"దాదాపు ముప్పయ్యేళ్ళ క్రితం స్పీతీలో మంచు విపరీతంగా పడేది. అక్కడంతా పచ్చగా ఉండి, గడ్డి కూడా చాలా బాగుండేది," అన్నారు హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహౌల్-స్పీతీ జిల్లాకు చెందిన పశువుల కాపరీ, రైతు కూడా అయిన ఛేరింగ్ అంగ్‌దుయి.

43 ఏళ్ల ఛేరింగ్ సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న లాంగ్జాలో నివసిస్తున్నారు. ఆయనతో పాటు మరో 158 మంది కూడా అక్కడ నివసిస్తున్నారు ( 2011 జనాభా లెక్కలు ). వారిలో ఎక్కువమంది రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన భోట్ సముదాయానికి చెందినవారు. గ్రామంలో నివసించేవారు ఎక్కువగా వ్యవసాయం, పశువుల పెంపకం, పర్యాటకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు

జూలై 2021 చివరలో మేం ఛేరింగ్‌నీ మరికొంతమంది పశువుల కాపరులనూ తమ పశువులను, గొర్రెలను, మేకలను మేపుతుండగా లాంగ్జాలో కలిశాం. తమ పశువులకు గడ్డి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని అప్పుడు వారు మాట్లాడారు.

"ఇప్పుడిక్కడ కొండల్లో మంచు తక్కువగా పడుతోంది. అలాగే వర్షం కూడా ఎక్కువగా పడటంలేదు. దాంతో గడ్డి కూడా మంచిగా పెరగదు," అంటారు ఛేరింగ్. "అందుకనే మేం మా జీవాలను మేత కోసం మరింత ఎత్తుకు తీసుకుపోతాం.”

వీడియో చూడండి : గడ్డికోసం వెదుకులాట

స్పీతీ హిమాచల్ ప్రదేశ్‌కు ఈశాన్య భాగంలో ఉంది. అనేక నదులు ప్రవహించే ఈ ప్రాంతం, ఎత్తైన లోయలతో నిండివుంది. ఇక్క డి చల్లని ఎడారి లాంటి వాతావరణం, భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులను - ప్రత్యేకించి మండు వేసవి నెలలలో - విశేషంగా  ఆకర్షిస్తుంటుంది. తేటగా ఉండే రాత్రి ఆకాశంలో కనిపించే పాలపుంత నక్షత్రమండలాన్ని కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు.

యాదృచ్ఛికంగా కురుస్తున్న హిమపాతం ఛేరింగ్, అతని తోటి పశువుల కాపరుల దైనందిన జీవితాలనూ,  వారి జీవనోపాధినీ ఎలా ప్రభావితం చేస్తోందో ఈ చిత్రంలో చెప్పిన పశువుల కాపరుల కథ చూపిస్తోంది.

“రాబోతున్న సంవత్సరాల్లో ఏదో జరుగబోతుందనీ, ఇక్కడ ఉన్న భేద్‌బక్రియా (గొర్రెలు, మేకలు) అంతరించిపోతాయనీ మేం (గ్రామస్థులు) ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మా జీవాలకు తినేందుకు ఎక్కువ గడ్డి లేదు. మేం దాన్నెక్కడి నుండి తీసుకురాగలం?” ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుండగా అడిగారాయన.

Langza village is situated at an altitude of 14,500 ft above sea level in Lahaul-Spiti district of Himachal Pradesh. There are about 32 households in the village and 91 per cent of the people here belong to the Bhot community, listed as scheduled tribe in the state
PHOTO • Naveen Macro

లాంగ్జా గ్రామం హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ - స్పీతీ జిల్లాలో సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉంది . గ్రామంలో సుమారు 32 కుటుంబాలున్నాయి . ఇక్కడున్నవారిలో 91 శాతం మంది ప్రజలు రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసివున్న భోట్ సముదాయానికి చెందినవారు

All livestock in the village are gathered together to leave with Chhering and others to graze in the mountains
PHOTO • Naveen Macro

