" పానీ లే లో! పానీ [నీళ్ళండీ నీళ్ళు]!"

మీరు నీళ్ళు నిలవ చేసుకునే కుండా తపేలాలు తెచ్చుకోవడానికి తొందరపడకండి. ఈ నీళ్ళ టాంకర్ చాలా చాలా బుడ్డిది. ఒక ప్లాస్టిక్ సీసా, ఒక పాత రబ్బరు చెప్పు, ఒక పొట్టి ప్లాస్టిక్ పైపు, కర్ర ముక్కలతో చేసిన ఈ 'టాంకర్'లో మహా అయితే ఒక గ్లాసెడు నీళ్ళు పడతాయి.

బల్‌వీర్ సింగ్, భవానీ సింగ్, కైలాస్ కన్వర్, మోతీ సింగ్ - 5 నుంచి 13 ఏళ్ళ వయసున్న ఈ పిల్లలంతా సాంవతా గ్రామానికి చెందినవారు. రాజస్థాన్‌కు తూర్పువైపు మూలన ఉండే ఈ గ్రామానికి వారానికి రెండుసార్లు వచ్చే నీళ్ళ టాంకర్‌ను చూడగానే తమ తల్లిదండ్రులు, గ్రామస్థులంతా ఎంతలా సంతోషిస్తారో గమనించిన ఈ పిల్లలు ఈ బొమ్మ టాంకర్‌ను తయారుచేశారు.

PHOTO • Urja
PHOTO • Urja

ఎడమ: జైసల్మేర్, సాంవతా గ్రామంలోని తమ ఇంటి బయట ఉన్న కెర్ చెట్టు కింద బొమ్మ టాంకర్‌తో ఆడుకుంటోన్న భవానీ సింగ్ (కూర్చొన్నవారు), బల్‌వీర్ సింగ్. కుడి: టాంకర్ తయారీలో నిమగ్నమైవున్న భవానీ

PHOTO • Urja
PHOTO • Urja

ఎడమ: తమ ఇళ్ళ సమీపంలో ఆడుకుంటోన్న కైలాస్ కన్వర్, భవానీ సింగ్. కుడి: బొమ్మ టాంకర్‌ను లాగుతోన్న భవానీ

మైళ్ళ తరబడీ విస్తరించి ఉన్న ఇక్కడి పొడి నేలల్లో భూగర్భ జలాలు లేవు. చుట్టుపక్కల అక్కడక్కడా ఉన్న ఓరణ్ (ఉపవనాలు)లలో ఉన్న కొన్ని పెద్ద చెరువులలో మాత్రమే కొద్దిపాటి నీళ్ళున్నాయి.

ఈ పిల్లలు ఒకోసారి నీళ్ళ టాంక్‌కు బదులుగా ఒక నీళ్ళుమోసుకుపోయే డబ్బాతో ఆడుకుంటారు. ప్లాస్టిక్ కూజాని సగానికి కోసి దీన్ని తయారుచేస్తారు. ఈ బొమ్మలను ఎలా తయారుచేస్తారని ఈ రిపోర్టర్ వారిని అడిగినపుడు, పనికిరావని పడేసిన వస్తువుల నుండి అవసరమైనవాటిని సేకరించాలి కాబట్టి కొంత సమయం పడుతుందని చెప్పారు.

ధృఢంగా ఉన్న చట్రం సిద్ధమైన తర్వాత, లోహపు వైర్లతో తయారుచేసిన చక్రాలు బిగించి ఆ బొమ్మను తిప్పుతారు. తమ ఇళ్ళకు దగ్గరగా ఉన్న కెర్ చెట్టు ( కెపారిస్ డెసిడువా ) నీడ నుండి చుట్టూ తిరుగుతూ వారు ఒకరినొకరు పిలుచుకుంటూ ఆ బొమ్మను తిప్పుతుంటారు.

PHOTO • Urja
PHOTO • Urja

ఎడమ: ఎడమ నుండి కుడికి ఉన్నవారు కైలాశ్ కన్వర్, భవానీ సింగ్ (వెనుక), బల్‌వీర్ సింగ్, మోతీ సింగ్ (పసుపురంగు చొక్కా). కుడి: సాంవతా గ్రామ ప్రజల్లో ఎక్కువమంది రైతులే, వారికి కొన్ని మేకలు కూడా ఉన్నాయి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

உர்ஜா, பாரியின் மூத்த உதவி காணொளி தொகுப்பாளர். ஆவணப்பட இயக்குநரான அவர் கைவினையையும் வாழ்க்கைகளையும் சூழலையும் ஆவணப்படுத்துவதில் ஆர்வம் கொண்டிருக்கிறார். பாரியின் சமூக ஊடகக் குழுவிலும் இயங்குகிறார்.

Other stories by Urja
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli