కొల్హాపూర్ ఒక (పురోగామి) ప్రగతిశీల నగరంగా పేరొందింది. ఈ నగరం గొప్ప ఆలోచనాపరులైన శాహు, ఫూలే, అంబేద్కర్‌ల వారసత్వాన్ని కలిగివుంది. వివిధ సంస్కృతుల పట్ల గౌరవం, స్నేహభావంతో సహా ఈ ప్రగతిశీల ఆలోచనా ధారను కాపాడుకోవటానికి వివిధ మతాలకు, కులాలకు చెందిన ప్రజలు ఇప్పటికీ కృషిచేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ సర్వపక్ష సమాజంలో విభేదాలు సృష్టించేందుకు కలిసికట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలోచనలు ఆలోచనలతో పోరాడాలి. షర్ఫుద్దీన్ దేశాయ్, సునీల్ మాలీ వంటి వ్యక్తులు సమాజంలో సామరస్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

షర్ఫుద్దీన్ దేశాయ్, సునీల్ మాలీలు మహారాష్ట్ర, కొల్హాపూర్ జిల్లాలోని తార్‌దాళ్ గ్రామవాసులు. షర్ఫుద్దీన్ దేశాయ్ ఒక హిందూ గురువును స్వీకరించగా, సునీల్ మాలీ ఒక ముస్లిమ్ గురువుపై విశ్వాసంతో ఉన్నారు.

చిత్రాన్ని చూడండి: సోదరత్వం

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Jaysing Chavan

జైసింగ్ చవాన్ కొల్హాపుర్‌కు చెందిన ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, చిత్ర నిర్మాత.

Other stories by Jaysing Chavan
Text Editor : PARI Desk

PARI డెస్క్ మా సంపాదకీయ కార్యక్రమానికి నాడీ కేంద్రం. ఈ బృందం దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్‌లు, పరిశోధకులు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్రనిర్మాతలు, అనువాదకులతో కలిసి పని చేస్తుంది. PARI ద్వారా ప్రచురితమైన పాఠ్యం, వీడియో, ఆడియో, పరిశోధన నివేదికల ప్రచురణకు డెస్క్ మద్దతునిస్తుంది, నిర్వహిస్తుంది కూడా.

Other stories by PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli