టాడుతోన్న ఈ INA స్వాతంత్ర సమరయోధురాలు ఈ దేశం నుండి కోరింది, గుర్తింపు మాత్రమే. స్వతంత్రం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఈ వృద్ధ యోధురాలి పోరాటం కొనసాగుతూనే ఉంది

ఆగష్టు 5, 2015 l పి సాయినాథ్

తొమ్మిదిదశాబ్దాల అహింస

బాజీ మహమ్మద్, స్వాతంత్య్రం వచ్చిన 60 సంవత్సరాల తర్వాత కూడా అహింసా పోరాటాలు కొనసాగిస్తున్న యోధుడు

ఆగష్టు 14, 2015 l పి సాయినాథ్

వీటితో పాటుగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొదట ప్రచురించబడిన ఐదు కథల ను ఇంకా చాలా ఎక్కువ ఛాయాచిత్రాలతో ఇక్కడ మళ్లీప్రచురించాము. ఆ 'మర్చిపోయిన స్వేచ్ఛల' శీర్షికలు గొప్ప తిరుగుబాట్లకు నెలవైన గ్రామాల చుట్టూ అల్లినవి. భారత స్వాతంత్య్రం అనేది పట్టణ ఉన్నత వర్గాల సొత్తు కాదు. గ్రామీణ భారతీయులు చాలా ఎక్కువ సంఖ్యలో, రకరకాల స్వేచ్ఛల కోసం పోరాడారు. ఉదాహరణకు, 1857 లో ముంబై కోల్‌కతాలోని ఉన్నతవర్గాలు బ్రిటిష్ వారితో కుమ్మక్కై ఉన్నప్పుడు అనేక పోరాటాలు గ్రామ స్థాయిలోనే జరిగాయి. ఇక 1997 లో, స్వాతంత్య్రం వచ్చిన 50 ఏళ్లకు, నేను ఈ  గ్రామాలకు మరిచిపోయిన స్వాంతంత్య్ర  గాధలను తెలుసుకోడానికి వెళ్లాను:

షేర్ పూర్ - పెద్ద త్యాగం, గుర్తులేని జ్ఞాపకం

1942 లో జెండాను ఎగరేసిన ఉత్తర ప్రదేశ్, అందుకు తగిన మూల్యం కూడా చెల్లించింది

ఆగష్టు 14, 2015 l పి సాయినాథ్

గోదావరి: నేటికీ పోలీసులు దాడికై వేచివున్నారు

ఆంధ్రలోని రంప గ్రామం నుండి, అల్లూరి సీతారామరాజు వలసవాదం పై మన దేశ చరిత్రలో గొప్ప తిరుగుబాటుకు సారధ్యం వహించారు

ఆగష్టు 14, 2015 l పి సాయినాథ్

సోనాఖాన్: వీర్ నారాయణ్ రెండు సార్లు మృతి చెందిన వైనం

చత్తీస్‌ఘడ్‌లో వీర్ నారాయణ్ దాన ధర్మాల కోసం ఏనాడూ ఎగబాకలేదు, న్యాయం కోసమే పోరాడుతూ ప్రాణాలు విడిచాడు

ఆగష్టు 14, 2015 l పి సాయినాథ్

కల్లియస్సేరి: సుముకన్ కోసం వెతికే ఒక ప్రయత్నం

బ్రిటీష్ వారిని, స్థానిక జమీందారులను, కుల వ్యవస్థను - అన్నింటినీ ఎదురోడి పోరాడిన గ్రామం

ఆగష్టు 14, 2015 l పి సాయినాథ్

కల్లియస్సేరి: యాభైల్లో కూడా వీడని పోరాటం

వేటగాళ్ల దేవుడు కేరళ కమ్యూనిస్టులను దాపెట్టిన వైనం

ఆగష్టు 14, 2015 l పి సాయినాథ్

ఇప్పుడు వారి 90 వ దశకంలో ఉన్నస్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను PARI గుర్తించి డాక్యుమెంట్ చేయడం కొనసాగిస్తోంది.

అనువాదం: అపర్ణ తోట

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

کے ذریعہ دیگر اسٹوریز Aparna Thota