ఎనభై ఏళ్ళు పైబడిన శేరింగ్ దోర్జీ భూటియా ఐదు దశాబ్దాలుగా చేతితో విల్లులను తయారుచేస్తున్నారు. వృత్తి రీత్యా వడ్రంగి అయిన దోర్జీ ఫర్నీచర్ మరమ్మత్తులు చేయడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఆయనకు ప్రేరణ, స్థానిక సిక్కిం సంస్కృతిలో లోతుగా పాతుకొనివున్న విలువిద్య నుండి వచ్చింది.

సిక్కింలోని పాక్‌యోంగ్ జిల్లా, కార్థోక్ గ్రామంలో ఇంతకు ముందు ఎక్కువమంది విల్లు తయారీదారులు ఉండేవారనీ, ఇప్పుడు శేరింగ్ ఒక్కరే మిగిలారని స్థానికులు చెబుతున్నారు. శేరింగ్ వెదురును ఉపయోగించి విల్లులను తయారుచేస్తారు. వాటిని బౌద్ధుల పండుగ లసూంగ్‌ జరిగే సమయంలో విక్రయిస్తారు

శేరింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చదవండి: శేరింగ్ : పాక్‌యోంగ్‌లో బాణంలా నికార్సయిన విల్లు తయారీ నిపుణుడు

వీడియో చూడండి: వెదురు విల్లుల తయారీని ప్రేమించే శేరింగ్ భూటియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
Jigyasa Mishra

జిగ్యసా మిశ్రా ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ లో ఒక స్వతంత్ర జర్నలిస్ట్.

Other stories by Jigyasa Mishra
Video Editor : Urja

ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.

Other stories by Urja
Text Editor : Vishaka George

విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli