బంగారు రంగులోకి మారడానికి కొన్ని రోజుల ముందునాటి తళతళలాడే ఆకుపచ్చని వరి పొలంలో నిలబడి, నరేన్ హజరికా తన హృదయ గానాన్ని ఆలపించారు. 70 ఏళ్ళ నరేన్‌కు తోడుగా జితేన్ హజరికా (82) ఢోల్ (డోలు) తోనూ, రాబిన్ హజరికా (60) తాళాలతోనూ ఉన్నారు. వీరు ముగ్గురూ తితాబర్ సబ్ డివిజన్‌లోని బాలిజాన్ గ్రామంలో నివసించే సన్నకారు రైతులు. వీరు తమ యవ్వనకాలంలో నిపుణులైన బిహువాలు (బిహు కళాకారులు)గా ఉండేవారు.
“మీకు మాటలు తరగకపోవచ్చు, కానీ రంగాలీ (వసంతోత్సవం) బిహూ కథలు అనంతమైనవి!”


