బంగారు రంగులోకి మారడానికి కొన్ని రోజుల ముందునాటి తళతళలాడే ఆకుపచ్చని వరి పొలంలో నిలబడి, నరేన్ హజరికా తన హృదయ గానాన్ని ఆలపించారు. 70 ఏళ్ళ నరేన్‌కు తోడుగా జితేన్ హజరికా (82) ఢోల్ (డోలు) తోనూ, రాబిన్ హజరికా (60) తాళాల తోనూ ఉన్నారు. వీరు ముగ్గురూ తితాబర్ సబ్ డివిజన్‌లోని బాలిజాన్ గ్రామంలో నివసించే సన్నకారు రైతులు. వీరు తమ యవ్వనకాలంలో నిపుణులైన బిహువాలు (బిహు కళాకారులు)గా ఉండేవారు.
“మీకు మాటలు తరగకపోవచ్చు, కానీ రంగాలీ (వసంతోత్సవం) బిహూ కథలు అనంతమైనవి!”
పంటల కాలం (నవంబర్-డిసెంబర్) సమీపిస్తుండగా వరి బంగారంగా మారడంతో, స్థానిక ధాన్యాగారాలు మరోసారి బరా, జహా, ఆయిజుంగ్ (స్థానిక బియ్యం రకాలు)లతో సమృద్ధిగా అవుతాయి. అస్సామ్‌లోని జోర్‌హాట్ జిల్లాలో పారంపరికంగా వస్తోన్న బిహు నామ్ (పాటలు)లో పంటతో సుతియా సముదాయానికి ఉన్న అపారమైన మమేకత వినబడుతుంది. స్థానిక ఆదివాసీ తెగ అయిన సుతియాలు ఎక్కువగా వ్యవసాయాధారులు, వారు ప్రధానంగా ఎగువ అస్సామ్‌లో నివసిస్తున్నారు.
పోక, కొబ్బరి, అరటి చెట్ల సమూహాల సమృద్ధిని వర్ణించడానికి అస్సామీ పదమైన థక్ ను ఉపయోగిస్తారు. పాటల్లోని పదబంధాలు, 'మరొమరొ థక్' , ' మరొమ్ ' అంటే ప్రేమ - ప్రేమకు ప్రతిఫలాలు. వ్యవసాయ సమాజానికి ఈ ప్రేమ సమృద్ధి కూడా చాలా విలువైనది, పొలాల మీదుగా తేలియాడే సంగీతకారుల స్వరాలు కూడా అదే సంగతిని చెబుతాయి.
"నా గానం తడబడితే నన్ను క్షమించు"
యువజనం కూడా ఈ సంగీత సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని, అందువలన అది సజీవంగా ఉంటుందని వారు ఆకాంక్షిస్తున్నారు.
“
ఓ సోణ్‌మైనా (ఓ బంగరు
మైనా),
సూర్యుడు తన ప్రయాణానికి సిద్ధమై ఉన్నాడు...”
అనువాదం: సుధామయి సత్తెనపల్లి