రాజు డుమర్‌గోయీఁ తార్పీ (తార్పా అని కూడా అంటారు)ని ఊదుతుంటే ఆయన బుగ్గలు పొంగుతాయి. వెదురు, ఎండిన సొరకాయను ఉపయోగించి తయారుచేసే ఈ ఐదడుగుల పొడవుండే సంగీత వాయిద్యం వెంటనే జీవంపోసుకుంటుంది, ఆ గాలి వాయిద్యపు మధుర స్వరం గాలినంతా నింపేస్తుంది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం 2020, డిసెంబర్ 27-29 వరకు నిర్వహించిన దేశీయ ఆదివాసీ నృత్యోత్సవంలో ఈ సంగీతకారుడునీ, విచిత్రమైన ఆకారంలో ఉన్న అతని వాయిద్యాన్నీ గమనించకుండా ఎవరూ ఉండలేరు.
దసరా, నవరాత్రి, ఇంకా ఇతర పండుగల సమయాలలో తాను ఇంటివద్ద తార్పీని ఊదుతానని సంగీతకారుడు రాజు వివరించారు. ఆయన ఇల్లు మహారాష్ట్ర, పాల్‌ఘర్ జిల్లాలోని మొఖాడా గుణ్డాజాపారా అనే కుగ్రామంలో ఉంది.
ఇది కూడా చదవండి: ‘నా తర్పాయే నా దైవం’
అనువాదం: సుధామయి సత్తెనపల్లి