ఇవన్నీ భారతదేశం వ్యాప్తంగా PARI చేసిన కథనాలు. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి వర్తమాన సమాజం నుండి వచ్చిన ఈ సజీవ కథలలో - సంతానం కలగక పోవడం వలన సమాజంలో మహిళలు అనుభవించే చిన్నచూపు , మహిళలకు సంతానం కలగకుండా చేసే శస్త్రచికిత్స పై గట్టి వత్తిడి, కుటుంబ నియంత్రణ లో మగవారి పాత్ర తక్కువగా ఉండడం, గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సంస్థలలో సేవలు సరిగ్గా లేకపోవడం, ఒకవేళ ఉన్నా అవి ఎందరికో అందుబాటులో లేకపోవడం, అర్హత లేని లేదా శిక్షణ లేని వైద్య సేవకులు, ప్రమాదకరమైన శిశు ప్రసవాలు, ఋతుస్రావ సమయాలలో మహిళల పై చూపే వివక్ష, మగ సంతానం మాత్రమే కలగాలనే మొండి కోరిక- ఇంకా మరెన్నో. గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా సాగే ఈ కథనాలు - ఆరోగ్య సంబంధిత చెడు నమ్మకాలు- పద్ధతులు, ప్రజలు - వర్గాలు, లింగము - హక్కులు, ఇలా వారి రోజువారి పోరాటాలలు, కొన్ని చిన్ని విజయాలు నిండి ఉన్నాయి