కవితా కార్నీరో పుణేకు చెందిన స్వతంత్ర చిత్రనిర్మాత, గత దశాబ్దకాలంగా సామాజిక-ప్రభావ చిత్రాలను రూపొందిస్తున్నారు. ఆమె చిత్రాలలో రగ్బీ క్రీడాకారులపై నిర్మించిన జాఫర్ & టుడు అనే ఫీచర్-నిడివి కలిగిన డాక్యుమెంటరీ చిత్రం ఉంది. ఆమె తాజా చిత్రమైన కాళేశ్వరం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించింది.