గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో భూమిలేని దళితులకు పేరుకు భూమి ఉంది కానీ, అది కాగితాల మీద మాత్రమే ఉంది. పరిపాలనాపరమైన ఉదాసీనత, కుల వివక్ష వంటి కారణాలు రాష్ట్రంలోని అనేకమంది దళితులను వారికి కేటాయించిన భూమిని వారి అధీనంలోకి తీసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నాయి