బిహార్‌లో ఆల్హా-ఉదల్‌ని బతికిస్తోన్న గాయకుడు ముస్లిమ్ ఖలీఫా
ఒక ఒంటరి జానపద గాయకుడు ఆల్హా-ఉదల్ (రుదల్) ఇతిహాసాన్ని రాష్ట్రమంతటా - పొలాల్లో, వివాహ వేడుకలలో, ఇళ్ళల్లో జరిగే శుభకార్యాల్లో - పాడుతూ తీసుకువెళుతున్నారు. తనకు మంచి గిరాకీ ఉన్న రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక జంట యోధులపై 800 ఏళ్ళనాడు అల్లిన ఈ గాథను వినేందుకు ఇప్పుడు జనంలో ఆసక్తి తగ్గుతోందని ఆయన చెప్పారు