కర్నాటకలోని బళ్లారిలో, రెండు దశాబ్దాల క్రితం యాంత్రీకరణ ప్రవేశించి తమకు పనిలేకుండా చేసేంతవరకు మహిళా గని పనివారు ఖనిజాన్ని తవ్వి, చూర్ణం చేసి, కోసి, జల్లెడపట్టే పనులు చేసేవారు. యజమానులు నష్టపరిహారాన్ని, పునరావాసాన్ని కూడా తిరస్కరిస్తూవస్తుండటంతో, ఇప్పుడు కార్మిక సంఘం ద్వారా సంఘీభావాన్ని పొందుతోన్న ఆ మహిళలు తమ గొంతులు విప్పగలుగుతున్నారు