పక్షులను ఉద్దేశించి, వాటి ద్వారా ప్రేమికుడిని, ప్రియమైనవారిని ఉద్దేశించి పాడే పాటల శ్రేణిలో ఇది మరొక పాట. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సాధారణంగా మామిడి, నేరేడు, ఖిర్ని లేదా రాయన [పాల పళ్ళు] వంటి పండ్లతో విందుచేసుకుంటూ కనిపించే చిలుక ( సూడల )ను ఇక్కడ మనం కలుస్తాం. దీని మెడ చుట్టూ గులాబీ, నలుపు రంగుల వలయం ఉంటుంది. ఈ పాటలో వివాహిత స్త్రీలు ధరించే వివిధ రకాల ఆభరణాల గురించి కూడా ప్రస్తావన వస్తుంది. తన కోసం ఆ ఆభరణాలను తీసుకురమ్మని ప్రేమ పక్షికి ఒక స్త్రీ చేసే అభ్యర్థన ఒక నిక్షిప్త ప్రేమ సందేశం, తనను పెళ్ళాడమని ప్రియుడికి పంపే ఆహ్వానం.
భద్రేసర్ గ్రామానికి చెందిన జుమా వాఘేర్ అందించిన ఈ క్రింది పాటను కఛ్ ప్రాంతంలో తరచుగా వివాహాల సమయంలో పాడతారు.
કચ્છી
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત (૨)
આમૂં જાંભૂં ને રેણ મિઠી, સૂડલા પખી ઘેલી ગૂજરાત.
પગ પિરમાણે સૂડલા પખી કડલા ઘડાય (૨)
કાંભી એ તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
હથ પિરમાણે સૂડલા પખી મુઠીયો ઘડાય (૨)
બંગલીએ તેં હીરલા જડાઈયાં, સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
ડોક પિરમાણે સૂડલા પખી હારલો ઘડાય (૨)
હાંસડી તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
નક પિરમાણે સૂડલા પખી નથડી ઘડાય (૨)
ડામણી તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
આમૂં જાભૂં ને રેણ મિઠી સૂડલા પખી કચ્છડો બારે માસ. (૨)
తెలుగు
కనికరమే లేని మండువేసవి రోజుల్లో
గుజరాత్‌ను మైమరపించే చిలకా
మామిడీ నేరేడూ పాలపళ్ళ తీపిదనంతో
విందులు చేసుకునే చిలకా
పచ్చదనాల కచ్‌లోని పచ్చని చిలకా
నా కాళ్ళను
కడలాల
తో అలంకరించు
వజ్రాలు పొదిగిన
కంభీలు
తీసుకురా
పచ్చదనాల కచ్‌లోని పచ్చని చిలకా
కనికరమే లేని మండువేసవి రోజుల్లో
గుజరాత్‌ను మైమరపించే చిలకా
నా వేళ్ళను
ముత్తియో
లతో అలంకరించు
వజ్రాలు పొదిగిన
బంగడీల
తో నా చేతులను అలంకరించు
పచ్చదనాల కచ్‌లోని పచ్చని చిలకా
కనికరమే లేని మండువేసవి రోజుల్లో
గుజరాత్‌ను మైమరపించే ఓ చిలకా
నాకోసం ఒక
హార్లో
చేసి, నా మెడను అలంకరించు
వజ్రాలు పొదిగిన
హఁసడీ
తీసుకురా
పచ్చదనాల కచ్‌లోని పచ్చని చిలకా
కనికరమే లేని మండువేసవి రోజుల్లో
గుజరాత్‌ను మైమరపించే చిలకా
నా ముక్కుకు ఒక
నథానీ
తీసుకురా
వజ్రాలు పొదిగిన
దామని
తో పాపిటను అలంకరించు
పచ్చదనాల కచ్‌లోని పచ్చని చిలకా
కనికరమే లేని మండువేసవి రోజుల్లో
గుజరాత్‌ను మైమరపించే చిలకా
పాట శైలి: సంప్రదాయ జానపద గీతం
శ్రేణి: పెళ్ళి పాటలు
పాట: 11
పాట శీర్షిక: కారే ఉనారే సూడలా పఖీ ఘేలీ గుజరాత్
గానం: ముంద్రా తాలూకా లోని భద్రేసర్ గ్రామానికి చెందిన జుమా వాఘేర్
ఉపయోగించిన వాయిద్యాలు: డ్రమ్, హార్మోనియం, బాంజో
రికార్డ్ చేసిన సంవత్సరం: 2012, కెఎమ్‌విఎస్ స్టూడియో
ఈ 341 పాటలు, సామాజిక రేడియో సూర్‌వాణి ద్వారా రికార్డ్ చేసినవి. కచ్ మహిళా వికాస్ సంఘటన్ (కెఎమ్‌విఎస్) ద్వారా PARIకి లభించాయి . మరిన్ని పాటల కోసం ఈ పేజీని సందర్శించండి: సాంగ్స్ ఆఫ్ ది రణ్: కచ్ఛీ జానపద గీతాల ఆర్కైవ్
ప్రీతి సోనీ, కెఎమ్‌విఎస్ కార్యదర్శి అరుణా ఢోలకియా, కెఎమ్‌విఎస్ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమద్ సమేజాల సహకారానికి; అమూల్యమైన సహాయం చేసినందుకు భారతీబెన్ గోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
అనువాదం: నీరజ పార్థసారథి