అంధకారంలో వజీరిథల్ గ్రామ ఆరోగ్య సంరక్షణ
జమ్మూకశ్మీర్, బాందీపుర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీలు-అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా, దీనావస్థలో ఉన్న ప్రజా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పోరాడుతున్నారు. ఒక వృద్ధురాలైన దాయి (మంత్రసాని) తప్ప వాళ్లకు వేరే గత్యంతరం లేదు
నవంబర్ 17, 2022 | జిగ్యాస మిశ్రా
పొగచూరిపోతున్న మహిళా బీడీ కార్మికుల ఆరోగ్యం
ముర్షిదాబాద్ జిల్లాలో అతి తక్కవ వేతనాలు, అత్యధిక శారీరక శ్రమతో కూడిన బీడీలు చుట్టే పనిని కటిక పేదలైన మహిళలే చేస్తారు. నిరంతరం పొగాకుతో పనిచేయడం వలన, ఆ మహిళల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి ఆరోగ్యం కూడా గొప్ప ప్రమాదంలో పడుతోంది
అక్టోబర్ 31, 2022 | స్మితా ఖటోర్
ఇక్కడ బహిష్టు అయిన బాలికలకు, స్త్రీలకు ఇళ్లల్లో చోటు లేదు
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోబహిష్టు సమయంలోనూ, ప్రసవ సమయంలోనూ తమపై ఒత్తిడి తెచ్చే తీవ్రమైన వివక్ష గురించీ, కష్టాల గురించీ మహిళలు మాట్లాడుతున్నారు
సెప్టెంబర్ 19, 2022 | కృతి అత్వాల్
బొలెరో వెనుక సీటులో ప్రసవం
హిమాచల్ ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అందుబాటులో వైద్య సేవలు, అన్ని సౌకర్యాలతో పనిచేసే సామాజిక ఆరోగ్య కేంద్రాలు లేనందువలన ప్రసూతి ఆరోగ్యం, అరోగ్య సంక్షేమానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నారు
ఆగష్టు 31, 2022 | జిగ్యాస మిశ్రా
అసుండి దళిత మహిళల వ్యక్తిగత వ్యథలు
తక్కువ వేతనాలు, ‘ఆకలికడుపుల ఆహార పద్ధతి' హావేరి జిల్లాలోని ఈ గ్రామంలోని మహిళల యోగక్షేమాలపై ప్రతికూల ప్రభావాన్ని వేస్తున్నాయి. వారి కాలనీలో మరుగుదొడ్లు లేకపోవడం, రుతుక్రమ ఆరోగ్యం సరిగా లేనివారి పరిస్థితి మరింత అధ్వాన్నమయ్యేలా చేస్తోంది
ఆగష్టు 18, 2022 | ఎస్. సెందళిర్
‘ట్యూబల్ లైగేషన్ చేయించుకోడానికి నేను ఒంటరిగా బయలుదేరాను’
వారి పురుషులు దూరంగా సూరత్, ఇంకా ఇతర ప్రాంతాలలో వలస కార్మికులుగా పనిచేస్తున్నందున, ఉదయపూర్ జిల్లాలోని గమేతీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు తామే స్వయంగా గర్భనిరోధక, ఆరోగ్య సంరక్షణ గురించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు
జులై 27, 2022 | కవిత అయ్యర్
‘నేను మరో బిడ్డను కనాలనుకోలేదు’
ఎక్కువ మంది పిల్లల్ని కనకూడదన్న ఉద్దేశ్యంతో సులభమైన, సురక్షితమైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకున్నారు సునీతా దేవి. కానీ కాపర్-టి విఫలమవడంతో, అబార్షన్ చేయించుకోవడానికి ఆమె స్థానిక పిఎచ్‌సి నుండి ఢిల్లీ, బీహార్లలోని ప్రభుత్వ ఆసుపత్రుల వరకు తిరగవలసి వచ్చింది
