ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.
కామంగ్ జిల్లాలోని లగమ్ గ్రామానికి చెందిన సంచార పశువుల కాపరి అయిన పంపా సుర్ంగ్, 35, అన్నాడు, “జొమోలు ఇప్పుడు మాలో బాగా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి".
జొమో? అవి ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్ లో 9,000 అడుగులు మధ్య అంతకంటే ఎక్కువ ఎత్తులపై అవి ఎలా ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి ?
జోమో అనేది యాక్ మరియు కోట్ యొక్క మిశ్రమజాతి పశువులు. ఇది ఒక రకమైన ఎత్తైన ప్రదేశం పశువు. జో అని పిలువబడే మగ పశువుకు సంతానం కలగదు కాబట్టి పశువుల కాపరులు ఆడ, డిజోమోను పెంచటానికి ఇష్టం పడతారు. ఇది కొత్త జాతి కానప్పటికీ, తూర్పు హిమాలయాలలో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా-బ్రోక్పా అనే పాక్షిక సంచార గ్రామీణ సమూహం, ఇటీవలి కాలంలో ఈ జంతువులను తమ మందలతో కలిపి పెంచుతన్నారు.
నలభైయైదేళ్ల పంపా పశువుల మందలో యాక్ మరియు జొమోస్ రెండూ ఉన్నాయి. "ఈ యాక్-పశువుల సంకర జాతి మరింత వేడి తట్టుకోగలిగుతాయి, అలానే తక్కువ ఎత్తులలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలలో కూడా బాగా మనగలుగుతాయి " అని ఆయన చెప్పారు.
ఈ ఎత్తైన పచ్చిక భూముల మేత మైదాన్ లలో, వేడి లేదా 'వార్మింగ్' రెండూ సాపేక్షికంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ సంవత్సరమొత్తం కాలంలో 32 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్న రోజులు ఉండవు. కానీ మైనస్ -35 డిగ్రీలను తేలికగా తటుకోగల యాక్, 12 లేదా 13 డిగ్రీలు మించిన ఉష్ణోగ్రతలో ఇబ్బందిపడుతుంది. నిజానికి, ఈ మార్పులు సంభవంచినప్పుడు మొత్తం ఒక్క యాక్ మాత్రమే కాదు, పూర్తి పర్యావరణ వ్యవస్థకే ఊహించని ఇబ్బంది కలుగుతుంది - ఇటీవలి సంవత్సరాలలో ఈ మార్పులు కనిపించాయి.
మోన్ప తెగలోని అక్కడి సంచార పశువుల కాపరులైన బ్రోక్పాలు (2011 అరుణాచల్ లో సెసెక్స్‌కు అనుగుణంగా సుమారు 60,000 మంది), శతాబ్దలుగా యాక్ ల పెంపకం చేస్తున్నారు మరియు వాటికి అవసరమయిన మేత కొరకు యాక్ లను మైదానానికి తీసుకువెళతారు .
కఠినమైన శీతాకాలంలో, వారు దిగువ ప్రాంతాలలో నివసిస్తే, వేసవిలో వారు అధిక ఎత్తుకు వలసపోతారు - కాబట్టి వీరు 9,000 మరియు 15,000 అడుగుల మధ్య తిరుగుతూ ఉంటారు.
కానీ లడఖ్‌లోని చాంగ్తాంగ్ ప్రాంతంలోని చాంగ్పా మాదిరిగా, బ్రోక్పా కూడా ఎప్పటికప్పుడు అస్థిరమైన వాతావరణం వల్ల తీవ్రంగా దెబ్బతింది. శతాబ్దాలుగా, వారి జీవనాధారం, వారి సమాజాలు, యాక్, పశువులు, మేకలు, గొర్రెలను పెంచడమూ మేపడమూ మీద ఆధారపడి ఉన్నాయి. వీటిలో, వారు యాక్ మీద ఎక్కువగా ఆధారపడతారు - ఆర్థిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలలో కూడా. ఆ బంధం ఇప్పుడు తీవ్రంగా దెబ్బతింది.
"వేడి కారణంగా ఫిబ్రవరి చివరి నాటికి యక్ అలసిపోయినట్లు అనిపిస్తుంది" అని చందర్ గ్రామంలోని పశువుల కాపరి అయిన లెకిసుజుక్ నాకు చెప్పారు. నేను మేలో వెస్ట్ కామెంగ్‌లోని డిరాంగ్ బ్లాక్‌ని సందర్శించినప్పుడు ఆమె కుటుంబంతో కలిసి ఉన్నాను. "గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలం ఎక్కువైంది, ఉష్ణోగ్రత పెరిగింది. యాక్ బలహీనపడింది, ”అని 50 ఏళ్ళ వయసుకు దగ్గరగా ఉన్న లేకి కూడా చెప్పింది.

