పక్షులను ఉద్దేశించి, వాటి ద్వారా ప్రేమికుడిని, ప్రియమైనవారిని ఉద్దేశించి పాడే పాటల శ్రేణిలో ఇది మరొక పాట. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో సాధారణంగా మామిడి, నేరేడు, ఖిర్ని లేదా రాయన [పాల పళ్ళు] వంటి పండ్లతో విందుచేసుకుంటూ కనిపించే చిలుక (సూడల)ను ఇక్కడ మనం కలుస్తాం. దీని మెడ చుట్టూ గులాబీ, నలుపు రంగుల వలయం ఉంటుంది. ఈ పాటలో వివాహిత స్త్రీలు ధరించే వివిధ రకాల ఆభరణాల గురించి కూడా ప్రస్తావన వస్తుంది. తన కోసం ఆ ఆభరణాలను తీసుకురమ్మని ప్రేమ పక్షికి ఒక స్త్రీ చేసే అభ్యర్థన ఒక నిక్షిప్త ప్రేమ సందేశం, తనను పెళ్ళాడమని ప్రియుడికి పంపే ఆహ్వానం.
భద్రేసర్ గ్రామానికి చెందిన జుమా వాఘేర్ అందించిన ఈ క్రింది పాటను కఛ్ ప్రాంతంలో తరచుగా వివాహాల సమయంలో పాడతారు.



