
SANGUR, PUNJAB
|WED, SEP 10, 2025
గ్రామీణ భారతదేశంలో వైకల్యంతో జీవించటం
గ్రామీణ భారతదేశంలో చాలామంది వైకల్యం లేదా విభిన్న సామర్థ్యంతో జీవిస్తున్నారు. పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉండటంతో పాటు, సామాజిక లేదా రాజ్యం తీసుకునే చర్యలు లేదా రాజ్యం పనిచేయకపోవటం వల్ల కూడా వైకల్యం వస్తుంది - ఉదాహరణకు, ఝార్ఖండ్‌లో యురేనియం గనులకు సమీపంలో ఉండటం, లేదా మరాఠ్వాడాలో ప్రజలను ఫ్లోరైడ్ కలిపిన భూగర్భ జలాలను తాగేలా చేసే దారుణమైన కరవులు. కొన్నిసార్లు అనారోగ్యం లేదా వైద్య సంబంధ నిర్లక్ష్యం వల్ల వైకల్యం వస్తుంది - లక్నోలో వ్యర్థ పదార్థాలు సేకరించే కార్మికురాలిగా పనిచేసే పార్వతీ దేవికి కుష్టు వ్యాధి కారణంగా వేళ్ళు దెబ్బతిన్నాయి, మిజోరమ్‌కు చెందిన దేబహల చక్మా ఆటలమ్మ [చికెన్ పాక్స్] పోయటంతో అంధురాలయ్యారు. పాల్ఘర్కు చెందిన ప్రతిభా హిలిమ్ గ్యాంగ్రీన్ కారణంగా నాలుగు అవయవాలను కోల్పోయారు. కొందరి వైకల్యం మేధోపరమైనది - శ్రీనగర్‌కు చెందిన చిన్నారి మొహసిన్ సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతుండగా, మహారాష్ట్రలోని ప్రతీక్ డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. ఇలాంటి అనేక సందర్భాలలో పేదరికం, అసమానత, కొరవడిన ఆరోగ్య సేవలు, వివక్ష వలన ఈ సవాళ్ళు తీవ్రమవుతాయి. వైకల్యంతో జీవిస్తున్న వ్యక్తుల గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన PARI కథనాలివి
Author
Translator
9. బ్రెయిలీ - బ్యాలట్
వికలాంగులు వోటు వేసేలా రాజ్యం ఏర్పాట్లు చేసినప్పటికీ, బబ్లూ కైబర్తా వంటి కొందరికి 2024 సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొనడం గురించి ఖచ్చితంగా తెలియదు
8. 'ప్రేమ మిమ్మల్ని మంచి అధ్యాపకులుగా చేస్తుంది’
ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని PARI, వైకల్యం కలిగిన పిల్లలకు బోధించే ప్రత్యేక అధ్యాపకులతో జరుపుకుంటోంది. అన్ని మంచి బోధనలకు, విద్యార్థుల పట్ల అపరిమితమైన ప్రేమతో పాటు సహనం, పట్టుదల మూలరాయి వంటివని వారు చూపిస్తున్నారు
7. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రతిదీ మొదటినుంచీ నేర్చుకోవడం ఒక సవాలు
రెండు సంవత్సరాలపాటు బడి మూతపడటంతో, నేర్చుకున్నవన్నీ మరచిపోయిన మేధో వైకల్యం ఉన్న పిల్లలు తిరిగి తమ పాత బడి చదువులోకి రావడానికి కష్టపడుతున్నారు
6. ఒక ఆశాకిరణం కోసం శరణ్య అన్వేషణ
దృష్టిలోపం ఉన్న ముగ్గురు పిల్లల తల్లి శరణ్య పిల్లలతో పాటు పాఠశాలకు వెళుతుంది. గుమ్మిడిపూండి నుండి చెన్నై వరకు రోజూ 100 కిలోమీటర్ల దూరం ఈ తల్లి ప్రయాణం చేస్తుంది
5. చిత్ర, ముత్తురాజా: ఎవరికీ తెలియని ప్రేమకథ
అతని చేయి ఆమె భుజం మీద, అతని నడకకి ఆమె దారి చూపుతుంది- మధురై లో ఉన్న ఈ భార్యాభర్తల జంట ఎన్ని కష్టాలున్నా జీవనం సాగిస్తున్నారు. కానీ పేదరికం, ఆరోగ్యం, వైకల్యం దైనందిన జీవితాన్ని కఠినంగా మారుస్తోంది
4. మొహసిన్ ఎప్పటికీ నడవలేడు, బడికి వెళ్ళలేడు, ఆడుకోలేడు
అఖూన్ కుటుంబం శ్రీనగర్‌లోని మారుమూల పునరావాస కాలనీ అయిన రఖ్-ఎ-అర్థ్కి తరలి వెళ్ళారు. అప్పటినుంచి, సెరెబ్రల్ పాల్సీ (మెదడుకు వచ్చే పక్షవాతం) ఉన్న వారి అబ్బాయికి ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, అలాగే కూలి పనులు దొరక్కపోవడంతో, ఎన్నో కఠినమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు
3. వైకల్యం గల పిల్లల విద్యా వికాసానికి అవరోధంగా నిలిచిన లాక్ డౌన్
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన రైతు కుటుంబాల్లో బౌద్ధిక(intellectual) వైకల్యం గల పిల్లలకు ఆన్లైన్ తరగతుల సదుపాయం లేకపోవడంతో పిల్లల స్థితి దయనీయంగా మారింది. దీనితో తల్లిదండ్రులలో ఆందోళన పెరగసాగింది.
2. ‘నా ఎముకలు బోలుగా మారాయని డాక్టర్ చెప్పారు’
జీవితకాల అనారోగ్యం, గర్భాశయం తొలగింపుతో సహా నాలుగు శస్త్రచికిత్సల తర్వాత, పూణే జిల్లాలోని హదాషి గ్రామానికి చెందిన బిబాబాయి లోయారే వంగిపోయింది. అయినా పొలం పనులు చేసుకుంటూ పక్షవాతంతో బాధపడుతున్న భర్తను చూసుకుంటోంది
1. ‘డాక్టర్లు గర్భసంచిని తీయించేయమని చెప్పారు’
మేధోపరమైన వైకల్యం ఉన్న మహిళల లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య హక్కులు బలవంతంగా గర్భాశయాన్ని నిర్మూలించడం ద్వారా ఉల్లంగించబడతాయి. కానీ మహారాష్ట్రలోని వాడి గ్రామంలో, అదృష్టవశాత్తు మలన్ మోర్ కి తన తల్లి అండ ఉంది
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/living-with-disability-in-rural-india-te










