ముసహర్ కావడమే మద్యనిషేధ చట్టం కింద శిక్ష పడేటంత నేరమా?
జహానాబాద్ జిల్లాలో మద్య నిషేధానికి సంబంధించిన నేరాలకు గాను అట్టడుగు వర్గానికి చెందిన ముసహర్లనే పట్టుకుపోతున్నారు. ఆ తర్వాత చేయాల్సిన న్యాయ పోరాటాలు చాలా డబ్బు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఆ భారమంతా మొత్తం కుటుంబాల మీద పడుతోంది