ప్రతి ఉదయం ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో ఉండే మాణిక్‌పూర్ రైల్వేస్టేషన్‌కు అనేక గ్రామాల నుంచి జనం వస్తుంటారు. వారిలో ఎక్కువమంది ఆదివాసీ, దళిత సమూహాలకు చెందినవాళ్ళే. చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఊళ్ళ నుంచి వీళ్ళుజనాలను కూడగట్టి చేరవేసే జీపులలోను, ఆటోలలోను, సైకిళ్ళపైనా వస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులలోని పాఠా అడవుల నుంచి ఒక్కొక్కటి 20 నుండి 50 కిలోల బరువుండే వందలాది కట్టెల మోపులను మోసుకొని వస్తారు.

ఆ కట్టెలను సమీపంలోని మార్కెట్లలో అమ్మితే వచ్చే డబ్బే ఆ కుటంబాలకు స్థిరమైన ఆదాయం. చెట్లను సంరక్షించే చట్టాలు చెట్లను నరకడాన్ని నిరోధించాయి. కానీ జీవనాధారం కోసం వంటచెరకును అమ్ముతున్న స్థానిక సమూహాలకు భూములుండవు. కొద్దోగొప్పో ఉన్నా అవి పంటలకు అనువైనవి కావు.  దగ్గరలో ఉన్న పట్టణాలలో భవననిర్మాణ స్థలాల్లో రోజు కూలికి పనిచేస్తే వచ్చే ఆదాయమొక్కటే వారికి నికరమైనది.

మాణిక్‌పూర్, కర్వి(మాణిక్‌పూర్‌కు 30కిలోమీటర్ల దూరం), శంకర్‌ఘర్ లనుంచి తెందు (తునికి), పలాశ్ (మోదుగ) చెట్ల కట్టెల మోపులను తీసుకుని పాసింజర్ రైళ్ళలో  పోతారు. అలహాబాద్ మార్గంలో వెళ్ళే ఆ రైళ్ళలో ప్రయాణించి దాదాపు 80 కిలోమీటర్ల దూరం వరకు ఉండే పట్టణాలలోని మార్కెట్లకు తీసుకుపోయి అక్కడ అమ్ముతారు.

కట్టెల ఎండుదనం, నాణ్యతను బట్టి, ఆయా కాలాల్లో వాటికి ఉండే గిరాకీని బట్టి రోజయ్యేటప్పటికి వీరు 150 నుంచి 300 రూపాయలవరకు సంపాదించగలుగుతారు.

Cutting wood, which will later be taken to the Manikpur railway station and then to markets in towns along the train route
PHOTO • Akshay Gupta

వంట చెరకు కోసం చెట్లను కొడుతున్న దృశ్యం. తర్వాత దీనిని మాణిక్‌పూర్ రైల్వే జంక్షన్‌కు, ఇతర స్టేషన్లకు తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆ రైలు మార్గంలో వచ్చే కొన్ని పట్ణణాలలోని మార్కెట్లకు తీసుకెళతారు

Women crossing the sluice gate of a dam, carrying their daily load of firewood
PHOTO • Akshay Gupta

తాము రోజూ మోసేపాటి కట్టెలను మోస్తూ ఆనకట్ట తూము గేట్లను దాటుతున్న మహిళలు

Crossing a tributary of the Mandakini river after collecting wood from the nearby forest
PHOTO • Akshay Gupta

దగ్గరలోని అడవికి వెళ్ళి కట్టెలను ఏరుకు తెచ్చుకుని మందాకిని ఉపనదిని దాటుతూ

Carrying the firewood across rivers, roads and railways
PHOTO • Akshay Gupta

నదులను దాటుతూ, రోడ్ల మీదుగా, రైలు పట్టాల మీదా బరువైన కట్టెల మోపులు మోసుకుంటూ…

Waiting to load the firewood on the train at Shankargarh station
PHOTO • Akshay Gupta

శంకర్‌ఘర్ స్టేషన్‌లో కట్టెల మోపులను రైలులోకి ఎక్కించడం కోసం ఎదరుచూస్తూ

Waiting for the train to reach the town of Chitrakoot Dham (Karwi) to sell the logs
PHOTO • Akshay Gupta

రైలు చిత్రకూట్ ధామ్ ‌(కర్వి)కు చేరుకుంటోంది,  తమ కలపమొద్దులను అమ్ముకోవడం కోసం కొందరు దిగుతారిక్కడ

A woman unloads the firewood as the train stops at Jasra
PHOTO • Akshay Gupta

రైలు జస్రా దగ్గర ఆగగానే ఈ పెద్ద పెద్ద మోపులను ఒక్కటొక్కటిగా కిందకు దించుతారు

Tired,  returning from the daily chaos of survival. Selling firewood barely brings Rs. 100-300 a day, depending on weather conditions, market demand, and the quality of wood
PHOTO • Akshay Gupta

బతుకుపోరులో భాగంగా రోజంతా అనేకానేక పనులు చేసి అలసిసొలసి చివరగా గూటికి చేరడం కోసం తిరుగుప్రయాణం. ఇంతా చేస్తే వంటచెరకు అమ్మితే వచ్చేది 100 నుంచి 300 రూపాయల లోపే. వాతావరణం, గిరాకీ, వంట చెరకు నాణ్యతలను మీద ఈ  ఆదాయం ఆధారపడి ఉంటుంది

వంటచెరకు అమ్మేవారు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఈ కథనంలో వాళ్ళ పేర్లను ప్రస్తావించలేదు.

అనువాదం: వి.వి. జ్యోతి

Akshay Gupta

अक्षय गुप्ता चित्रकूट धाम (कर्वी) के एक स्वतंत्र फ़ोटो-जर्नलिस्ट हैं, जो अब दिल्ली में रहते हैं.

की अन्य स्टोरी Akshay Gupta
Translator : V. V. Jyothi

V.V. Jyothi is an independent journalist and translator from Hyderabad. Previously she worked as a journalist in Prajasakti and Andhra Jyoti newspapers. Currently she is translating books under organizations such as Prajasakti and Malupu. She also writes articles for women's magazines like Maanavi and Matruka.

की अन्य स्टोरी V. V. Jyothi