జులై 27, 2022 | సంస్కృతి తల్వార్
టిక్రీలో కథల, రహస్యాల డిపో హోల్డర్
గర్భనిరోధకాల, కండోమ్‌ల సంచీని ధరించి ఉండే కళావతి సోని అమేథీ జిల్లాలోని టిక్రీ గ్రామంలోని మహిళలకు ఒక నమ్మకమైన స్నేహితురాలు. వారితో సాయిలా పాయిలాగా ఆమె మాట్లాడే తీరు పునరుత్పత్తి హక్కుల సందేశాన్ని ఇక్కడ సజీవంగా ఉంచుతాయి
జూన్ 22, 2022 | అనూభా భోంస్లే
‘నా గర్భసంచిని తొలగించిన తర్వాత ఇదంతా మొదలయింది’
బీడ్ జిల్లాలో, పెద్ద సంఖ్యలో గర్భాశయ శస్త్రచికిత్సలు చేయించుకున్న మహిళా చెఱకు కార్మికులు శస్త్రచికిత్స అనంతర ఆందోళన, నిరాశ, శారీరక రుగ్మతలు, దెబ్బతింటోన్న వైవాహిక సంబంధాలను నిశ్శబ్దంగా ఎదుర్కొంటున్నారు
మార్చ్ 25, 2022 | జ్యోతి షినోలి
‘నాకు గర్భస్రావం అయిందని ఇతరులకు తెలియకూడదనుకున్నాను’
వారి నది నీరు మరింత లవణీయత కలిగివుంటుంది, వేసవికాలం మరింత వేడిగా ఉంటుంది, ప్రజారోగ్య సంరక్షణ అందుబాటులో ఉండటమన్నది ఒక సుదూర స్వప్నం. ఇవన్నీ కలిసి సుందర్బన్లలో మహిళలను ఆరోగ్య సమస్యల చిట్టడవిలో చిక్కుకునేలా చేశాయి
మార్చి 10, 2022 | ఊర్వశి సర్కార్
‘నాకు మందులు ఇచ్చేటప్పుడు వాళ్లు నా ఒంటిని అసభ్యంగా తడుముతారు’
సెక్స్ వర్కర్లపై ఆసుపత్రి సిబ్బంది లైంగికంగా దాడి చేస్తారు, వారిని చిన్న చూపు చూసి కించపరుస్తారు, వారి గోప్యతను అతిక్రమిస్తారు. వాళ్లు ఎదుర్కొనే వివక్ష వల్ల చివరికి దేశ రాజధానిలో కూడా వైద్య చికిత్సను పొందలేకపోతున్నారు.ఈ మహారోగం వలన వారు ఇంకా ఇబ్బందులపాలవుతున్నారు
ఫిబ్రవరి 21, 2022 | షాలిని సింగ్
జార్ఖండ్‌లోని RMPలు: నమ్మకంగా చేస్తున్న ‘వైద్యం’
పశ్చిమ సింగ్ భూమి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అత్యంత దారుణంగా ఉన్న వైద్య సంరక్షణకు తోడు మౌలిక సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాల్లో గ్రామీణ వైద్య కార్యకర్తల సేవలు అనివార్యమైనవి మరియు అక్కడ ఆరోగ్యం కేవలం నమ్మకానికి సంభవించింది
ఫిబ్రవరి 3, 2022 | జసింతా కెర్కెట్టా
మెల్ఘాట్లో చివరి తరం దాయీలు
మహారాష్ట్రలోని మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ చుట్టూ ఉన్న ఆదివాసీ సెటిల్మెంట్లలో, రోపి, చర్కు వంటి దాయీలు దశాబ్దాలుగా ఇంటి వద్దనే కాన్పులను నిర్వహిస్తున్నారు. కానీ ఇద్దరూ వృద్ధులు, వారి వారసత్వాన్ని ఇక ముందుకు తీసుకెళ్లేవారెవ్వరూ లేరు
ఫిబ్రవరి 28, 2022 | కవిత అయ్యర్
యుపి లో: మగవారికి ఆపరేషన్ - ‘ఆలోచన కూడా రాదు'
యుపిలోని వారణాసి జిల్లాలోని ముసాహర్ మహిళలకు, వారి జీవితాలను వేధిస్తున్న లేమిని మరింత దిగజార్చేది ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం మాత్రమే కాదు, వారి ఆలోచనలను పరిమితం చేసే వివక్షపూరిత చరిత్ర కూడా
ఫిబ్రవరి 10, 2022 | జిగ్యాస మిశ్రా
మధుబనిలో పుట్టిన ఆడపిల్లలకు సర్టిఫికెట్లుండవు
బీహార్‌లోని మధుబని జిల్లాలో నివసిస్తున్న పేద కుటుంబాల మహిళలు అత్యవసర సమయాల్లో ఆరోగ్య సేవలను పొందడంలో పలు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. సామాజిక సేవలో భాగంగా వారికి సాయంగా పనిచేసే కొన్ని సంస్థల్లో అప్పుడప్పుడూ కొన్ని చిన్నచిన్న అవినీతి బాగోతాలు బయటపడుతున్నా , వారు నిస్సహాయులై ఉన్నారు
అక్టోబర్ 27, 2021 | జిగ్యాస మిశ్రా
యు.పి లో: ‘మా గ్రామం వేరే శకంలో బ్రతుకుతుంది’
ఇంకా కౌమారంలోకి రాని సోను , మీనాలకు త్వరలోనే పెళ్లి చేసేస్తారు , ప్రయాగ్ రాజ్ జిల్లాలోని గ్రామాలలో రుతుక్రమం మొదలైన అమ్మాయిలందరిదీ ఇదే కథ
అక్టోబర్ 11, 2021 | ప్రీతి డేవిడ్
ముగ్గురు ఆడపిల్లలా? అయితే కనీసం ఇద్దరు మగపిల్లలని కనండి
బీహార్‌లోని గయా జిల్లాలోని వివిధ నేపథ్యాల నుండి వచ్చిన మహిళలకు , పేదరికం , విద్యకు సరిపడా అవకాశం లేకపోవడం , వారి జీవితాల పై వారికి నియంత్రణ లేకపోవడం వలన , వారి ఆరోగ్యం , శ్రేయస్సు నిరంతరం ప్రమాదంలో ఉంటుంది
సెప్టెంబర్ 29, 2021 | జిగ్యాస మిశ్రా
కాపర్-టి లో ఇరుక్కున్నా: ‘నొప్పి తగ్గలేదు’
ప్రసవం తరవాత దీప ఆసుపత్రిని వదిలి వెళ్లినా , ఆమె గర్భసంచిలో కాపర్-టి ని పెట్టారని ఆమెకు తెలియదు. రెండేళ్ల తరవాత , ఆమెకు నొప్పి , రక్తస్రావం మొదలయ్యాక , డాక్టర్లు దానిని నెలల తరబడి కనుగొనలేకపోయారు
సెప్టెంబర్ 14, 2021 | సంస్కృతి తల్వార్
'మమ్మల్ని మగవాళ్ళు ఎప్పుడూ చూస్తున్నట్టే అనిపిస్తుంది'
తాళం వేసి ఉన్న పబ్లిక్ టాయిలెట్లు , దూరంగా ఉన్న బ్లాకులు , పరదా ఉన్న చిన్న ఇరుకు గదులు , స్నానానికి గానీ రుతుస్రావ బట్టని పడేయడానికి గాని చాటు లేకపోవడం , రాత్రి పూట రైల్వే ట్రాక్ వరకు ఎక్కడం - ఇవన్నీ పాట్నాలోని బస్తీల్లో ఉండే వలస వచ్చిన అమ్మాయిలకి రోజువారీ అడ్డంకులు
ఆగష్టు 31, 2021 | కవిత అయ్యర్
‘ఈ నీటి లో కాన్సర్ ఉందని నాకు ముందే తెలిసి ఉంటే బావుండేది’
బీహార్ లో గ్రామాలలో భూగర్భ జలంలో ఆర్సినిక్ వలన , ప్రీతి కుటుంబం లానే చాలా మంది వారి కుటుంబసభ్యులను కాన్సర్ వలన కోల్పోయారు , ఆమెకు కూడా రొమ్ములో గడ్డ వచ్చింది. కానీ చికిత్స పొందడానికి ఆడవారు చాలా సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది
