ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు : జీవనసాగరంలో లాక్ డౌన్ చిక్కులు
సముద్ర జలాల్లో చేపల పునరుత్పత్తి జరిగే కాలంలో చేపల వేట మీద ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ ప్రతి యేటా ప్రభుత్వ నిషేధానికి ముందు ఒక రెండు వారాల పాటు చేపల వేట జోరుగా చేసి విశాఖపట్నం మత్స్యకారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. లాభాలు చేతికందే ఈ కీలక సమయంలోనే లాక్ డౌన్ వచ్చింది.