ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం కొత్త ప్రభుత్వం కోసం ఓటు వేస్తోంది; 2024 ఏప్రిల్ 19-జూన్ 1 మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రామీణ భారతదేశంపై మా దృష్టిని కేంద్రీకరించి, గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లను ఏమేమి నడిపిస్తాయో అర్థం చేసుకోవడానికి PARI వివిధ నియోజకవర్గాలకు వెళుతుంది. రైతులు, వ్యవసాయ కూలీలు, అటవీవాసులు, వలసదారులు, పేదరికం అంచులలో నివసిస్తున్నవారు మా విలేఖరులతో మాట్లాడుతూ, కనీస ప్రాథమిక అవసరాలైన తమ ఇళ్ళకూ పొలాలకూ నీరు, విద్యుత్తు కోసం; తమ పిల్లలకు ఉపాధి అవకాశాల కోసం తహతహలాడుతున్నామని చెప్పారు. రాజకీయ ఎజెండాలు రెచ్చగొడుతోన్న మతపరమైన ఉద్రిక్తతల మధ్య తమ ప్రాణాలకు, భద్రతకు కలిగే ముప్పు గురించి భయపడే ఓటర్లు కూడా ఉన్నారు. మా పూర్తి కవరేజీని ఇక్కడ చదవండి: