మమతా పరేడ్ PARIలో మా సహోద్యోగి. అరుదైన ప్రతిభ, నిబద్ధత కలిగిన ఈ యువ జర్నలిస్ట్, డిసెంబర్ 11, 2022న విషాదకరంగా తన జీవితాన్ని ముగించింది.

ఆమె మరణించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ ప్రత్యేక పాడ్‌కాస్ట్‌ని మేం మీకు అందిస్తున్నాం. ఇందులో మహారాష్ట్ర, పాలఘర్ జిల్లాలోని వాడా తాలూకాకు చెందిన తన ప్రజలైన వర్లీ ఆదివాసీ సముదాయపు కథను మమత వివరిస్తుంది. ఈ ఆడియోను ఆమె చనిపోవడానికి కొన్ని నెలల ముందు రికార్డ్ చేసింది.

ప్రాథమిక సౌకర్యాలు, హక్కుల కోసం వారి పోరాటాల గురించి మమత రాసింది. ప్రపంచ పటంలో కనిపించని అనేక చిన్న కుగ్రామాల గురించి ఈ జర్నలిస్ట్  సాహసి నివేదించింది. ఆకలి, బాల కార్మికులు, వెట్టి కార్మికులు, పాఠశాల విద్య, భూమి హక్కులు, స్థానభ్రంశం, జీవనోపాధి, ఇంకా మరెన్నో వెషయాలపై మమత వార్తాసేకరణ చేసింది.


ఈ ఎపిసోడ్‌లో మమత తన గ్రామమైన మహారాష్ట్రలోని నింబవలిలో జరిగిన అన్యాయాన్ని గురించిన కథనాన్ని వివరిస్తోంది. ముంబయి-వడోదర జాతీయ రహదారి కోసం ఒక నీటి ప్రాజెక్టును నిర్మిస్తామని మభ్యపెట్టి తమ పూర్వీకుల నుంచి వస్తోన్న భూమిని ఇచ్చేలా గ్రామస్తులను ప్రభుత్వ అధికారులు ఎలా మోసగించారో ఆమె వివరించింది. ఆ ప్రాజెక్ట్ వారి గ్రామాన్ని రెండుగా చీల్చుకుంటూ వెళ్ళింది, అందుకు ప్రభుత్వం అందించిన పరిహారం కూడా చాలా తక్కువ.

PARIలో మమత గురించి తెలుసుకుని, ఆమెతో కలిసి పనిచేయడాన్ని మేం చాలా గొప్పగా భావిస్తున్నాం; PARIలో ఆమె అందించిన మొత్తం తొమ్మిది కథనాల జాబితా ఇక్కడ ఉంది.

మమత తన రచనల ద్వారా, సముదాయంతో కలిసి తాను చేసిన పని ద్వారా జీవించేవుంటుంది. ఆమెను కోల్పోవడం చాలా లోతైన విషాదం.

ఈ పాడ్‌కాస్ట్‌ను రూపొందించడంలో సహాయం చేసినందుకు హిమాంశు సైకియాకు మా ధన్యవాదాలు

కవర్ ఇమేజ్‌పై ఉన్న మమత ఫొటో ఆమె ఫెలోగా ఉన్న సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ వెబ్‌సైట్ నుండి తీసుకున్నది. ఆ ఫొటోను ఉపయోగించుకునేందుకు మమ్మల్ని అనుమతించినందుకు వారికి ధన్యవాదాలు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aakanksha

ఆకాంక్ష పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్‌గానూ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నారు. విద్యా బృందంలో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి చుట్టూ ఉన్న విషయాలను డాక్యుమెంట్ చేయడంలో శిక్షణ ఇస్తారు.

Other stories by Aakanksha
Editors : Medha Kale

మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.

Other stories by Medha Kale
Editors : Vishaka George

విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli