"ఈ రోజుల్లో మీరు ప్రతిదీ దుకాణాల్లో  కొనుక్కోవచ్చు, కానీ గిరిజన తెగలు తమ మతపరమైన ఆచారాల్లో ఉపయోగించే మట్టి కుండలు మాత్రం కోట తెగలోని మహిళా కుమ్మరులు మాత్రమే తయారు చేయగలరు." అని 63 ఏళ్ల సుగి రాధాకృష్ణన్ అన్నది. ఆమె సుదీర్ఘమైన వారసత్వం గల తిరుచిగాడి మహిళా కుమ్మరి వర్గానికి చెందింది. తిరుచిగాడి అనేది ఒక గిరిజన తండా. దాన్ని మన సుగి రాధాకృష్ణన్ “తీర్చికాడ్” అని అంటుంది ఎందుకంటే, కోట తెగ ప్రజలు తమ తండాలను మామూలుగా కాక కాస్త  వేరే పేర్లతో పిలుస్తారు. ఈ తండా తమిళనాడు నీలగిరి జిల్లాలోని ఉదగమండలం తాలూకా లో కోటగిరి అనే నగరానికి దగ్గర్లో ఉంది..

సాధారణంగా ఇంటి దగ్గర, సుగి కోట మహిళల సాంప్రదాయ దుస్తులైన టోగా (పై వస్త్రం) లాగా ముడివేసిన మందపాటి తెల్లని దుప్పటి (దాన్ని కోట భాషలో దుప్పిట్ అని అంటారు) మరియు వరాడ్ అనే తెల్లని శాలువా ధరిస్తుంది. తిరుచిగాడికి చెందిన స్త్రీ పురుషులు, కోటగిరి మరియు ఇతర నగరాల్లో పనిచేసేటప్పుడు తమ తండాలో వేసుకొనే సాంప్రదాయ దుస్తులను ప్రతిసారి వేసుకోరు. సుగి నూనె అంటిన తన జుట్టును అడ్డంగా వేలాడే కొప్పులాగా, ఆ తెగ మహిళలకు మాత్రమే కుదిరే ప్రత్యేకమైన శైలిలో చుట్టుకుంది. ఆమె మా అందరిని తన ఇంటికి పక్కనే వున్న చిన్న కుమ్మరి గదికి ఆహ్వానించింది.

"నేనేమి ఒక పద్దతి ప్రకారం మట్టి పాత్రలు ఎలా తయారు చేయాలో ‘నేర్చుకోలేదు’. నేను మా అమ్మమ్మను, ఆమె చేతులు తిప్పే విధానాన్ని గమనించేదాన్ని, అలా ఈ పాత్రలు చేయడం నేర్చుకున్నాను. ఒక స్థూపాకారంలోని మట్టి కుండను వృత్తాకారంలోకి మార్చడానికి కొన్ని గంటల పాటు బయటి వైపు నుండి ఒక చెక్క తెడ్డుతో కొడుతూ నున్నగా చేయాలి. అదే సమయంలో నున్నగా వున్న గుండ్రని రాయితో లోపలి వైపు రుద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రంధ్రయుక్తత (అతిసూక్ష్మామైన రంధ్రాలు కలిగి వుండే స్వభావం) తగ్గుతుంది. అలాగే మట్టికుండ కు రెండు వైపులా, పైన చెప్పిన చెక్క తెడ్డు బయటి వైపు, నున్నని రాయి, లోపల వైపు సమాంతరంగా కదుల్చుతూ ఉండాలి. అలా కదల్చకపోతే ఒత్తిడివల్ల పాత్రలో పగుళ్లు వస్తాయి. చక్కగా తయారైన ఈ పాత్రలలో వండిన అన్నం అత్యంత రుచిగా ఉంటుంది. కొద్దిగా చిన్న మూత గల పాత్రల్లో సాంబారు వండుతారు. ఒకసారి మీరు కచ్చితంగా రుచిచూడాలి." అంటూ ముగించింది సుగి.

PHOTO • Priti David
PHOTO • Priti David
PHOTO • Priti David

తిరుచ్చగడి లో కుమ్మరి ఆడవాళ్ల  దీర్ఘ కళా వారసత్వం అందిపుచ్చుకున్న అరవై మూడేళ్ళ సుగి, కుండలు తయారు  చేయడం తన  అమ్మమ్మలను  గమనించి తెలుసుకున్నానని  చెబుతుంది.

దక్షిణ భారతం లో నీలగిరి పర్వతాల్లో ఒక్క కోట తెగకు చెందిన మహిళలు మాత్రమే ఈ పాత్రలు చేసి పనిలో నిమగ్నమై ఉన్నారు. వీరి జనాభా చాలా పరిమితంగా ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ,102 గృహాల్లో కేవలం 308 మంది మాత్రమే కోట తెగ వాసులు ఉన్నారు. కానీ ఈ సంఖ్యను ఆ తెగకు చెందిన నాయకులు విభేదిస్తున్నారు, వారి అంచనా ప్రకారం దాదాపు 3000 వేల మంది వరకు కోట తెగ వాసులు అక్కడ నివసిస్తున్నారు. (ఆ నాయకులు ఒక సరైన జనాభా సర్వే చేయాలనీ జిల్లా కలెక్టర్ కు వినతులు చేస్తూ వున్నారు)

తండాకు దగ్గర్లోని మైదానాల్లో మట్టిని ఏరి తీసుకురావడం అక్కడి మహిళలు ఉత్సవం లాగా జరుపుకుంటారు. ఇలా మట్టిని తీసుకురావడమే  కాక, మట్టిపాత్రను  అనుకున్నఆకృతి ని తీసుకురావడం నుంచి , మంటలో కాల్చడం వరకు ముఖ్యమైన అన్ని పనులు మహిళలే చేస్తారు. పురుషులు  కుమ్మరి చక్రాన్ని తిప్పడం  మాత్రమే చేస్తారు. గతంలో కోట తెగ మహిళలు కుండలను కేవలం మతాచారాల కోసమే కాకుండా, రోజువారీ భోజన మరియు వంట అవసరాలకు, గింజలు, నీళ్లు నిల్వ చేసుకునేందుకు కుండలు చేయడమే కాక, మట్టి దీపాలు, మట్టి పైపులు కూడా తయారుచేసేవారు. మైదానాల నుండి స్టీలు, ప్లాస్టిక్ పాత్రలు రాక ముందు కొండ ప్రాంతాల్లో ఉపయోగించే పాత్రలన్నీ కోట మహిళలు తయారు చేసినవే.

దేశంలో మామూలుగా మగవారి ఆధిపత్యంలో నడిచే కుమ్మరి పరిశ్రమకు కోట ప్రాంతం ఒక అసాధారణ ఉదాహరణ. కోట మహిళలు కాకుండా చరిత్రలో లిఖించబడిన మహిళా కుమ్మర్లు అతి కొద్దిమందే. మద్రాసు జిల్లా గజెట్ 1908 లో ది నీలిగిరిస్ అనే శీర్షిక కింద కోట తెగ గురించి ఇలా వుంది. " .... కోట తెగ ప్రజలు ఇతర కొండ జాతి వాసులకు  సంగీతకారులుగా కళాకారులుగా తెలుసు. వీరిలో మగవారు స్వర్ణకారులు, వడ్రంగులు, కుమ్మర్లు, తోలు కార్మికులు వంటి పనులు చేస్తారు.  మహిళలు మాత్రం కుమ్మరి చక్రం మీద మట్టి కుండలు తయారుచేస్తారు."

"మా తెగ మహిళలు మాత్రమే మట్టి కుండలు చేయగలరు", అని ఆ తెగ పెద్దయిన 65 ఏళ్ల మంగలి షణ్ముగం నిశ్చయ స్వరంతో అన్నారు. షణ్ముగం బ్యాంకు అఫ్ ఇండియా లో మేనేజర్ గా పదవి విరమణ పొంది ఫుడ్డు కోటగిరికి చెందిన కోట తండాలో నివసిస్తున్నారు. "మా గ్రామంలో కుమ్మరి లేకపోతే సహాయం కోసం పక్క గ్రామం నుండి మహిళను పిలవాల్సిందే." అని అన్నారు.

కోట సంస్కృతి లో మతమూ కుమ్మరి పని బలంగా ముడిపడి ఉంటాయి. మట్టి సేకరణ, ఏటా జరిగే 50 రోజుల ఉత్సవంతో మొదలవుతుంది. అ ఉత్సవం కోట తెగ కుల దైవం కామాత్రయ మరియు అతని పత్ని ఆయనూర్ కు అంకితం చేయబడింది. గత ఏడాది పండగ సందర్బంగా సుగి దాదాపు 100 మట్టి కుండలు చేసింది. "ఉత్సవం డిసెంబర్/జనవరి లో అమావాస్య తరువాత వచ్చే మొదటి సోమవారం నాడు మొదలు అవుతుంది. ఉత్సవంలో భాగంగా ప్రధాన అర్చక దంపతులు, ఊరేగింపును మట్టి తెచ్చే పవిత్ర స్థలానికి నడిపిస్తారు. వాద్యకారులు మన్ ఎట్ కోడ్’ [మట్టిని తీసుకో]’ అనే ప్రత్యేకమైన రాగాన్ని కొల్లే (వేణువు)పై, టాపిట్ & దొబ్బర్ (డప్పులు) పై, కొబ్ (బాకా) పై వాయిస్తారు. మొదట కార్ప్మ్యాన్ (నల్ల బంకమట్టి) ని తరువాత అవార్మన్ (బూడిద బంకమట్టి) ని వెలికి తీస్తారు. ఈ మొత్తం ప్రసహనం లో బయటివాళ్ళను అసలు అనుమతించరు. తరువాతి నాలుగు నెలలు కుండలు చేయడంలో నిమగ్నమై పోతారు కోట తెగ మహిళలు, శీతాకాలపు  ఎండ మరియు గాలి మట్టి కుండలు త్వరగా ఆరడానికి ఎంతో దోహదపడతాయి.” అంటూ వివరించింది సుగి.

