ఆగస్ట్ 15, 1947న మిగతా భారతదేశమంతా స్వాతంత్ర్యం వచ్చిందని వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, తెలంగాణలో మాత్రం మల్లు స్వరాజ్యం, ఆమె తోటి విప్లవకారులు హైదరాబాద్ నిజామ్‌కు చెందిన సాయుధ మిలీషియాతోనూ, పోలీసులతోనూ పోరాడుతూ ఉన్నారు. 1946లో, 16 ఏళ్ల వయసులో, నిజామ్ ప్రభుత్వం తన తలపై రూ.10,000ల బహుమతిని ప్రకటించేలా చేసుకున్న ఈ నిర్భయ పోరాటయోధ గురించిన సంగ్రహావలోకనాన్ని ఈ వీడియో మనకు అందిస్తోంది. ఆ కాలంలో పదివేల రూపాయలంటే, 83,000 కిలోల కంటే ఎక్కువే బియ్యాన్ని కొనుగోలు చేయగలిగినంత మొత్తం!

ఈ వీడియో మనకు 84 సంవత్సరాల వయస్సులోనూ, 92 సంవత్సరాల వయస్సులోనూ ఉన్నప్పటి మల్లు స్వరాజ్యంగారి గురించిన క్లుప్తమైన విశేషాలను అందిస్తోంది. ఈ సంవత్సరం మార్చి 19న మరణించిన ఆ గొప్ప స్వాతంత్ర్య సమరయోధ గౌరవార్థం ఆగస్టు 15, 2022 సందర్భంగా మేమీ కథనాన్ని తీసుకువస్తున్నాం. మల్లు స్వరాజ్యం గురించిన పూర్తి కథనాన్ని PARI వ్యవస్థాపక-సంపాదకులు పి. సాయినాథ్ రచించిన పుస్తకం, The Last Heroes: Footsoldiers of Indian Freedom లో మీరు చదవవచ్చు. ఈ పుస్తకం ఈ యేడాది నవంబర్‌లో పెంగ్విన్ ఇండియా ప్రచురణగా వెలువడుతోంది.

వీడియో చూడండి: స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లు స్వరాజ్యం: ‘పోలీసులు భయంతో పరారయ్యారు’

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli