
SANGUR, PUNJAB
|MON, MAY 18, 2026
భారతదేశపు అనేక సంగీత వాయిద్యాల శ్రుతిమేళనం
గ్రామీణ భారతదేశంలో వాయించే సంగీత వాయిద్యాలు ఆ గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే వైవిధ్యభరితంగా ఉంటాయి - హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తంత్రీవాద్యమైన రుబాబ్, టాంబురైన్ను పోలిన ఖంజరి (కంజీర); పశ్చిమ బెంగాల్‌కు చెందిన బనామ్, గబ్గుబి; మహారాష్ట్రకు చెందిన భారీ కొమ్మును పోలివుండే తార్పా; ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఊయల వేణువు, బాన్స్ బాజా; ఇంకా వివిధ రాష్ట్రాలకు చెందిన ధూమ్సీ, ఢోల్, ఢోలక్, ఢప్ (డప్పు), డొల్లు (డోలు). తరచుగా వీటిని, ఇంకా అనేక ఇతర వాయిద్యాలను అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులు చేతితో తయారుచేస్తారు - నరసింగపేట్టైకు చెందిన నాదస్వరం తయారీదారులు, మైలాపూర్‌కు చెందిన మృదంగం తయారీదారులు, కాసర్‌గోడ్‌కు చెందిన వెదురు డ్రమ్ముల తయారీదారులు, పెరువెంబాకు చెందిన తాళ వాయిద్యాల సృష్టికర్తలు - వీరంతా తరతరాలుగా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ సంగీత సంప్రదాయాలలో అనేకం క్షీణించిపోతున్నప్పటికీ, చాలా వరకు బిగ్గరగానూ స్పష్టంగానూ మనుగడ సాగిస్తున్నాయి. ఇక్కడి PARI కథనాలు చూపిస్తున్నట్లుగా - ఇప్పటికీ పరిపూర్ణమైన స్వరంతో, గ్రామీణ ప్రాకృతిక దృశ్యంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
Author
Translator
11. సరళ గ్రామానికి చెందిన వడ్రంగి-సంగీతకారుడు
పరిస్థితులు కఠినంగా మారి, ఇల్లు గడవనప్పుడు అదనపు ఆదాయం కోసం తన అభిరుచిని ఆశ్రయించిన త్రిపురలోని సరళ గ్రామ పంచాయతీకి చెందిన ఒక జానపద కళాకారుడు
10. మధురమైన ప్రేమ సంగీతం
వహ్ యా అనేది నాగాలాండ్‌లోని కొన్యాక్ ఆదివాసీ సముదాయానికి చెందిన సంగీత పరికరం. దీనిని జంటలు వివాహానికి ముందు ఒకరినొకరు తెలుసుకునే సమయంలో ఉపయోగిస్తారు. ప్రతి ఏటా జరిగే అవ్లేంగ్ వసంతోత్సవ సమయంలో దాని స్వరాలను వినండి
9. తార్పీ గాలి పాట
ఈ సంగీతకారుడు ఊదుతోన్న తార్పీ (తార్పా అని కూడా అంటారు)ని వినండి, చూడండి
8. వేదికను వెలిగించిన బోడో నృత్యకారులు, సంగీతకారులు
సిఫుంగ్ (పొడవైన పిల్లంగోవి), ఖామ్ (డోలు), సెర్జా (వాయులీనం) సంగీతకారుల వాద్య వాదనంతో పాటు అస్సామ్‌లోని బోడో సముదాయానికి చెందిన సుబొన్శ్రీ, బాగురుంబా నృత్యాలను చూడండి
7. మోర్చంగ్ల తయారీలో ఒక జీవితకాలం…
మోహన్‌లాల్ లోహార్ అర్ధ శతాబ్దానికి పైగా మోర్చంగ్‌లను తయారుచేస్తున్నారు. ఈ తాళ వాయిద్యాల ధ్వనులను విశాలమైన రాజస్థాన్ ఇసుకతిన్నెలలో మనం ఎక్కడైనా వినవచ్చు
6. శ్రుతి తప్పకుండా ఉండేందుకు శ్రమిస్తోన్న మాజులీ వాద్యకారులు
సంవత్సరం పొడవునా జరుపుకునే అస్సామీ పండుగలలో తట్టు వాయిద్యాలు పెద్ద పాత్రను పోషిస్తాయి. ఈ క్లిష్టమైన ఢోల్లు, ఖోల్లు వంటి మరిన్నింటిని తయారుచేసే, మరమ్మత్తు చేసే నైపుణ్యం కలిగిన కళాకారులు, కొత్త జంతువధ నిరోధక చట్టం ధరల పెరుగుదలకు, వేధింపులకు దారితీస్తోందని చెప్పారు
5. ‘నా తర్పాయే నా దైవం’
భిక్ల్యా లడ్క్యా ధిందా ఒక వర్లీ ఆదివాసి. వాళ్వండేలో నివసించే 89 ఏళ్ళ ఈ సంగీతకారుడు వెదురు, ఎండిన సొరకాయ బుర్రతో చేసిన సంప్రదాయ వాయిద్యమైన తర్పాను వాయిస్తారు. తన సంగీతం, తన విశ్వాసం గురించి ఆయన చెప్పిన కథను ఆయన మాటల్లోనే వినండి
4. ముంబై లోకల్ రైళ్ళలో సారంగి తీగలకు వేలాడుతూ
తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని గౌరవించేందుకు ముంబై లోకల్ రైళ్ళలో సారంగిని వాయించే రాజస్థాన్ నుంచి వలసవచ్చిన కిషన్ జోగి
3. మధురై కొంబులో, శబ్దం లేని రాగాలు
తమిళనాడులో కొంబు కళాకారులు లాక్డౌన్ వలన గుడులలో పండగలు, బయట వేడుకలు జరగక, సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారు. కానీ అంతరించిపోతున్న తమ కళ గురించే వారి భయం.
2. కాసర్గోడ్ వెదురుబొంగుల వాయిద్యకారులు
కేరళలోని పరప్పా గ్రామం మావిళ ఆదివాసీ సమూహపు ఆదివాసులు వేడుకల వేళ వెదురు బొంగుల మీద సంగీతం సృష్టిస్తారు. మిగిలిన దినాల్లో ఆ కళాకారులు దినసరి కూలీలుగా జీవితం గడుపుతారు.
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/tuning-into-indias-many-musical-instruments-te