PHOTO • Priti David
PHOTO • Priti David

శీతాకాలం లో  ఆడవారు వందల కొద్దీ కుండలు తయారు చేస్తారు. వారు  మట్టిని తీసుకురావడం , దానిని మెత్తబరిచి ఒక ఆకృతినివ్వడం, కాల్చడం చేస్తారు. ఈ మొత్తం పని లో  పురుషులు కుమ్మరి చక్రాన్ని తిప్పడం మాత్రమే చేస్తారు.

కోట తెగలో కాలం మారుతున్నా ఈ కుమ్మరి హస్తకళ సజీవంగా ఉండడానికి, కళకు సంస్కృతితో వున్న అవినాభావ సంబంధమే కారణం.  "ఇప్పుడు మా తెగ పిల్లలు ఆంగ్ల మాధ్యమ పాఠశాలల కోసం ఎంతో దూరం ప్రయాణం చేస్తారు. ఇంక ఇలాంటి కళను చూసి నేర్చుకోవడానికి ఎవరికి  సమయం వుంది? ఏదేమైనా కనీసం ఏడాదికొకసారి గ్రామంలోని మహిళలంతా కలిసి కూర్చుని పాత్రలను కచ్చితంగా తయారుచేయాలి. తెగలోని అమ్మాయిలకు కళను నేర్చుకోవడనికి కూడా ఇదే సమయం" అని సుగి అన్నారు.

కోటగిరి లో పనిచేస్తున్న కొన్ని స్వచ్చంధ సంస్థలు కోట హస్తకళను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాయి. నీలిగిరి ఆదివాసీ సంక్షేమ సంఘం 2016 -17 సంవత్సరంలో, కోట మహిళలు చేసిన దాదాపు 40000 రూపాయల విలువ గల మట్టి కుండలు మరియు ఇతర కళాఖండాలను అమ్మింది. ప్రభుత్వం  కోటలోని ఏడు తండాలకు ఒక్కటి చొప్పున మట్టిని కలిపే యంత్రాన్ని సమకూరిస్తే ఈ కొనుగోళ్ల విలువను ఇంకా పెంచవచ్చు అని అక్కడి స్వచ్చంధ సంస్థ ప్రతినిధుల నమ్మకం.  “మట్టిని కలిపే యంత్రం గట్టిగా ఘనీభవించిన మట్టిని వాడడంలో ఎంతో సహాయంగా ఉంటుంది, కానీ మేము కేవలం డిసెంబర్ నుండి మార్చ్ వరకు మాత్రమే పనిచేయగలం, మిగిలిన సంవత్సరంలో మట్టి సరిగా ఎండదు, దీన్ని మట్టియంత్రం ఏమీ చేయలేదు." అని సుగి అన్నారు.

కోట హస్తకళను పునరుద్ధరించడం అంత సులువేమీ కాలేదు అని ఆదివాసులతో కలిసి పర్యావరణ అభివృద్ధి కై పనిచేసే కోటగిరిలోని కీస్టోన్ సంస్థ అధినేత స్నేహలత నాథ్ అన్నారు. "మేము ఆ తెగ నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెగ ప్రజలు ఎక్కువ ఉత్సుకత చూపిస్తారని ఆశించాము, కానీ కోట మహిళలు ఈ కళ, కేవలం ఆచార అవసరాలకు మాత్రమే పరిమితమై ఉండాలని కోరుకుంటారు. ఈ హస్తకళ పునరుద్దరణలో ఆ తెగలోని యువతులను మరింత భాగస్వామ్యులను చేయడం మంచిది. అలాగే గ్లేజింగ్ ద్వారా ఈ పురాతన కళను ఆధునీకరించవచ్చు. మేము ఈ గ్లేజింగ్ ని వాడి నవతరం వాడే వినియోగ వస్తవులను తయారు చేసాము." అని స్నేహలత నాథ్ గారు అన్నారు.

