కుజ్ కెహా తాఁ హనేరా జరేగా కివేఁ
చుప్ రెహా తాఁ షమాదాన్ కి కెహ్‌ణగే

నేనేదైనా చెప్తే, చీకటి దానిని భరించలేదు
కానీ నేను మౌనంగా ఉంటే, దీపస్తంభం ఏం చెప్తుంది?

సుర్‌జీత్ పత్తర్ (1945 -2024) ఎన్నడూ మౌనంగా ఉండేవారిలో భాగంగా లేరు. నిజానికి, తాను జీవించి ఉండగానే తనలో ఒక పాట చనిపోవడాన్ని చూడటం ఆయన పీడకల. అందుకనే ఆయన మాట్లాడారు. ఆయన కవితలలోని సూక్ష్మమైన, వాడియైన పదాల కంటే ఆయన చర్యలు (భారతదేశంలో పెరిగిపోతోన్న మతతత్వం పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరిని వ్యతిరేకిస్తూ 2015లో పద్మశ్రీని తిరిగి ఇవ్వడం) తరచూ బిగ్గరగా మాట్లాడతాయి. దేశ విభజన నుండి పెరుగుతున్న మిలిటెన్సీ వరకు, పెట్టుబడిదారీ వ్యాపారీకరణ నుండి రైతుల నిరసనల వరకు పంజాబ్ సమకాలీన, తరచుగా అల్లకల్లోలమైన వాస్తవాలను అవి పట్టుకొన్నాయి.

జలంధర్ జిల్లాలోని పత్తర్ కలాఁ గ్రామానికి చెందిన ఈ కవి అట్టడుగువర్గాలు, వలసదారులు, కూలీలు, రైతులు, మహిళలు, పిల్లల కోసం రాసిన పాటలు కలకాలం నిలిచాయి.

ఇక్కడ అందించిన 'ఎ కార్నివాల్' అనే కవిత, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు నిరసన చేపట్టిన సమయంలో రాసినది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ చట్టాలని రద్దుచేసింది. ఇది ప్రజాస్వామ్యంలో స్థితిస్థాపకతకూ, అసమ్మతికి సంబంధించిన వేడుక.

జీనా సింగ్‌ పంజాబీలో చదువుతోన్న కవితను వినండి

జాషువా బోధినేత్ర ఆంగ్లంలో చదువుతోన్న కవితను వినండి

ਇਹ ਮੇਲਾ ਹੈ

ਕਵਿਤਾ
ਇਹ ਮੇਲਾ ਹੈ
ਹੈ ਜਿੱਥੋਂ ਤੱਕ ਨਜ਼ਰ ਜਾਂਦੀ
ਤੇ ਜਿੱਥੋਂ ਤੱਕ ਨਹੀਂ ਜਾਂਦੀ
ਇਹਦੇ ਵਿਚ ਲੋਕ ਸ਼ਾਮਲ ਨੇ
ਇਹਦੇ ਵਿਚ ਲੋਕ ਤੇ ਸੁਰਲੋਕ ਤੇ ਤ੍ਰੈਲੋਕ ਸ਼ਾਮਲ ਨੇ
ਇਹ ਮੇਲਾ ਹੈ

ਇਹਦੇ ਵਿਚ ਧਰਤ ਸ਼ਾਮਲ, ਬਿਰਖ, ਪਾਣੀ, ਪੌਣ ਸ਼ਾਮਲ ਨੇ
ਇਹਦੇ ਵਿਚ ਸਾਡੇ ਹਾਸੇ, ਹੰਝੂ, ਸਾਡੇ ਗੌਣ ਸ਼ਾਮਲ ਨੇ
ਤੇ ਤੈਨੂੰ ਕੁਝ ਪਤਾ ਹੀ ਨਈਂ ਇਹਦੇ ਵਿਚ ਕੌਣ ਸ਼ਾਮਲ ਨੇ

ਇਹਦੇ ਵਿਚ ਪੁਰਖਿਆਂ ਦਾ ਰਾਂਗਲਾ ਇਤਿਹਾਸ ਸ਼ਾਮਲ ਹੈ
ਇਹਦੇ ਵਿਚ ਲੋਕ—ਮਨ ਦਾ ਸਿਰਜਿਆ ਮਿਥਹਾਸ ਸ਼ਾਮਲ ਹੈ
ਇਹਦੇ ਵਿਚ ਸਿਦਕ ਸਾਡਾ, ਸਬਰ, ਸਾਡੀ ਆਸ ਸ਼ਾਮਲ ਹੈ
ਇਹਦੇ ਵਿਚ ਸ਼ਬਦ, ਸੁਰਤੀ , ਧੁਨ ਅਤੇ ਅਰਦਾਸ ਸ਼ਾਮਲ ਹੈ
ਤੇ ਤੈਨੂੰ ਕੁਝ ਪਤਾ ਹੀ ਨਈਂ ਇਹਦੇ ਵਿੱਚ ਕੌਣ ਸ਼ਾਮਲ ਨੇ

ਜੋ ਵਿਛੜੇ ਸਨ ਬਹੁਤ ਚਿਰਾ ਦੇ
ਤੇ ਸਾਰੇ ਸੋਚਦੇ ਸਨ
ਉਹ ਗਏ ਕਿੱਥੇ
ਉਹ ਸਾਡਾ ਹੌਂਸਲਾ, ਅਪਣੱਤ,
ਉਹ ਜ਼ਿੰਦਾਦਿਲੀ, ਪੌਰਖ, ਗੁਰਾਂ ਦੀ ਓਟ ਦਾ ਵਿਸ਼ਵਾਸ

ਭਲ਼ਾ ਮੋਏ ਤੇ ਵਿਛੜੇ ਕੌਣ ਮੇਲੇ
ਕਰੇ ਰਾਜ਼ੀ ਅਸਾਡਾ ਜੀਅ ਤੇ ਜਾਮਾ

ਗੁਰਾਂ ਦੀ ਮਿਹਰ ਹੋਈ
ਮੋਅਜਜ਼ਾ ਹੋਇਆ
ਉਹ ਸਾਰੇ ਮਿਲ਼ ਪਏ ਆ ਕੇ

ਸੀ ਬਿਰਥਾ ਜਾ ਰਿਹਾ ਜੀਵਨ
ਕਿ ਅੱਜ ਲੱਗਦਾ, ਜਨਮ ਹੋਇਆ ਸੁਹੇਲਾ ਹੈ
ਇਹ ਮੇਲਾ ਹੈ

ਇਹਦੇ ਵਿਚ ਵਰਤਮਾਨ, ਅਤੀਤ ਨਾਲ ਭਵਿੱਖ ਸ਼ਾਮਲ ਹੈ
ਇਹਦੇ ਵਿਚ ਹਿੰਦੂ ਮੁਸਲਮ, ਬੁੱਧ, ਜੈਨ ਤੇ ਸਿੱਖ ਸ਼ਾਮਲ ਹੈ
ਬੜਾ ਕੁਝ ਦਿਸ ਰਿਹਾ ਤੇ ਕਿੰਨਾ ਹੋਰ ਅਦਿੱਖ ਸ਼ਾਮਿਲ ਹੈ
ਇਹ ਮੇਲਾ ਹੈ

ਇਹ ਹੈ ਇੱਕ ਲਹਿਰ ਵੀ , ਸੰਘਰਸ਼ ਵੀ ਪਰ ਜਸ਼ਨ ਵੀ ਤਾਂ ਹੈ
ਇਹਦੇ ਵਿਚ ਰੋਹ ਹੈ ਸਾਡਾ, ਦਰਦ ਸਾਡਾ, ਟਸ਼ਨ ਵੀ ਤਾਂ ਹੈ
ਜੋ ਪੁੱਛੇਗਾ ਕਦੀ ਇਤਿਹਾਸ ਤੈਥੋਂ, ਪ੍ਰਸ਼ਨ ਵੀ ਤਾਂ ਹੈ
ਤੇ ਤੈਨੂੰ ਕੁਝ ਪਤਾ ਹੀ ਨਈ
ਇਹਦੇ ਵਿਚ ਕੌਣ ਸ਼ਾਮਿਲ ਨੇ

ਨਹੀਂ ਇਹ ਭੀੜ ਨਈਂ ਕੋਈ, ਇਹ ਰੂਹਦਾਰਾਂ ਦੀ ਸੰਗਤ ਹੈ
ਇਹ ਤੁਰਦੇ ਵਾਕ ਦੇ ਵਿਚ ਅਰਥ ਨੇ, ਸ਼ਬਦਾਂ ਦੀ ਪੰਗਤ ਹੈ
ਇਹ ਸ਼ੋਭਾ—ਯਾਤਰਾ ਤੋ ਵੱਖਰੀ ਹੈ ਯਾਤਰਾ ਕੋਈ
ਗੁਰਾਂ ਦੀ ਦੀਖਿਆ 'ਤੇ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਕਾਫ਼ਿਲਾ ਕੋਈ
ਇਹ ਮੈਂ ਨੂੰ ਛੋੜ ਆਪਾਂ ਤੇ ਅਸੀ ਵੱਲ ਜਾ ਰਿਹਾ ਕੋਈ

ਇਹਦੇ ਵਿਚ ਮੁੱਦਤਾਂ ਦੇ ਸਿੱਖੇ ਹੋਏ ਸਬਕ ਸ਼ਾਮਲ ਨੇ
ਇਹਦੇ ਵਿਚ ਸੂਫ਼ੀਆਂ ਫੱਕਰਾਂ ਦੇ ਚੌਦਾਂ ਤਬਕ ਸ਼ਾਮਲ ਨੇ

ਤੁਹਾਨੂੰ ਗੱਲ ਸੁਣਾਉਨਾਂ ਇਕ, ਬੜੀ ਭੋਲੀ ਤੇ ਮਨਮੋਹਣੀ
ਅਸਾਨੂੰ ਕਹਿਣ ਲੱਗੀ ਕੱਲ੍ਹ ਇਕ ਦਿੱਲੀ ਦੀ ਧੀ ਸੁਹਣੀ
ਤੁਸੀਂ ਜਦ ਮੁੜ ਗਏ ਏਥੋਂ, ਬੜੀ ਬੇਰੌਣਕੀ ਹੋਣੀ

ਬਹੁਤ ਹੋਣੀ ਏ ਟ੍ਰੈਫ਼ਿਕ ਪਰ, ਕੋਈ ਸੰਗਤ ਨਹੀਂ ਹੋਣੀ
ਇਹ ਲੰਗਰ ਛਕ ਰਹੀ ਤੇ ਵੰਡ ਰਹੀ ਪੰਗਤ ਨਹੀਂ ਹੋਣੀ
ਘਰਾਂ ਨੂੰ ਦੌੜਦੇ ਲੋਕਾਂ 'ਚ ਇਹ ਰੰਗਤ ਨਹੀਂ ਹੋਣੀ
ਅਸੀਂ ਫਿਰ ਕੀ ਕਰਾਂਗੇ

ਤਾਂ ਸਾਡੇ ਨੈਣ ਨਮ ਹੋ ਗਏ
ਇਹ ਕੈਸਾ ਨਿਹੁੰ ਨਵੇਲਾ ਹੈ
ਇਹ ਮੇਲਾ ਹੈ

ਤੁਸੀਂ ਪਰਤੋ ਘਰੀਂ, ਰਾਜ਼ੀ ਖੁਸ਼ੀ ,ਹੈ ਇਹ ਦੁਆ ਮੇਰੀ
ਤੁਸੀਂ ਜਿੱਤੋ ਇਹ ਬਾਜ਼ੀ ਸੱਚ ਦੀ, ਹੈ ਇਹ ਦੁਆ ਮੇਰੀ
ਤੁਸੀ ਪਰਤੋ ਤਾਂ ਧਰਤੀ ਲਈ ਨਵੀਂ ਤਕਦੀਰ ਹੋ ਕੇ ਹੁਣ
ਨਵੇਂ ਅਹਿਸਾਸ, ਸੱਜਰੀ ਸੋਚ ਤੇ ਤਦਬੀਰ ਹੋ ਕੇ ਹੁਣ
ਮੁਹੱਬਤ, ਸਾਦਗੀ, ਅਪਣੱਤ ਦੀ ਤਾਸੀਰ ਹੋ ਕੇ ਹੁਣ

ਇਹ ਇੱਛਰਾਂ ਮਾਂ
ਤੇ ਪੁੱਤ ਪੂਰਨ ਦੇ ਮੁੜ ਮਿਲਣੇ ਦਾ ਵੇਲਾ ਹੈ
ਇਹ ਮੇਲਾ ਹੈ

ਹੈ ਜਿੱਥੋਂ ਤੱਕ ਨਜ਼ਰ ਜਾਂਦੀ
ਤੇ ਜਿੱਥੋਂ ਤੱਕ ਨਹੀਂ ਜਾਂਦੀ
ਇਹਦੇ ਵਿਚ ਲੋਕ ਸ਼ਾਮਲ ਨੇ
ਇਹਦੇ ਵਿਚ ਲੋਕ ਤੇ ਸੁਰਲੋਕ ਤੇ ਤ੍ਰੈਲੋਕ ਸ਼ਾਮਿਲ ਨੇ
ਇਹ ਮੇਲਾ ਹੈ

ਇਹਦੇ ਵਿਚ ਧਰਤ ਸ਼ਾਮਿਲ, ਬਿਰਖ, ਪਾਣੀ, ਪੌਣ ਸ਼ਾਮਲ ਨੇ
ਇਹਦੇ ਵਿਚ ਸਾਡੇ ਹਾਸੇ, ਹੰਝੂ, ਸਾਡੇ ਗੌਣ ਸ਼ਾਮਲ ਨੇ
ਤੇ ਤੈਨੂੰ ਕੁਝ ਪਤਾ ਹੀ ਨਈਂ ਇਹਦੇ ਵਿਚ ਕੌਣ ਸ਼ਾਮਲ ਨੇ।

ఒక జాతర

కనులు చూడగలిగినంత మేరా, ఆ పై వరకూ కూడా,
ఇందులో భాగమైన, ఇక్కడికి తరలివచ్చిన జన ప్రవాహాన్ని చూస్తున్నాను.
వారు ఈ భూమి ఒక్కదానికే సంబంధించినవారు కారు,
ఈ విశ్వంలోని మూడు ప్రపంచాలకూ చెందినవారు.

ఇది ఒక జాతర
ఇందులో మట్టి, చెట్లు, గాలి, నీరు
మన నవ్వులూ కన్నీళ్ళూ
మన పాటలన్నీ మిళితమై ఉన్నాయి

మరి నువ్వేమో ఏమీ ఎరగనంటున్నావు
ఇందులో పాల్గొన్నవారంతా ఎవరో!

తేజరిల్లిన మన పూర్వీకుల చరిత్ర,
ఈ భూజనుల జానపద గాథలు, ఇతిహాసాలు, పురాణాలు
మన కీర్తనలు, మన సహనం, మన ఆశలు,
దివ్యోక్తి, ప్రాపంచిక గీతాలు,
మన వివేకం, మన ప్రార్థనలు, అన్నీ ఇందులో ఉన్నాయి.

మరి నువ్వేమో ఇదంతా నాకేమీ తెలియదని అంటున్నావు!
అందరికీ ఆశ్చర్యమే,
మనం పోగొట్టుకున్నవన్నీ ఎక్కడికి పోయాయనీ!
మన ధైర్యం, మన ఆత్మీయత, మన సంతోషం, మన సాహసం,
గురువు బోధలపై మనకున్న ఆ నమ్మకం

పోగొట్టుకున్నవాళ్ళని, బ్రతికున్నవాళ్ళని తిరిగి కలపగలిగేది ఎవరు?
శరీరాన్నీ ఆత్మనూ ఎవరు రక్షించగలరు?
కేవలం గురువు అనుగ్రహం తప్ప.

అదిగో, ఆ అద్భుతాన్ని చూడు!
ఇప్పటి వరకూ పనికిరాని, ఎలాంటి ప్రయోజనం లేని జీవితం,
తిరిగి యోగ్యంగానూ అందంగానూ మారిపోయింది.
ఇది ఒక జాతర

ఇందులోనే మన గతం, మన వర్తమానం, మన భవిష్యత్తు ఉన్నాయి.
ఇందులోనే హిందువులు, ముస్లిములు, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఉన్నారు.
ఇందులో మనం చూడగలిగిన విషయాలే ఉన్నాయి
మన దృష్టికి మించినవి కూడా.

