"మేం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం," తన పక్కనే నిల్చొని ఉన్న స్నేహితురాలు సకుని వైపు ప్రేమగా చూస్తూ అన్నారు గీతా దేవి.

ఈ ఇద్దరూ దగ్గరలో ఉన్న అడవి నుంచి సాల ( షోరియా రొబస్టా ) పత్రాలను సేకరించి వాటితో దోనాలు (గిన్నెలు), పత్తల్‌లు (పళ్ళాలు) చేసి, వాటిని పలామూ జిల్లా ప్రధానకార్యాలయమైన డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు.

గీత, సకుని దేవిలు గత 30 ఏళ్ళుగా కోపె గ్రామంలోని నదిటోలా అనే చిన్న పల్లెలో ఇరుగుపొరుగులుగా జీవిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని అనేకమంది గ్రామస్తులలాగే గీత, శకుని కూడా తమ జీవిక కోసం అడవిపైనే ఆధారపడుతున్నారు.

వాళ్ళు అడవిలో ఏడెనిమిది గంటలపాటు గడుపుతారు, మేతకు వెళ్ళిన పశువులు ఇళ్ళకు మళ్ళిన సమయంలో వాళ్ళు కూడా ఇంటికి బయలుదేరుతారు. సరిపోయినన్ని ఆకులను సేకరించడానికి వారికి రెండు రోజులు పడుతుంది. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ, తమ కుటుంబాల గురించీ, స్థానిక వార్తలను గురించీ మాట్లాడుకుంటూ ఉంటే వారి సమయం త్వరగా గడిచిపోతుంది.

ప్రతి ఉదయం, " నికలీహే... " అంటూ పొరుగింటామె తనను పిలిచే పిలుపు కోసం గీత ఎదురుచూస్తారు. కొద్దిసేపటి తర్వాత, పాత సిమెంట్ గోతాలతో చేసిన ఒక సంచిని, ప్లాస్టిక్ సీసాలో నీటిని, చిన్న గొడ్డలిని, పాత గుడ్డ ముక్కను పట్టుకొని ఇద్దరూ ఇళ్ళు వదులుతారు. వాళ్ళిద్దరూ ఝార్ఖండ్‌లోని పలామూ టైగర్ రిజర్వ్‌కు తటస్థ ప్రాంతంగా ఉన్న హెహెగరా వైపు కదులుతారు.

ఆ ఇద్దరు స్నేహితులు వేర్వేరు సముదాయాలకు చెందినవారు - గీత భుయియాఁ దళిత వర్గానికి, సకుని ఉరాఁవ్ ఆదివాసీ సముదాయానికి చెందుతారు. మేం నడుస్తున్నప్పుడు గీత ఒక హెచ్చరిక కూడా చేశారు: "ఇక్కడికి ఒంటరిగా రావద్దు," అంటూ, "కొన్నిసార్లు అడవి జంతువులు కూడా కనిపిస్తాయి. మేం తెందువాల ను [చిరుతపులులను] చూశాం!" చెప్పారామె. పాములు, తేళ్ళ వల్ల కూడా ముప్పు ఎక్కువగానే ఉంటుంది. "చాలాసార్లు మేం ఏనుగులను చూశాం,” అని సకుని జత పలికారు. పలామూ టైగర్ రిజర్వ్‌లో 73 చిరుతపులులు, సుమారు 267 ఏనుగులు ఉన్నాయి ( 2021 వన్యప్రాణుల గణన ).

Sakuni (left) and Geeta Devi (right), residents of Kope village in Latehar district, have been friends for almost three decades. They collect sal leaves from Hehegara forest and fashion the leaves into bowls and plates which they sell in the town of Daltonganj, district headquarters of Palamau
PHOTO • Ashwini Kumar Shukla
Sakuni (left) and Geeta Devi (right), residents of Kope village in Latehar district, have been friends for almost three decades. They collect sal leaves from Hehegara forest and fashion the leaves into bowls and plates which they sell in the town of Daltonganj, district headquarters of Palamau
PHOTO • Ashwini Kumar Shukla

లాతేహార్ జిల్లాలోని కోపే గ్రామానికి చెందిన సకుని (ఎడమ), గీతాదేవి (కుడి) దాదాపు మూడు దశాబ్దాలుగా స్నేహితులు. వారు హెహెగరా అడవి నుండి సాల పత్రాలను సేకరించి, ఆ ఆకులతో గిన్నెలు, పళ్ళాలు తయారుచేసి, వాటిని పలామూ జిల్లా ప్రధాన కార్యాలయం అయిన డాల్టన్‌గంజ్ పట్టణంలో విక్రయిస్తారు