సుగి తన భర్త, కొడుకు, కోడలుతో కలిసి ఉంటోంది.  "నేను ఒక కుండను రూ.100 నుండి రూ.250 వరకు కీస్టోన్ సంస్థ లేదా వాటిని మార్కెట్ చేసే TRIFED (అఖిల భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య) వంటి సంస్థలకు అమ్ముతుంటాను." అని అంది. కొంత కాలం క్రితం మరో ముగ్గురు మహిళల సహాయంతో 200 కుండలను చేసింది సుగి. వాటిని అమ్మి, వచ్చిన డబ్బును సహాయం చేసిన వాళ్ళతో పంచుకుంది. కానీ సుగి కుటుంబానికి, అలానే తండాలోని ఇతర కుటుంబాలకు,చాలావరకు వారి ఆదాయం  వ్యవసాయం ద్వారా,  లేదా కోటగిరి, ఇంకా  ఇతర పట్టణాల్లో దొరికే పనుల ద్వారా లభిస్తుంది.

కోట తెగ మహిళల ఆర్ధిక పరిపుష్టి కొరకు, ఆధ్యాత్మికతో చాలా బలంగా ముడిపడివున్న ఈ హస్తకళను ‘వాణిజ్యీకరణ’ లేక ‘ఆధునీకరణ’ చేయాలా వద్దా అనేది చాలా సంక్లిష్టమైన ప్రశ్న.

"ఈ కళ ఎప్పుడూ వ్యాపారం కోసం కాదు, కానీ వేరొక తెగ వారెవరైనా మట్టి పాత్రను తయారు చేసిమ్మని అడిగితే , మేము వారి కోసం తయారుచేస్తాం. వారు అందుకు కొంత ధాన్యాన్ని మాకు ఇస్తారు. ఈ మార్పిడి ధర విక్రేత, కొనుగోలుదారుడి  అవసరాల బట్టి ఉంటుంది" అని షణ్ముగం అన్నారు.

PHOTO • Priti David
PHOTO • Priti David

కుల పెద్దలు - మంగలి షణ్ముగం(ఎడమ ), రాజు లక్ష్మన్న(కుడి) కుండల తయారీలో వారికున్న ఆచార పార్శ్వాన్ని నొక్కి చెప్పినా అందులో ఆర్థిక ఎదుగుదలకు ఉన్న అవకాశాలను కూడా గ్రహించారు.

సుగికి మట్టి పాత్రలు ఆచార అనుసరణకు వాడబడడం అత్యంత ముఖ్యం. కానీ అదనపు ఆదాయం ఎంతైనా ఉపయోగపడుతుంది. "ఆచారాన్ని పాటించడం లో ఏమాత్రం రాజీపడేది లేదు, మరోవైపు ఉన్నది మామూలు వ్యాపారం. కుమ్మరి ఉత్పత్తుల అమ్మకం ద్వారా ప్రతి నెల గణనీయమైన ఆదాయం వస్తే మా మహిళలు సంతోషంగా మట్టి పాత్రలు చేస్తారు. ఈ రోజుల్లో అదనంగా డబ్బు వస్తుందంటే అందరూ స్వాగతిస్తారు.” అని షణ్ముగం అన్నారు.

కోటలోని ఇతర గిరిజనులు కూడా దీన్ని సమ్మతిస్తున్నారు. 28 సంవత్సరాలు, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో డిప్యూటీ మేనేజర్ గా పనిచేసిన పూజారి రాజు లక్ష్మణ, తన ఆధ్యాత్మిక పిలుపుకు స్పందించి ఫుడ్డు కోటగిరిలో స్థిర పడ్డారు. వారి మాటల్లో “వ్యాపారంపై మాకు అంత పట్టింపు లేదు, కోట గిరిజనులు ఎవరి సహాయం లేకుండా వాళ్ళ అవసరాలను వాళ్లే తీర్చుకుంటూ వున్నారు. మా ఆచార అవసరాలకు మాకు మట్టి పాత్రలు కావాలి కాబట్టి మేము వాటి తయారీని కొనసాగిస్తాం, మిగిలిన విషయాలకు అంత ప్రాముఖ్యత లేదు.”

అనువాదానికి సహకరించిన  కీస్టోన్ ఫౌండేషన్ కు చెందిన  ఎం. సెల్వి  కి, పర్మనాథన్ అరవింద్ కు,, NAWA కు చెందిన  బి కే  పుష్ప కుమార్ కు, రచయిత ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అనువాదం : రూబీ

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Ruby