మేం గ్రామీణ భారతదేశం గురించిన, అట్టడుగు ప్రజల గురించిన కథనాలను ప్రధాన స్రవంతి విద్యా పాఠ్యాంశాల్లోకి తీసుకువస్తాం. తమ చుట్టూ ఉన్న సమస్యలను నివేదించాలనుకునే, వాటిని డాక్యుమెంట్ చేయాలనుకునే యువతతో కలిసి పనిచేస్తాం, పాత్రికేయ కథనాల్లో వారికి మార్గదర్శకత్వాన్నీ, శిక్షణనూ ఇస్తాం. మేం దీన్ని చిన్న కోర్సుల రూపంలో అందించడం, సెషన్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు రోజువారీ ప్రజల దైనందిన జీవితాలపై మెరుగైన అవగాహన కల్పించే పాఠ్యాంశాలను రూపొందిస్తాం.