ఒక పాలియెస్టర్ చీర రూ. 90కే వస్తున్నప్పుడు తాను నేసే కోట్‌పాడ్ చీరను రూ. 300 పెట్టి కొనేవాళ్ళెవరా అని మధుసూదన్ తాఁతికి విస్మయం కలుగుతుంటుంది

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, కోట్‌పాడ్ తెహసిల్‌ లో ఉండే డొంగ్రిగూడా అనే గ్రామానికి చెందిన నలబై ఏళ్ళు దాటిన ఈ నేత కార్మికుడు, గత కొన్ని దశాబ్దాలుగా ప్రసిద్ధిచెందిన కోట్‌పాడ్ చీరలను నేస్తున్నారు. కోట్‌పాడ్ చీర సంక్లిష్టమైన ఆకృతులను కలిగివుంటుంది; నలుపు, ఎరుపు, గోధుమ రంగుల ఉత్తేజకరమైన ఛాయలలో ఉండే నూలు దారాలతో నేస్తారు.

"నేత మా కుటుంబ వృత్తి. నా తాత, నా తండ్రి నేసేవాళ్ళు, ఇప్పుడు నా కొడుకు కూడా నేస్తున్నాడు," అంటారు మధుసూదన్. ఈయన ఎనిమిదిమంది సభ్యులున్నతన కుటుంబాన్ని పోషించుకునేందుకు అనేక ఇతర పనులను కూడా చేస్తుంటారు.

కాలానికి ఎదురీదుతోన్న నేత (A Weave in Time) అనే ఈ చిత్రాన్ని 2014లో రూపొందించారు. మధుసూదన్‌కు వారసత్వంగా వచ్చిన ఈ కళ గురించీ, దానిని నిలబెట్టుకోవడం కోసం అతను పడే కష్టాలను గురించీ ఈ చిత్రం తెలియచేస్తుంది

వీడియో చూడండి: కాలానికి ఎదురీదుతోన్న నేత

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Kavita Carneiro

కవితా కార్నీరో పుణేకు చెందిన స్వతంత్ర చిత్రనిర్మాత, గత దశాబ్దకాలంగా సామాజిక-ప్రభావ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఆమె చిత్రాలలో రగ్బీ క్రీడాకారులపై నిర్మించిన జాఫర్ & టుడు అనే ఫీచర్-నిడివి కలిగిన డాక్యుమెంటరీ చిత్రం ఉంది. ఆమె తాజా చిత్రమైన కాళేశ్వరం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించింది.

Other stories by Kavita Carneiro
Text Editor : Vishaka George

విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli