మీకు బిహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్‌లో ప్రమాదకరమైన క్రూర జంతువు ఎదురైనప్పుడు, లేదా ఒక వన్యప్రాణిని రక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, మీరు తెలుసుకోవలసిన వ్యక్తి జీప్ డ్రైవర్ ముంద్రికా. ఒకప్పుడు ఫారెస్ట్‌గార్డ్‌గా పనిచేసిన ఆయన, రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అయితే ప్రజలు మాత్రం ఇప్పటికీ అతని నైపుణ్యాలపైనే ఆధారపడతారు