దేవత ఇక్కడికి ఏ నిముషమన్నా రావచ్చు. కానీ దానికి ముందు అతను అలంకరించుకోవాలి. రజత్ జూబిలీ గ్రామస్తులారా , మీ ఇళ్లలో ఉన్న దుప్పట్లు, చీరలు, బట్టలు ఇక్కడికి తీసుకురండి. పాల గాన్- మానస ఎలా మోర్టే (దేవత భూమి మీదకు రావడం) మొదలవబోతోంది. సంగీత ప్రదర్శన కు ముందు గాలి ప్రతిధ్వనిస్తోంది, దక్షిణ 24 పరిగణ జిల్లాలో గోసబా బ్లాక్ లోని ఈ గ్రామాంలో ఒక సెప్టెంబర్ సాయంత్రం కళకళలాడుతున్నది.
గంటలో ఒక గ్రీన్ రూమ్ తయారయిపోయింది, అందులో కళాకారులు కాంతివంతంగా దుస్తులతో మేకప్ వేసుకుంటూ, ఆహార్యాలు ధరిస్తూ, రాతలో లేని తమ పంక్తులను గట్టిగా బట్టీ వేస్తూ. హడావిడిగా ఉన్నారు. నిత్యానంద సర్కార్, ఈ బృంద నాయకుడు, ఏ భావమూ లేకుండా ఉన్నాడు. నేను మొదటి సారి హిరణ్మయి, ప్రియాంకల పెళ్ళిలో అతనిని కలిసినప్పుడు ఇలా లేడు. ఈ రోజు అతను పాము దేవత మానసగా ప్రదర్శనని ఇస్తాడు. అతను నన్ను ఈ సాయంత్రం ప్రదర్శన ఇవ్వబోతున్న కళాకారులను పరిచయం చేశాడు.
పాల గాన్ అనేది ఒక ప్రముఖ దేవత లేదా దైవాన్ని స్తుతించే ఒక పురాణ కథనం అయిన మంగళ కావ్య ఆధారిత సంగీత నాటకం. ఈ కథన పద్యాలు తరచుగా శివుని వంటి దేశవ్యాప్తంగా ఆరాధించే వివిధ దేవుళ్లను ప్రశంసిస్తూ పాడినా, కానీ ఎక్కువగా స్థానిక బెంగాలీ దేవతలు అయిన ధర్మా ఠాకూర్, మా మానస-పాము దేవత, శీతల-మశూచి దేవత, బాన్ బీబీ- అడవి లేదా వన దేవత వంటి దేవతలను స్తుతిస్తారు. ఈ కళాకారుల బృందాలు ఏడాది పొడవునా సుందర్‌బన్ల ద్వీపాల చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులను రంజింపజేసే సంగీత నాటకాలను ప్రదర్శిస్తాయి.
పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు బీహార్ ప్రాంతాలలో ప్రదర్శించబడే మానస పాల గాన్, మానస మంగళ కావ్యం ఆధారంగా రూపొందించబడింది, ఇది ఒక ముఖ్యమైన పురాణ పద్యం, ఇది ఒక అంచనాలో, 13 వ శతాబ్దం నాటిది. ఇది జానపద పురాణాల ఆధారంగా రూపొందించబడింది. బెంగాల్‌లో, దక్షిణ 24 పరగణాలతో పాటు బంకురా, బిర్భూమ్, పురులియా జిల్లాల్లోని దళితులలో మానస ఒక ప్రముఖ దేవత. ప్రతి సంవత్సరం, విశ్వకర్మ పూజ రోజున (ఈ సంవత్సరం సెప్టెంబర్ 17), సుందర్బన్ల లోని మారుమూల గ్రామాలలోని అనేక కుటుంబాలు పాము దేవతను పూజించి పాల గాన్ చేస్తారు.

