మంచుతో కూడిన ఈ శీతాకాలపు ఉదయాన, యాభై ఏళ్ళ పైబడిన వయస్సు గల ఆ ఇద్దరూ తేలికపాటి శాలువాలను మాత్రమే ధరించివున్నారు. వారు మొదట లాతేహార్ జిల్లాలోని మనికా బ్లాక్‌లోని వారి ఇంటికి దగ్గరగా ఉన్న ఔరంగా నదిని దాటారు. నీరు తక్కువగా ఉండే చలికాలంలో కాలినడకన నదిని దాటడం సులభమే, కానీ వర్షాకాలంలో ఒడ్డుకు చేరుకోవడానికి వారు తరచుగా మెడలోతు నీటిలో ఈదవలసి ఉంటుంది.

ఒకసారి అవతలి ఒడ్డును చేరిన తరువాత మరో 40 నిముషాల నడక. నేలపై వారి రబ్బరు చెప్పులు చేసే లయబద్ధమైన టక్-టక్-టక్ శబ్దం మాత్రమే అడవిలోని నిశ్శబ్దాన్ని చెదరగొడుతోంది. వారు ఒక పెద్ద మహువా ( మధూకా లాంజిఫోలియా - విప్ప) చెట్టు వైపుకు వెళుతున్నారు, ఇది సాల చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతానికి సూచిక.

“అడవి ఇప్పుడు ఒకప్పటిలా లేదు. ఇది ఇంతకు ముందు చాలా దట్టంగా ఉండేది… మేం ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండేది కాదు,” అని సకుని చెప్పారు. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ డేటా ప్రకారం ఝార్ఖండ్ 2001- 2022 మధ్య 5.62 కిలోల హెక్టార్ల చెట్ల విస్తీర్ణాన్ని కోల్పోయింది.

కొన్ని దశాబ్దాల క్రితం అడవిలోకి తమ ప్రయాణాలను గుర్తు చేసుకుంటూ సకుని, “అప్పుడు ఏ సమయంలోనైనా 30-40 మంది అడవిలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కువగా పశువుల, మేకల కాపరులు, పొయ్యిలోకి కట్టెలు సేకరించేవారు మాత్రమే వుంటున్నారు," అన్నారు.

నాలుగేళ్ళ క్రితం కూడా చాలామంది మహిళలు ఈ పనిని చేస్తుండేవారని, అయితే దీని ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ఈ పనిని కొనసాగించేందుకు అది ఆటంకంగా మారిందని గీత చెప్పారు. వారి గ్రామంలో ఇప్పటికీ ఈ వృత్తిని కొనసాగిస్తోన్న కొద్దిమంది మహిళల్లో ఈ స్నేహితురాళ్ళిద్దరూ ఉన్నారు.

ఇప్పుడు అమ్మకానికి కట్టెలు సేకరించడాన్ని నిషేధించటం వలన కూడా మహిళలు ఆ పని మానేసారు. "ఇది 2020లో లాక్‌డౌన్ సమయంలో ఆగిపోయింది," అని సకుని చెప్పారు. ఝార్ఖండ్ ప్రభుత్వం మొదట కట్టెల సేకరణపై రుసుము విధించి ఆ తరువాత ఉపసంహరించుకున్నప్పటికీ, ఎండిన కర్రలను విక్రయించాలనుకుంటే మాత్రం వారు ఇప్పటికీ  రుసుము చెల్లించాలని గ్రామస్థులు చెబుతున్నారు.

In the area known as Naditola, Geeta lives with her large family of seven and Sakuni with her youngest son (right) Akendar Oraon
PHOTO • Ashwini Kumar Shukla
In the area known as Naditola, Geeta lives with her large family of seven and Sakuni with her youngest son (right) Akendar Oraon
PHOTO • Ashwini Kumar Shukla

నదీటోలా అని పిలిచే ప్రాంతంలో గీత తన ఏడుగురు సభ్యులున్న పెద్ద కుటుంబంతోనూ, సకుని తన చిన్న కొడుకు (కుడి) అకేందర్ ఉరాఁవ్‌తోనూ కలసి ఉంటున్నారు

అడవిలో ఆ స్నేహితుల నడక తమనూ, తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే. సకుని తన ఇరవైల వయసులో ఈ పనిని ప్రారంభించారు. "నాకు చాలా చిన్న వయస్సులోనే పెళ్ళయింది," అని ఆమె చెప్పారు. తాగుడుకు బానిసైన ఆమె భర్త ఆమెను విడిచిపెట్టినప్పుడు, సకుని తనను, తన ముగ్గురు కొడుకులను పోషించుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది. "చాలా తక్కువ పని [అందుబాటులో] ఉండేది," అని ఆమె చెప్పారు, "ఆకులు, దతువాఁలు (పందుంపుల్లలు) అమ్మడం ద్వారా నా పిల్లలను పోషించుకున్నాను.”

సకుని ఇప్పుడు తన చిన్న కొడుకు 17 ఏళ్ళ అకేందర్ ఉరాఁవ్‌తో కలిసి ఒక రెండు గదుల కచ్చా ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె పెద్ద కుమారులిద్దరు పెళ్ళిచేసుకుని అదే కోపే గ్రామంలో వేర్వేరు ఇళ్ళలో నివసిస్తున్నారు.

అక్కడికి కొన్ని ఇళ్ళ తరువాత, గీత తన పెద్ద కుటుంబంలోని ఏడుగురు - ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు, కోడలు, ఇంకా ఇద్దరు మనవసంతానంతో కలసి ఒక మట్టి ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె భర్త ఐదేళ్ళ క్రితం చనిపోయారు. గీత చిన్న కుమార్తె, 28 ఏళ్ల ఊర్మిళా దేవి కూడా దోనాలు అమ్ముతుంది, కానీ గీత ఆమెకు వేరే భవిష్యత్తును కోరుకుంటున్నారు. “నేను నా పెద్ద కుమార్తెను ఒక పేద కుటుంబంలో ఇచ్చి వివాహం చేశాను. నా చిన్న కూతురికి అలా చేయను. కావాలంటే కట్నం ఇస్తాను," అంటారామె.

ఏడుగురు తోబుట్టువుల్లో చిన్నదైన గీత చిన్నప్పటి నుంచి పని చేస్తూ బడికి వెళ్ళనేలేదు. "నేను బడికి వెళితే, ఇంటి పనులు ఎవరు చేస్తారు?" అని ఆమె అడుగతారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆమె దినచర్య మొదలవుతుంది. వంట చేయడం, ఇల్లూవాకిలీ శుభ్రం చేయడం, అడవికి వెళ్ళే ముందు పశువులను (ఒక ఆవు, రెండు ఎద్దులు) మేతకు పంపడం వంటి ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉంటారు. ఆమె స్నేహితురాలి దినచర్య కూడా ఇదే అయినా, గీతకు ఇంటి పనులలో కోడలు సాయం చేస్తుంది, కానీ సకునికి సహాయం చేసేవారు ఎవరూ లేరు

*****

తటస్థ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ ఇద్దరు మహిళలు తమ సంచులను కింద పెట్టారు. చల్లగా ఉన్న ఆ ఉదయాన కూడా నడక వారికి చెమటలు పట్టేలా చేసింది. తమ చీర కొంగు చివర్లతో వారు నుదురు, మెడ తుడుచుకున్నారు.

పని ప్రారంభించడానికి ముందు వారు పాత గుడ్డ మూలలను కలిపి ముడివేసి, దాన్ని ఒక సంచి లాగా తయారుచేశారు. అందులో వారు ఆకులను ఉంచుతారు. తమ చీర కొంగులను నడుములోకి దోపుకొని, సంచిని భుజాలపైన వేలాడేసి, ఇప్పుడు వారు ఆకులు కోసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Every morning, Sakuni and Geeta cross the Auranga river near their home and make their way on foot to the forest. Even four years ago, there were many women involved in the craft of dona and pattal -making, but poor earnings has deterred them from continuing. The friends are among the last women in their village still engaged in this craft
PHOTO • Ashwini Kumar Shukla
Every morning, Sakuni and Geeta cross the Auranga river near their home and make their way on foot to the forest. Even four years ago, there were many women involved in the craft of dona and pattal -making, but poor earnings has deterred them from continuing. The friends are among the last women in their village still engaged in this craft
PHOTO • Ashwini Kumar Shukla

