తన ముందు పరచివున్న వివిధ రకాల తోలుబొమ్మలను చూస్తూ,"మాకివి కేవలం తోలుతో చేసిన వస్తువులు కావు. అవి మాకు దేవతలూ దేవుళ్ళూ, దివ్య శక్తుల అవతారాలు," అన్నారు రామచంద్ర పులవర్. అతనిముందున్న సంక్లిష్టమైన నైపుణ్యంతో చేసిన ఆ బొమ్మలను తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాటలో ఉపయోగిస్తారు. ఈ తోలుబొమ్మలాట కేరళలోని మలబారు దక్షిణ కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన రంగస్థల రూపం.

సంప్రదాయకంగా ఈ బొమ్మలను చక్కిలియన్ వంటి కొన్ని ప్రత్యేక సముదాయాలకు చెందినవారు తయారుచేస్తారు. ఈ కళా రూపానికున్న ప్రజాదరణ క్రమేపీ సన్నగిల్లిపోవడంతో, ఈ సముదాయానికి చెందిన సభ్యులు ఎటేటో వెళ్ళిపోయారు. ఈ కళను బతికించి ఉంచేందుకు కృష్ణన్‌కుట్టి పులవర్ తోలుబొమ్మల తయారీ కళను బోధించే లక్ష్యాన్ని చేపట్టారు. ఆయన కొడుకైన రామచంద్ర మరొక అడుగు ముందుకువేసి, తమ ఇంటిలోనివారికే కాక ఇరుగుపొరుగు మహిళలకు కూడా ఈ తోలుబొమ్మల తయారీ కళలో శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టారు. సంప్రదాయకంగా దేవాలయ ప్రాంగణాలలో పనిచేసే పురుషులకే పరిమితం చేసిన ఈ రంగంలో రాజలక్ష్మి, రజిత, అశ్వతి ప్రస్తుతం తోలుబొమ్మలను తయారుచేసే మహిళా కళాకారులు.

ఈ బొమ్మలను తయారుచేసేవారే కాక, ఈ ప్రదర్శనలను చూడటానికి వచ్చేవారు కూడా ఈ బొమ్మలను దేవతా సంబంధమైనవిగా పరిగణిస్తారు. వీటిని గేదెల, మేకల చర్మాలను ఉపయోగించి తయారుచేస్తారు. ఈ బొమ్మలు తయారుచేసేవారు మొదట చర్మాల మీద జాగ్రత్తగా రూపురేఖలను గీయటంతో మొదలెడతారు. ఆ తర్వాత వాటిని చెక్కటం కోసం ఉలులు, బరమాల వంటి ప్రత్యేక సాధనాలను ఉపయోగిస్తారు. "నేర్పరులైన కమ్మరుల కొరత వలన ఈ పనిముట్లను సంపాదించడం ఒక సవాలుగా మారింది," అని రామచంద్ర కుమారుడైన రాజీవ్ పులవర్ అన్నారు.

ఈ చిత్రాన్ని చూడండి: పాలక్కాడ్ తోలుబొమ్మల తయారీదారులు

ఈ తోలుబొమ్మల డిజైన్లు ప్రకృతి, పురాణాల సమ్మేళనం. ఈ నమూనాలు ప్రాకృతిక ప్రపంచపు సౌందర్యానికి జోహారుచేసే బియ్యం గింజలు, చంద్రుడు, సూర్యుడు వంటి అంశాలతో ప్రేరణ పొందాయి. తోలుబొమ్మలాట ప్రదర్శన సమయంలో పాడే పౌరాణిక గాథల నుండి శివుని డమరు, నిర్దిష్ట వేషధారణల వంటి మౌలికాంశాలను నమూనాలుగా తీసుకుంటారు. చూడండి: తోల్‌పావకూత్తు బొమ్మలాట అందరికోసం

ఈ బొమ్మలను తయారుచేసేవారు తోలుబొమ్మలకు రంగులద్దటానికి సహజంగా లభించే రంగులనే - ఆ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నదైనప్పటికీ - ఉపయోగిస్తారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా, వారిప్పుడు ప్రత్యేకించి మేక చర్మాలపై, అక్రిలిక్ రంగులను కలపడాన్ని మొదలుపెట్టారు. ఇలా చేయటం వలన ఆకృతులతోనూ, రంగుల నమూనాలతోనూ ప్రయోగాలు చేసేందుకు వీలవుతుంది.

తోల్‌పావకూత్తు సంప్రదాయం కేరళలోని మలబార్ ప్రాంతానికి చెందిన బహుళసాంస్కృతిక, సమకాలీన సంప్రదాయాలకు చిహ్నంగా ఉంది. విభిన్న తోలుబొమ్మల తయారీ కళాకారుల పెరుగుదల కూడా ఒక హృద్యమైన ధోరణి.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sangeeth Sankar

சங்கீத் சங்கர் ஐடிசி ஸ்கூல் ஆஃப் டிசைனில் ஆய்வறிஞராக இருக்கிறார். அவரின் இனவரைவியல் ஆய்வு, கேரள நிழல்கூத்தில் நேரும் மாற்றத்தை ஆராய்கிறது. சங்கீதி MMF-PARI மானியப்பணியை 2022-ல் பெற்றார்

Other stories by Sangeeth Sankar
Text Editor : Archana Shukla

அர்ச்சனா ஷூக்லா பாரியின் உள்ளடக்க ஆசிரியராகவும், வெளியீட்டுக் குழுவிலும் பணியாற்றி வருகிறார்.

Other stories by Archana Shukla
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli