ఒక పాలియెస్టర్ చీర రూ. 90కే వస్తున్నప్పుడు తాను నేసే కోట్‌పాడ్ చీరను రూ. 300 పెట్టి కొనేవాళ్ళెవరా అని మధుసూదన్ తాఁతికి విస్మయం కలుగుతుంటుంది
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, కోట్‌పాడ్ తెహసిల్ లో ఉండే డొంగ్రిగూడా అనే గ్రామానికి చెందిన నలబై ఏళ్ళు దాటిన ఈ నేత కార్మికుడు, గత కొన్ని దశాబ్దాలుగా ప్రసిద్ధిచెందిన కోట్‌పాడ్ చీరలను నేస్తున్నారు. కోట్‌పాడ్ చీర సంక్లిష్టమైన ఆకృతులను కలిగివుంటుంది; నలుపు, ఎరుపు, గోధుమ రంగుల ఉత్తేజకరమైన ఛాయలలో ఉండే నూలు దారాలతో నేస్తారు.
"నేత మా కుటుంబ వృత్తి. నా తాత, నా తండ్రి నేసేవాళ్ళు, ఇప్పుడు నా కొడుకు కూడా నేస్తున్నాడు," అంటారు మధుసూదన్. ఈయన ఎనిమిదిమంది సభ్యులున్నతన కుటుంబాన్ని పోషించుకునేందుకు అనేక ఇతర పనులను కూడా చేస్తుంటారు.
కాలానికి ఎదురీదుతోన్న నేత (A Weave in Time) అనే ఈ చిత్రాన్ని 2014లో రూపొందించారు. మధుసూదన్‌కు వారసత్వంగా వచ్చిన ఈ కళ గురించీ, దానిని నిలబెట్టుకోవడం కోసం అతను పడే కష్టాలను గురించీ ఈ చిత్రం తెలియచేస్తుంది
అనువాదం: సుధామయి సత్తెనపల్లి