ఆగష్టు 25, 2021 | కవిత అయ్యర్
బీహార్‌లో : ఇంట్లో 7 కాన్పులు అయిన 36 ఏళ్ల అమ్మమ్మ
శాంతి మాంఝి , బీహార్ లోని షియోహార్ జిల్లాలో ముసహర్ కుగ్రామంలో , తన ఏడుగురు పిల్లలను ఇంటిలోనే ప్రసవించింది , చాలా తక్కువమందికి ఆరోగ్యసేవలు అందుబాటులో ఉన్నాయి , అందులో చాలామందికి అక్కడ PHCలో కాన్పులు చేస్తారని తెలీదు
ఆగష్టు 18, 2021 | కవిత అయ్యర్
‘నా కూతుళ్లు నాలాగా మారడం నాకు ఇష్టం లేదు’
బీహార్‌లోని పాట్నా జిల్లాలో బాల్యంలోని , యుక్తవయసులోని వధువులకు మగబిడ్డను ప్రసవించే వరకు పిల్లలను కనడం తప్ప వేరే మార్గం లేదు. చట్టాలను , చట్టపరమైన ప్రకటనలను- సామాజిక ఆచారాలు , వివక్షపూరిత సమాజం పెడచెవిన పెడతాయి
జులై 23, 2021 | జిగ్యాస మిశ్రా
నెలసరి క్వారంటైనులో కదుగొల్ల మహిళలు
కర్ణాటకలో ఉండే కదుగొల్ల సమాజంలో చట్టం , ప్రచారాలు , వ్యక్తిగత ప్రతిఘటన ఉన్నప్పటికీ - దేవుడికి కోపం వస్తుందని , సమాజం చిన్నచూపు చూస్తుందని , ప్రసవానంతరం , నెలసరి సమయంలో స్త్రీలని చెట్ల క్రింద లేక గుడిసెలలో వేరుచేసి ఉంచుతారు
జులై 5, 2021 | తమన్నా నసీర్
‘నేను పెళ్లిచేసుకోదగిన దాన్ని కాదు’
బీహార్ లో ముజాఫ్ఫార్పుర్ జిల్లాలో చతుర్భుజ్ స్థాన్ బ్రోతల్ వద్ద ఉన్న సెక్స్ వర్కర్లు , చాలాసార్లు వారి పర్మనెంట్ క్లయింట్ల వలన గర్భం దాలుస్తారు. ప్రస్తుతం కోవిడ్-19 లాక్డౌన్ వలన వారు బాగా దెబ్బతిని ఉన్నారు
జూన్ 15, 2021 | జిగ్యాస మిశ్రా
మల్కన్‌గిరిలో మృతుంజయ్ ఎలా జన్మించాడు
ఒడిశాలోని మల్కన్‌గిరిలోని రిజర్వాయర్ ప్రాంతంలోని ఆదివాసీ కుగ్రామాలలో , దట్టమైన అడవులు , ఎత్తైన కొండలు , రాష్ట్ర-మిలిటెంట్ సంఘర్షణల మధ్య , ఆరోగ్య సేవలను చేరుకోవడానికి , అస్తవ్యస్త్యమైన సమయాలలో నడిచే పడవ సేవలు , విరిగిన రోడ్లు మాత్రమే దిక్కు
జూన్ 4, 2021 | జయంతి బురుడా
బీహార్‌లో: ‘కరోనా సమయంలో నాకు పెళ్లి జరిగింది'
బీహార్‌లోని గ్రామాలలో , గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో , టీనేజ్ బాలికలకు , ఇంటికి తిరిగి వచ్చిన యువ వలస కార్మికులతో వివాహం జరిగాయి. చాలామంది ఇప్పుడు గర్భం దాల్చారు , తరువాత జీవితం ఎలా ఉండబోతుందో అనే ఆందోళనతో ఉన్నారు
మే 7, 2021 | కవిత అయ్యర్
మధుబనిలో: గోప్యంగా జరుగుతున్న మార్పు
ఒక దశాబ్దం క్రితం , బీహార్‌లోని హసన్పూర్ గ్రామంలో ఎవరూ కుటుంబ నియంత్రణను పాటించేవారు కాదు. ఇప్పుడు , మహిళలు తరచుగా ఆరోగ్య సంరక్షణ వాలంటీర్లు అయిన సలా షమాను గర్భనిరోధక ఇంజెక్షన్ల కోసం సంప్రదిస్తున్నారు. ఈ మార్పుకు దారితీసింది ఏమిటి?
ఏప్రిల్ 13, 2021 | కవిత అయ్యర్
బీహార్ లో మహిళా వైద్యురాళ్లు: కఠినప్రయాసకు తిరిగి గద్దింపులు
బీహార్ లోని కిషన్ గంజ్ జిల్లాలో పని చేస్తున్న కొద్ది మంది మహిళా గైనకాలజిస్టులకి , రోజు సుదీర్ఘంగానూ , వైద్య సరఫరాలు తక్కువగానూ , ఇవి గాక పేషెంట్ల పలుమార్ల గర్భధారణలు , గర్భనిరోధకాలు వాడడానికి అయిష్టతనూ , అన్నీ సంభాళించుకుంటూ పని చేయడం చాలా కఠినమైన పని
ఏప్రిల్ 7, 2021 | అనూభా భోంస్లే
'నాకు తొమ్మిది మంది అమ్మాయిలు, పదో సంతానం - ఒక అబ్బాయి'
గుజరాత్ లోని డోల్కా తాలూకా లో ఉన్న భార్వాడ పశుపోషక సమాజం లోని మహిళలకు కొడుకులను కనాలనే ఒత్తిడిలో , కుటుంబ నియంత్రణ , గర్భ నిరోధక హక్కులు , కేవలం మాటలుగానే మిగిలి పోతాయి
ఏప్రిల్ 1, 2021 | ప్రతిష్ట పాండ్య
'చదువుకుంటే, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని అడుగుతాడు'
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో , మహదళిత్ వర్గాలకు చెందిన టీనేజ్ బాలికలు తమ చదువుకుని , వారి కలలను సాకారం చేసుకోవడానికి , సమాజం నుండి చిన్నచూపునే కాక , శారీరక హింసని కూడా ఎదుర్కొంటారు - కొందరు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తారు , మరికొందరు లొంగిపోతారు
మార్చ్ 29, 2021 | అమృతా బ్యాత్నాల్
‘మేము పనిచేసే ఆఫీసు, నిద్రపోయే స్థలము ఒకటే’
స్థలాభావం , సౌకర్యాలు లేకపోవడం తో బీహార్ రాష్ట్రం లో దర్భాంగా లోని హెల్త్ వర్కర్లు ఆఫీసులోనే నిద్రపోతారు , వార్డ్ లో పడకల మీద , కొన్నిసార్లు గచ్చుమీద కూడా పడుకుంటారు
మార్చ్ 26, 2021 | జిగ్యాస మిశ్రా
గర్భసంచిలో చనిపోయిన బిడ్డ, ఆ మరునాడే పుట్టుక నమోదు
వైశాలి జిల్లా లో ని ఒక PHC లో , అల్ట్రా సౌండ్ మెషిన్ పైన సాలె గూళ్లు ఉంటాయి , డబ్బులు ఇవ్వనిదే సిబ్బంది పని చేయరు , కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని చెప్పి - ఒక ప్రైవేట్ క్లినిక్ కి పరిగెత్తించి , ఖర్చు పెంచుతారు
ఫిబ్రవరి 22, 2021 | జిగ్యాస మిశ్రా
నిర్లక్షమైన ఆరోగ్య కేంద్రాలు, 'బినా-డిగ్రీ' వైద్యులు
అడవి జంతువులు తిరుగాడే , సరిపడా సిబ్బంది లేని PHC, ఆసుపత్రులు మీద అపోహలూ భయాలు, ఫోన్ కనెక్టివిటీ లేకపోవడం- ఇవన్నీ బీహార్‌లోని బరాగావ్ ఖుర్ద్ గ్రామంలో ఆడవారిని ఇంట్లోనే ప్రసవించేలా చేస్తాయి
ఫిబ్రవరి 15, 2021 | అనూభా భోంస్లే , విష్ణు సింగ్
అల్మోరా లో, కానుపు కోసం కొండలే కదిలి రావాలి
పోయిన ఏడాది ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లా కి చెందిన రానో సింగ్ కు , ఆమె హాస్పిటల్ కి వెళ్ళే దారిలో , కొండని ఎక్కుతుండగా , మార్గమధ్యలోనే కాన్పు అయ్యింది. ఆ ఎత్తైన ప్రదేశం , ఆ ఖర్చులూ ఎందరినో ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కాన్పు జరిగేలా చేస్తాయి
ఫిబ్రవరి 11, 2021 | జిగ్యాస మిశ్రా
బలవంతపు కుటుంబ నియంత్రణ, అర్ధంలేని చావు
రాజస్థాన్ కు చెందిన భావన సుతార్ పోయిన ఏడాది నిర్వహించిన ఒక క్యాంపులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వలన చనిపోయింది. నిబంధనల ప్రకారం ఆమెకి ఆలోచించుకునే సమయం ఇవ్వబడలేదు. ఆమె భర్త దినేష్ ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాడు.
నవంబర్ 20, 2021 | అనూభా భోంస్లే
నేను తొమ్మిదవ నెల గర్భంతో ఉన్నప్పుడు కూడా క్లయింట్లు ఉండేవారు’
నాలుగు గర్భస్రావాలు , తాగుబోతు భర్త , ఫ్యాక్టరీ ఉద్యోగం కోల్పోవడంతో , ఢిల్లికి చెందిన హనీ ఐదవసారి గర్భవతిగా ఉన్నప్పుడు సెక్స్ వర్క్ వైపు మొగ్గు చూపింది. ఇక అప్పటి నుండి లైంగిక వ్యాధితో బతుకుతోంది. ఇప్పుడు , లాక్డౌన్లో కూడా ఆమె సంపాదించడానికి చాలా కష్టపడుతోంది
అక్టోబర్ 15, 2020 | జిగ్యాస మిశ్రా
'నా భార్యకు ఇన్ఫెక్షన్ ఎట్లా వచ్చింది?
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన 27 ఏళ్ల సుశీలా దేవికి స్టెరిలైజేషన్ తర్వాత ఇన్ఫెక్షన్ అయింది. దాని వల్ల మూడేళ్ల నొప్పి , ఆసుపత్రుల సుట్టూ తిరగడం , పెరుగుతున్న అప్పులు , చివరకు గర్భాశయాన్ని తొలగించడం వంటివి జరిగినయి
సెప్టెంబర్ 3, 2020 | అనూభా భోంస్లే , సంస్కృతి తల్వార్
‘నా ఎముకలు బోలుగా మారాయని డాక్టర్ చెప్పారు’
జీవితకాల అనారోగ్యం , గర్భాశయం తొలగింపుతో సహా నాలుగు శస్త్రచికిత్సల తర్వాత , పూణే జిల్లాలోని హదాషి గ్రామానికి చెందిన బిబాబాయి లోయారే వంగిపోయింది. అయినా పొలం పనులు చేసుకుంటూ పక్షవాతంతో బాధపడుతున్న భర్తను చూసుకుంటోంది
జులై 2, 2020 | మేధ కాలే
‘నా గర్భసంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది’
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో జారిపోయే గర్భాశయం ఉన్న భిల్ మహిళలు వైద్య సదుపాయాలను పొందలేరు. సరైన రోడ్డు , మొబైల్ కనెక్టివిటీ లేక నిరంతరం శ్రమ పడుతూ విపరీతమైన నొప్పిని భరిస్తున్నారు
జూన్ 17, 2020 | జ్యోతి షినోలి
‘డాక్టర్లు గర్భసంచిని తీయించేయమని చెప్పారు’
మేధోపరమైన వైకల్యం ఉన్న మహిళల లైంగిక , పునరుత్పత్తి ఆరోగ్య హక్కులు బలవంతంగా గర్భాశయాన్ని నిర్మూలించడం ద్వారా ఉల్లంగించబడతాయి. కానీ మహారాష్ట్రలోని వాడి గ్రామంలో , అదృష్టవశాత్తు మలన్ మోర్ కి తన తల్లి అండ ఉంది
జూన్ 09, 2020 | మేధ కాలే
‘పన్నెండుమంది పిల్లలు పుట్టాక దానంతట అదే ఆగిపోతుంది’
హర్యాణాలోని బివాన్ గ్రామంలో , సాంస్కృతిక కారణాలు , అందుబాటులో లేని ఆరోగ్య సేవలు , కార్యకర్తల ఉదాసీనత కారణంగా మియో ముస్లింలలో గర్భనిరోధకం అందుబాటులో లేదు- దీనివలన స్త్రీలు ప్రసవ చక్రంలో బంధింపబడుతున్నారు
మే 20, 2020 | అనూభా భోంస్లే , సంస్కృతి తల్వార్
లాక్ డౌన్ లో ఇరుకున్న బాలికలు : మౌలిక అవసరాలు తీరవు
బడులు మూతబడడంతో ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలోని పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఉచిత సానిటరీ నాప్కిన్లు అందక అసురక్షితమైన ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే అలాంటి అమ్మాయిల సంఖ్య లక్షల్లో ఉంది
మే 12, 2020 | జిగ్యాస మిశ్రా
గ్రామీణ ఆరోగ్య సూచికల బదులు, ఆవులను లెక్కబెడుతున్నారు
హర్యానా , సోనిపట్ జిల్లా పానిపట్ కేంద్రంగా... అతితక్కువ ప్రతిఫలంతో లెక్కకు మించిన సర్వేలు , రిపోర్టులు , టాస్కుల మీద పని చేసీచేస్తున్న సునీతా రాణి , ఇతర ఆశా కార్యకర్తలు గ్రామీణ కుటుంబాలకు వైద్యసేవలు అందించడం చాలా క్లిష్టంగా మారిందంటున్నారు
మే 8, 2020 | అనూభా భోంస్లే , పల్లవి ప్రసాద్
నీలగిరీలలో, వారసత్వంగా వస్తున్న పోషకాహారలోపం
మద్య వ్యసనం , తక్కువ ఆదాయం , అడవిలోకి వెళ్లలేకపోవడంతో , తమిళనాడులోని గుడలూరులోని ఆదివాసీ ఆడవారిలో పోషకాహార లోపం చాలా ఎక్కువగా ఉన్నది. తల్లులలో అసలు హిమోగ్లోబిన్ లేదు , రెండేళ్ల పిల్లలు 7 కిలోల బరువున్నారు
మే 1, 2020 | ప్రీతి డేవిడ్
ఆ మనవడి కోసం, మేము నలుగురు పిల్లలను కన్నాము
ఢిల్లీ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యాణాలోని హర్సానా కలాన్ గ్రామంలోని మహిళలు , తమను నియంత్రిస్తున్న పురుషులనుండి , తమ సొంత జీవితాలలో , పునరుత్పత్తి ఎంపికలలో వారికి కావలసినవి సాధించడానికి చేసిన పోరాటాలను వివరిస్తున్నారు
ఏప్రిల్ 21, 2020 | అనూభా భోంస్లే , సంస్కృతి తల్వార్
ఇప్పుడు, నా మేకలే నా కన్నబిడ్డల్లాంటివి
మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లాలోని ధడ్గావ్ ప్రాంతంలోని భీల్ తెగకు చెందిన మహిళల్లో పిల్లలు కలగని వారికి అక్కడి గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ సరైన చికిత్స అందించలేకపోతోంది , అంతే కాక వాళ్లు సామాజిక బహిష్కరణకు గురౌతున్నారు
ఏప్రిల్ 13, 2020 | జ్యోతి షినోలి
పోయిన ఏడాది, వేసెక్టమీకి ఒక పురుషుడు మాత్రమే ఒప్పుకున్నాడు’
కుటుంబ నియంత్రణ లో ‘పురుషుల పాత్ర’ అనే పద ప్రయోగాన్ని విరివిగా వాడినా , వికాస్ మిత్రలకు , ఆశాలకు మగవారిని స్టెరిలైసెషన్ కు ఒప్పించడం ఇంకా కష్టంగానే ఉంది , గర్భనిరోధకం ఆడవారికి సంబంధించిన విషయంగానే భావించబడుతుంది
మార్చ్ 18, 2020 | అమృతా బ్యాత్నాల్
‘వాళ్ళకి ఒక మాత్ర ఇచ్చి పంపించేస్తారు’
ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో అన్ని సౌకర్యాలు గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా మంది ఆదివాసీ మహిళలకు అందుబాటులో లేకపోవడంతో , వాళ్ళు ప్రమాదకరం కాగల గర్భస్రావాలు , ప్రసవాల కోసం అర్హత లేని ప్రాక్టీషనర్లని ఆశ్రయిస్తారు
మార్చ్ 11, 2020 | ప్రీతి డేవిడ్
‘ఓ జంజాటం వదిలింది’ - నేహకి సూది ఆపరేషన్ అయిపొయింది
2016 SC ఆర్డర్ తర్వాత స్టెరిలైజేషన్ క్యాంపుల స్థానంలో ' నస్బంది డే ' వచ్చింది , కానీ ఇప్పటికీ UPలో చాలా మంది మహిళలు ఆధునిక గర్భనిరోధక పద్ధతులను ఎంచుకోక , శస్త్రచికిత్సలనే చేయించుకుంటున్నారు
ఫిబ్రవరి 28, 2020 | అనూభా భోంస్లే
కుతూహలపరిచే కూవలాపురం గెస్ట్ హౌస్
మదురై జిల్లాలోని కూవలాపురంతో పాటు మరో నాలుగు గ్రామాల్లో , రుతుక్రమంలో ఉన్న మహిళలు ‘అతిథి గృహాల’లో ఒంటరిగా ఉంటున్నారు. దేవతలు , మానవుల ఆగ్రహానికి భయపడి ఎవరూ ఈ వివక్షను సవాలు చేయడం లేదు