పర్వతాలలో మేపడం కోసం ఛేరింగ్ , ఆయన తోటి పశువుల కాపరులతో పంపించడానికి ఒకచోటికి చేర్చిన గ్రామంలోని మొత్తం పశువులు

Chhering’s daughter Tanzin Lucky sometimes travels with the animals. “Lack of water causes the earth to dry and crack over time,” said Chhering
PHOTO • Sanskriti Talwar

ఛేరింగ్ కుమార్తె టాంజిన్ లక్కీ కూడా కొన్నిసార్లు పశువులతో కలిసి ప్రయాణం చేస్తుంది . ' నీరు లేకపోవడం వల్ల భూమి ఎండిపోయి కాలక్రమేణా నెర్రెలువిచ్చుతుంది' అని ఛేరింగ్ చెప్పారు

The village sheep, goats, cattle and donkeys moving towards high altitude areas in search of grazing grounds
PHOTO • Naveen Macro

పచ్చికబయళ్ళను వెతుక్కుంటూ ఎత్తైన ప్రదేశాలకు వెళ్తోన్న గ్రామానికి చెందిన గొర్రెలు , మేకలు , పశువులు , గాడిదలు

Chhering Angdui and other herders waiting for all the animals to gather to take them for grazing to higher pastures
PHOTO • Naveen Macro

అన్ని జంతువులను మేత కోసం ఎత్తైన ప్రాంతంలోని పచ్చిక బయళ్లకు తీసుకువెళ్లడానికి అవి గుమిగూడే వరకు వేచి చూస్తోన్న ఛేరింగ్ అంగ్ దుయి , ఇతర పశువుల కాపరులు

Animals from Langza village grazing in the high altitude areas of Himachal Pradesh
PHOTO • Naveen Macro

హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన కొండల్లో గడ్డి మేస్తున్న లాంగ్జా గ్రామానికి చెందిన పశువులు

Animals returning to the village in the evening after grazing
PHOTO • Naveen Macro

గడ్డి మేశాక సాయంత్రం గ్రామానికి తిరిగి వస్తున్న పశువులు

Chhering Angdui is a farmer and has two cows and a donkey. He worries that livestock will go extinct in Spiti due to global warming
PHOTO • Naveen Macro

ఛేరింగ్ ఆంగ్ దుయి ఒక రైతు . ఆయనకు రెండు ఆవులు , ఒక గాడిద ఉన్నాయి . గ్లోబల్ వార్మింగ్ కారణంగా స్పీతీలో పశువులు అంతరించిపోతాయని ఆయన ఆందోళన చెందుతున్నారు

A glimpse of the Milky Way galaxy visible in the clear night skies
PHOTO • Naveen Macro

తేటగా ఉన్న రాత్రి ఆకాశంలో తళుకులీనుతోన్న పాలపుంత నక్షత్ర మండలం

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sanskriti Talwar

سنسکرتی تلوار، نئی دہلی میں مقیم ایک آزاد صحافی ہیں اور سال ۲۰۲۳ کی پاری ایم ایم ایف فیلو ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Sanskriti Talwar
Photographs : Naveen Macro

نوین میکرو، دہلی میں مقیم ایک آزاد فوٹو جرنلسٹ اور ڈاکیومینٹری فلم ساز ہیں۔ وہ سال ۲۰۲۳ کے پاری ایم ایم ایف فیلو بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Naveen Macro
Text Editor : Vishaka George

وشاکھا جارج، پاری کی سینئر ایڈیٹر ہیں۔ وہ معاش اور ماحولیات سے متعلق امور پر رپورٹنگ کرتی ہیں۔ وشاکھا، پاری کے سوشل میڈیا سے جڑے کاموں کی سربراہ ہیں اور پاری ایجوکیشن ٹیم کی بھی رکن ہیں، جو دیہی علاقوں کے مسائل کو کلاس روم اور نصاب کا حصہ بنانے کے لیے اسکولوں اور کالجوں کے ساتھ مل کر کام کرتی ہے۔

کے ذریعہ دیگر اسٹوریز وشاکا جارج
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

کے ذریعہ دیگر اسٹوریز Sudhamayi Sattenapalli