ఇది ఒక జాతర,
ఒక కెరటం, ఒక పోరాటం, ఒక వేడుక.
ఇక్కడ కోపం, బాధ, సంఘర్షణ ఉన్నాయి
ఒక ప్రశ్న కూడా ఉందిక్కడ
ఏదో ఒక రోజున చరిత్ర నిన్ను అడిగే ప్రశ్న.

మరి ఇందులో ఎవరి ప్రమేయం ఉందో నీకు తెలియనే తెలియదు!
ఇది గుంపు కాదు, ఇది ఆత్మల కలయిక.
కదలిపోతోన్న వాక్యానికి అర్థం. అవును, ఇది ఒక రకమైన యాత్ర,
ఒక ఊరేగింపు, కానీ పండుగ ఊరేగింపు కాదు.

ఇది అనుచరగణపు బిడారు,
ఒక గురువుకున్న చొరవ కలిగిన శిష్యులు.
'నేను', 'నాకు'లను వెనుక వదిలి
వారు 'మనం ప్రజలం' వైపుకు కదులుతున్నారు.

ఇందులో యుగాల అనుభవాల నుండి నేర్చిన పాఠాలున్నాయి.
ఇందులో సూఫీ ఫకీర్ల పద్నాలుగు ఆదేశాలున్నాయి.

మీకో కథ చెబుతాను, ఒక అందమైన హృద్యమైన కథ.
నిన్న దిల్లీకి చెందిన ఓ అమ్మాయి ఇలా చెప్పింది,
ఈ ప్రదేశం నిర్జనమై పోతుంది
నువ్వు ఇంటికి తిరిగి వచ్చేసరికి.

రోడ్ల మీద చాలా రద్దీ ఉంటుంది, కానీ సోదరభావం ఉండదు.
లంగర్ సేవలందించే జనాల వరసలుండవు.
ఇల్లు చేరేందుకు పరుగులు పెడుతున్నవారి
మొహాలపై మెరుపు ఉండదు.

అలాంటప్పుడు ఏం చేస్తాం?
అప్పటికే మా కళ్ళు చెమ్మగిల్లాయి
ఇది ఎలాంటి ప్రేమ! ఎంతటి సంరంభం!

మీరు సంతోషంగా మీ ఇళ్ళకు తిరిగి రావాలి
ఈ పోరాటంలో సత్యం, విజయం మీ పక్షాన ఉండాలి.
మీరీ భూమికి కొత్త విధిని తీసుకురావాలి,
ఒక కొత్త భావన, కొత్త దృక్పథం, కొత్త పరిష్కారం,
ప్రేమ, సరళత, సామరస్యాల గురుతుగా.

తల్లీ కొడుకులు తిరిగి కలుసుకునే సమయం
రావాలని కోరుతున్నాను. ఇది ఒక జాతర.

కనులు చూడగలిగినంత మేరా, ఆ పై వరకూ కూడా,
ఇందులో భాగమైన, ఇక్కడికి తరలివచ్చిన జన ప్రవాహాన్ని చూస్తున్నాను.
వారు ఈ భూమి ఒక్కదానికే సంబంధించినవారు కారు,
ఈ విశ్వంలోని మూడు ప్రపంచాలకూ చెందినవారు.
ఇది ఒక జాతర.

ఈ కవితను PARIలో ప్రచురించడంలో తమ అమూల్యమైన సహకారాన్ని అందించినందుకు డా. సుర్‌జీత్ సింగ్, పరిశోధనా పండితుడు ఆమిన్ అమితోజ్‌లకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సహాయం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Editor : PARIBhasha Team

PARIBhasha is our unique Indian languages programme that supports reporting in and translation of PARI stories in many Indian languages. Translation plays a pivotal role in the journey of every single story in PARI. Our team of editors, translators and volunteers represent the diverse linguistic and cultural landscape of the country and also ensure that the stories return and belong to the people from whom they come.

Other stories by PARIBhasha Team
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli