భానుడి ప్రతాపం, చలి తీవ్రత, వేడెక్కిపోతున్న చూరూ
జూన్ 2019 లో, ప్రపంచంలో ఎన్నడూ లేనట్లుగా, రాజస్థాన్లోని చూరూ ప్రాంతంలో అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ప్రజలకు ఈ సంఘటన సుదీర్ఘ వేసవి కాలంలో ఒక మైలురాయిగానో, అనూహ్య వాతావరణం లాగానో అనిపించి ఉండవచ్చు కానీ, ఇది వాతావరణ మార్పులను సూచిస్తుంది






