ప్రతి రోజూ ఉదయం సకుని, గీత తమ ఇంటికి సమీపంలోని ఔరంగా నదిని దాటి అడవికి కాలినడకన వెళతారు. నాలుగు సంవత్సరాల క్రితం కూడా, దోనా, పత్తల్ తయారీలో చాలామంది మహిళలు పాల్గొనేవారు, కాని దీని ద్వారా వచ్చే అతి తక్కువ ఆదాయం వారిని ఆ పనిని కొనసాగించనివ్వలేదు. వారి గ్రామంలో ఇప్పటికీ ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్న మహిళల్లో ఈ ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు

The two women also cut and collect branches of the sal tree which they sell as datwan( a stick to clean teeth), sometimes with help from family members . One bundle of datwan costs 5 rupees. 'People don’t even want to pay five rupees for the datwan. They bargain,' says Sakuni
PHOTO • Ashwini Kumar Shukla
The two women also cut and collect branches of the sal tree which they sell as datwan( a stick to clean teeth), sometimes with help from family members . One bundle of datwan costs 5 rupees. 'People don’t even want to pay five rupees for the datwan. They bargain,' says Sakuni
PHOTO • Ashwini Kumar Shukla

ఈ ఇద్దరు మహిళలు సాల చెట్ల కొమ్మలను కూడా నరికి, వాటిని దతువాఁ (పందుంపుల్ల)గా విక్రయిస్తారు. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా ఈ పనిలో సహాయం చేస్తారు. ఒక దతువాఁ కట్ట 5 రూపాయలు. 'దతువాఁ కోసం ప్రజలు ఐదు రూపాయలు చెల్లించడానికి కూడా ఇష్టపడరు. బేరమాడతారు,' అంటారు సకుని

వారు తమ ఎడమ చేతితో కొమ్మను పట్టుకుని, కుడిచేతితో పెద్దగా, దీర్ఘవృత్తాకారంలో ఉండే ఆకులను కోస్తారు. "ఈ చెట్టుకు మాటాలు [ఎర్ర చీమలు] ఉన్నాయి, జాగ్రత్త," అంటూ సకుని తన స్నేహితురాలిని హెచ్చరించారు.

"మేం తక్కువ రంధ్రాలున్న మంచి ఆకుల కోసం చూస్తాం," తన సంచిలో కొన్ని ఆకులను వేసుకుంటూ గీత చెప్పారు. కిందికి వంగిన కొమ్మల నుండి వాటిని కోస్తారు కానీ ఆకులు అందనప్పుడు చెట్టు ఎక్కి గొడ్డలిని ఉపయోగించవలసి వస్తుంది.

సాధారణంగా సాల చెట్లు నెమ్మదిగా, 164 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. అయితే, ఈ అడవిలో ఉన్న సాల చెట్లు మాత్రం చిన్నవి, 30-40 అడుగుల ఎత్తులో ఉంటాయి.

సకుని దాదాపు 15 అడుగుల ఎత్తు ఉన్న ఒక చెట్టు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఆమె చీరను పైకెత్తి మోకాళ్ళ మధ్య నుంచి వెనుకకు దోపుకున్నారు, గీత ఆమెకు గొడ్డలిని అందించారు. "దానిని నరుకు," ఒక కొమ్మను చూపిస్తూ చెప్పారామె. కొమ్మలను ఒకే కొలత ఉండేలా పొడవుకు కత్తిరించి దతువాఁ (పందుం పుల్ల) గా ఉపయోగించేందుకు వీళ్ళు వాటిని అమ్ముతారు.

"ఇది సరైన మందంలో ఉండాలి," ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వెళుతున్నప్పుడు గొడ్డలితో తన దారికడ్డం వచ్చే పొదలను తొలగిస్తూ అన్నారు గీత. “ సాల పుల్లలు చాలా మంచివి, ఎందుకంటే అవి త్వరగా ఎండిపోవు. మీరు వాటిని 15 రోజులు కూడా నిలవ ఉంచుకోవచ్చు,” అని ఆమె చెప్పారు.

ఆకులను, కొమ్మలను సేకరించడం అంత తేలికైన పని కాదు. “శీతాకాలం అత్యంత గడ్డు నెల; మా చేతులు మొద్దుబారిపోతాయి,” అని గీత చెబుతారు, “గొడ్డలిని గట్టిగా పట్టుకోవటం వలన నా చేతులు నొప్పిపెట్టడం మొదలవుతుంది.”

They collect leaves for 7-8 hours a day, twice a week. T his time, on the second day, they are joined by Geeta's son Ajit and daughter-in-law Basanti (right) who have brought along their baby. If the baby cries, the three of them take turns soothing her
PHOTO • Ashwini Kumar Shukla
They collect leaves for 7-8 hours a day, twice a week. T his time, on the second day, they are joined by Geeta's son Ajit and daughter-in-law Basanti (right) who have brought along their baby. If the baby cries, the three of them take turns soothing her
PHOTO • Ashwini Kumar Shukla

వారు రోజుకు 7-8 గంటల చొప్పున, వారానికి రెండుసార్లు ఆకులను సేకరిస్తారు. ఈసారి, రెండవ రోజున, బిడ్డను వెంట తెచ్చుకున్న గీత కుమారుడు అజిత్, కోడలు బసంతి (కుడి) వారికి జతయ్యారు. పాప ఏడ్చినపుడు వారు ముగ్గురూ వంతులవారీగా పాపను ఊరుకోబెడతారు

Left: Eight years ago, Ajit migrated to Punjab, where he works as a daily wage labourer, earning Rs. 250 a day.
PHOTO • Ashwini Kumar Shukla
Right:  Work stops in the evening when they spot the cattle heading home after grazing. On the third day, Geeta and Sakuni return to the forest to collect the sacks and make their way to Hehegara station from where they catch a train to Daltonganj
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: ఎనిమిది సంవత్సరాల క్రితం పంజాబ్‌కు వలస వెళ్ళిన అజిత్, అక్కడ రోజు కూలీగా పనిచేస్తూ, రోజుకు రూ. 250 సంపాదిస్తున్నాడు. కుడి: మేతకు వచ్చిన పశువులు ఇంటికి తిరిగి వెళ్తున్న సాయంత్రం వేళ, వారు పనిని ఆపేస్తారు. మూడవ రోజు గీత, సకుని బస్తాలను తీసుకోవడానికి తిరిగి అడవికి వెళ్ళి, అక్కడి నుండి నేరుగా హెహెగరా స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుండి డాల్టన్‌గంజ్ వెళ్ళే రైలు ఎక్కుతారు

సాల చెట్టు ఆకులు రాల్చే ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య - ఏప్రిల్-మే నెలలలో మళ్ళీ కొత్త ఆకులు కనిపించే వరకూ - వారి పని ఆగిపోతుంది. ఈ సమయంలో సకుని మహువా (విప్ప) పువ్వులను సేకరిస్తారు. ఈ సంవత్సరం (2023) ప్రారంభంలో ఆమె అడవి నుండి 100 కిలోల మహువా ను సేకరించి, ఎండబెట్టి, ఆ పువ్వులను స్థానిక వ్యాపారికి కిలో 30 రూపాయల చొప్పున అమ్మారు. పచ్చని ఆ పువ్వులను మద్యం తయారీకి, వంట నూనెను తయారుచేయడానికి, ఇంకా వంట పదార్థంగా కూడా ఉపయోగిస్తారు.

అయితే గీత మాత్రం ఆ సమయంలో పని చెయ్యరు, వలస కూలీలుగా పనిచేస్తోన్న ఆమె ముగ్గురు కుమారుల ఆదాయం ఆ సమయంలో వారి కుటుంబాన్ని పోషిస్తుంది. ఇంట్లో ఉండే మహువా చెట్టు వారి ఇంటి అవసరాలను తీరుస్తుంది.

*****

అడవిలో మూడు రోజులపాటు శ్రమపడి తగినంత సేకరించిన తర్వాత గీత, సకుని తమ సరుకును డాల్టన్‌గంజ్ తీసుకువెళ్తారు. సుమారు 30 కిలోల బరువుండే ఆ సంచులను మోసుకుంటూ, అక్కడికి 30 నిముషాల నడక దూరంలో ఉన్న హెహెగరా స్టేషన్‌కు దారితీస్తారు. "నేనీసారి ఎక్కువ దతువాఁల ను తీసుకెళ్తున్నాను," నవ్వుతూ చెప్పారు గీత. వారి వీపుపై ఉండే సంచులకు తోడుగా ఒక వెచ్చని దుప్పటి కూడా ఉంటుంది.

హెహెగరా స్టేషన్‌లో ఆ ఇద్దరు మహిళలు ఒక చెట్టు నీడను చూసుకొని కూర్చొని, తమను డాల్టన్‌గంజ్‌కు తీసుకువెళ్ళే మధ్యాహ్నం 12 గంటల లోకల్ రైలు కోసం వేచి చూస్తారు.

" పత్తా-దతువాఁ అమ్మేవారికి టిక్కెట్లు అవసరం లేదు," అని సకుని ఈ విలేఖరితో చెప్పారు. ఆమె తన వస్తువులను రైలు తలుపు పక్కనే ఉన్న సీటుపై ఉంచారు. నెమ్మదిగా నడిచే ఆ ప్యాసింజర్ రైలు 44 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడు గంటల సమయం తీసుకుంటుంది. "ప్రయాణంలోనే రోజంతా వృధాగా గడిచిపోతుంది," నిట్టూర్చారు సకుని.

రైలు కదలడం మొదలైంది, గీత తన 2.5 ఎకరాల భూమి గురించి మాట్లాడటం ప్రారంభించారు. అందులో ఆమె వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, శీతాకాలంలో గోధుమలు, బార్లీ, శనగలు పండిస్తారు. "ఈ సంవత్సరం వరి పంట బాగా రాలేదు, కానీ మేం 250 కిలోల మొక్కజొన్నను 5,000 రూపాయలకు అమ్మాం," అని ఆమె చెప్పారు.

సకుని దేవికి సుమారుగా ఒక ఎకరం భూమి వుంది. అందులో ఆమె ఖరీఫ్ , రబీ ల కాలంలో పంటలు సాగు చేస్తారు. “ఈసారి నేను సాగు చేయలేదు; వరి నాటాను కానీ అది పెరగలేదు,” అన్నారామె.

Carrying the loads on their heads, the two women walk for around 30 minutes to get to the station. The slow passenger train will take three hours to cover a distance of 44 kilometres. 'A whole day wasted on the journey alone,' Sakuni says
PHOTO • Ashwini Kumar Shukla
Carrying the loads on their heads, the two women walk for around 30 minutes to get to the station. The slow passenger train will take three hours to cover a distance of 44 kilometres. 'A whole day wasted on the journey alone,' Sakuni says
PHOTO • Ashwini Kumar Shukla

ఆ మహిళలిద్దరూ తమ తలపై బరువులు మోస్తూ స్టేషన్‌కు చేరుకోవడానికి దాదాపు 30 నిమిషాలు నడుస్తారు. నెమ్మదిగా నడిచే ఆ ప్యాసింజర్ రైలు 44 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మూడు గంటల సమయం తీసుకుంటుంది. 'ప్రయాణంలోనే రోజంతా వృధాగా గడిచిపోతుంది,' అంటారు సకుని

On the train, Geeta and Sakuni Devi talk about farming. Geeta owns 2.5 acres of land where she cultivates paddy and maize during the monsoons and wheat, barley and chickpeas during winter. Sakuni Devi owns around an acre of land, where she farms in both kharif and rabi seasons. While they chat, they also start making the donas
PHOTO • Ashwini Kumar Shukla
On the train, Geeta and Sakuni Devi talk about farming. Geeta owns 2.5 acres of land where she cultivates paddy and maize during the monsoons and wheat, barley and chickpeas during winter. Sakuni Devi owns around an acre of land, where she farms in both kharif and rabi seasons. While they chat, they also start making the donas
PHOTO • Ashwini Kumar Shukla

రైలులో గీత, సకుని దేవి తమ వ్యవసాయం గురించి మాట్లాడారు. గీతకు 2.5 ఎకరాల భూమి ఉంది. అందులో ఆమె వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, శీతాకాలంలో గోధుమలు, బార్లీ, శనగలు పండిస్తారు. సకుని దేవికి సుమారుగా ఒక ఎకరం భూమి వుంది. అందులో ఆమె ఖరీఫ్, రబీల కాలంలో పంటలు సాగు చేస్తారు. వారు కబుర్లు చెప్పుకుంటూనే దోనాలు చేయడం మొదలెట్టారు

వారు కబుర్లు చెప్పుకుంటుండగానే, వారి చేతులు దోనాలు తయారుచేయడంలో నిమగ్నమైవున్నాయి - నాలుగు నుండి ఆరు ఆకులను ఒకదానిపై ఒకటి అమర్చడం, వాటిని వెదురు పుడకలతో కుట్టడం. మృదువైన ఆ ఆకులు ఎన్నిసార్లు మడిచినా చిరిగిపోకుండా, చక్కని పళ్ళాలుగా తయారవుతాయి. “ఆకులు పెద్దవైతే రెండు ఆకులతో ఒక దోనా ను చేయవచ్చు. లేకపోతే ఒక్క దోనా చేయటానికి నాలుగు నుంచి ఆరు ఆకులు పడతాయి,” అని సకుని వివరించారు.

వాటిని వృత్తాకారంలోకి తీసుకురావటానికి ఆకుల అంచులను మడుస్తారు, తద్వారా ఆహారం వడ్డించినపుడు అది పడిపోకుండా ఉంటుంది. “మనం అందులో కూర వేసినా అది కారిపోదు,” అని గీతాదేవి చెప్పారు.

12 దోనాలు న్న ఒక కట్టను నాలుగు రూపాయలకు అమ్మతారు, ఒక్కో కట్టలో దాదాపు 60 ఆకులు ఉంటాయి. సుమారు 1500 ఆకులను కోసి, దోనాలు చేసి, వాటిని రవాణా చేయడం ద్వారా వారికి వచ్చే సంపాదన 100 రూపాయలు.

ఈ మహిళలు దతువాఁ, పోలా ( సాల్ ఆకులు) కూడా పదుల కట్టలుగా విక్రయిస్తారు. వాటి ధర దతువాఁ ఐతే ఐదు, పోలా ఐతే 10 రూపాయలు. “ప్రజలు దతువాఁ కోసం ఐదు రూపాయలు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. బేరమాడతారు,” అంటారు సకుని.

సాయంత్రం 5 గంటలకు రైలు డాల్టన్‌గంజ్‌లోకి ప్రవేశించింది. స్టేషన్ బయట, రోడ్డు పక్కనే నేలపై గీత నీలిరంగు పాలిథిన్ పట్టాను పరిచారు. మళ్ళీ ఇద్దరూ దోనా లను తయారుచేసే పనిని మొదలుపెట్టారు. వీరు పత్తల్ లేదా పళ్ళాల కోసం కూడా ఆర్డర్లు తీసుకుంటారు. ఒక పళ్ళాన్ని రూపొందించడానికి 12-14 ఆకులు అవసరం అవుతాయి, ఒక పళ్ళాన్ని ఒకటి నుండి ఒకటిన్నర రూపాయలకు విక్రయిస్తారు. గృహ ప్రవేశాలు లేదా నవరాత్రులు లేదా దేవాలయాలలో ఆహార వితరణ వంటి సందర్భాలలో వీటిని ఉపయోగిస్తారు. 100 పత్తల్‌లు లేదా అంతకంటే ఎక్కువ వుండే పెద్ద ఆర్డర్ కోసం చాలామంది కలిసి పనిచేస్తారు.

Outside Daltonganj station, Geeta spreads a blue polythene sheet on the ground and the two resume the task of crafting donas. The women also take orders for pattals or plates. Their 'shop' is open 24x7 but they move into the station at night for safety. They will stay here until all their wares are sold
PHOTO • Ashwini Kumar Shukla
Outside Daltonganj station, Geeta spreads a blue polythene sheet on the ground and the two resume the task of crafting donas. The women also take orders for pattals or plates. Their 'shop' is open 24x7 but they move into the station at night for safety. They will stay here until all their wares are sold
PHOTO • Ashwini Kumar Shukla

డాల్టన్‌గంజ్ స్టేషన్ బయట, రోడ్డు పక్కనే నేలపై గీత నీలిరంగు పాలిథిన్ పట్టాను పరిచారు. మళ్ళీ ఇద్దరూ దోనాలను తయారుచేసే పనిని మొదలుపెట్టారు. ఈ మహిళలు పత్తల్ లేదా పళ్ళాల కోసం కూడా ఆర్డర్లు తీసుకుంటారు. వారి 'దుకాణం' 24 గంటలూ తెరిచే ఉంటుంది, అయితే వారు రాత్రివేళ భద్రత కోసం స్టేషన్‌ లోపలికి వెళతారు. తమ వస్తువులన్నీ అమ్ముడుపోయేవరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు

Left: Four to six leaves are arranged one upon the other and sewn together with strips of bamboo to make the dona . They fold the edges to create a circular shape so that when food is served, it won’t fall out. A bundle of 12 donas sells for four rupees.
PHOTO • Ashwini Kumar Shukla
Right: Bundles of datwan are bought by passengers from the night train.
PHOTO • Ashwini Kumar Shukla

ఎడమ: నాలుగు నుండి ఆరు ఆకులను ఒకదానిపై ఒకటి అమర్చి, వెదురు పుడకలతో కుట్లు వేసి దోనాను తయారుచేస్తారు. వాటిని వృత్తాకారంలోకి తీసుకురావటానికి ఆకుల అంచులను మడుస్తారు, తద్వారా ఆహారం వడ్డించినప్పుడు అది పడిపోదు. 12 దోనాలున్న ఒక కట్టను నాలుగు రూపాయలకు అమ్ముతారు. కుడి: రాత్రి రైలులో వచ్చే ప్రయాణీకులు దతువాఁ కట్టలను కొంటారు

గీత, సకుని దేవి ఇద్దరూ వారి వస్తువులన్నీ అమ్ముడయ్యే వరకు ఇక్కడే ఉంటారు. కొన్నిసార్లు ఒక రోజు కంటే ఎక్కువ సమయం, " దోనాలు అమ్మేవాళ్ళు ఇంకొంతమంది వస్తే,” ఎనిమిది రోజుల వరకూ కూడా పడుతుందని సకుని అన్నారు. అలాంటి సందర్భాలలో ఆ నీలిరంగు పట్టా రాత్రికి వారి తాత్కాలిక పడకగా మారుతుంది, వారు తీసుకెళ్ళిన దుప్పట్లు అప్పటికి అక్కరకు వస్తాయి. కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే, వాళ్ళు రెండు పూటలా సత్తూ (శనగపిండి జావ) తింటారు. అందుకోసం ఒక్కొక్కరు రోజుకు రు. 50 ఖర్చు చేస్తారు.

వారి 'దుకాణం' 24 గంటలూ తెరిచే ఉంటుంది. రాత్రి రైలులో వచ్చే ప్రయాణీకులు వారి వద్దనుండి దతువాఁలు కొంటారు. సాయంత్రానికి గీత, సకుని స్టేషన్‌ లోపలికి వెళ్ళిపోతారు. డాల్టన్‌గంజ్ ఒక చిన్న పట్టణం, రైల్వే స్టేషన్ వారికి సురక్షితమైన ఆశ్రయం.

*****

మూడు రోజుల తర్వాత, గీత 30 కట్టల దోనాలు , 80 కట్టల దతువాఁలు అమ్మి రూ. 420 సంపాదించగా, సకుని 25 కట్టల దోనాలు , 50 కట్టల దతువాఁలు విక్రయించి రూ. 300 సంపాదించారు. తాము సంపాదించిన ఆ డబ్బుతో ఇద్దరూ రాత్రివేళ ఆలస్యంగా బయలుదేరి, మర్నాడు పొద్దున్నే బర్వాడీహ్‌లో దించే పలామూ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. అక్కడి నుంచి హెహెగరా వెళ్ళేందుకు వారు లోకల్ రైలు ఎక్కాల్సి ఉంటుంది.

సకునికి తన సంపాదన పట్ల సంతోషం లేదు. "ఈ పని చాలా కష్టమైనది, కానీ డబ్బులు వచ్చేది చాలా తక్కువ," తన సంచిని సర్దుకుంటూ చెప్పారామె

అయితే మరో రెండు రోజుల్లో వారిక్కడికి తిరిగి రావాల్సి ఉంటుంది. "ఇది నా జీవనాధారం. నా కాళ్ళూ చేతులూ పనిచేస్తున్నంత కాలం నేనీ పని చేస్తాను," అన్నారు గీత.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు లభించింది.

అనువాదం: నీరజ పార్థసారథి

Ashwini Kumar Shukla

அஷ்வினி குமார் ஷுக்லா ஜார்க்கண்டை சேர்ந்த ஒரு சுயாதீன பத்திரிகையாளரும் புது தில்லியில் இருக்கும் வெகுஜன தொடர்புக்கான இந்திய கல்வி நிறுவனத்தின் பட்டதாரியும் (2018-2019) ஆவார். பாரி- MMF மானியப் பணியாளராக 2023ம் ஆண்டில் இருந்தவர்.

Other stories by Ashwini Kumar Shukla
Editor : Sarbajaya Bhattacharya

சர்பாஜயா பட்டாச்சார்யா பாரியின் மூத்த உதவி ஆசிரியர் ஆவார். அனுபவம் வாய்ந்த வங்க மொழிபெயர்ப்பாளர். கொல்கத்தாவை சேர்ந்த அவர், அந்த நகரத்தின் வரலாற்றிலும் பயண இலக்கியத்திலும் ஆர்வம் கொண்டவர்.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

Other stories by Neeraja Parthasarathy