కరవు, ఆర్థిక ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న విదర్భ రైతులకు ఇప్పుడొక కొత్త ఆందోళన మొదలైంది – మహారాష్ట్రలోని తాడోబా అంధారి టైగర్ రిజర్వ్‌ను దాటే క్రమంలో వన్యప్రాణుల వల్ల దాడులకు, హత్యలకు గురికావడం. రాష్ట్ర ప్రభుత్వం నుండి అంతంత మాత్రంగా మద్దతు లభించడంతో, వారు తమ ప్రాణాలను తామే కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది