ఎనభై ఏళ్ళు పైబడిన శేరింగ్ దోర్జీ భూటియా ఐదు దశాబ్దాలుగా చేతితో విల్లులను తయారుచేస్తున్నారు. వృత్తి రీత్యా వడ్రంగి అయిన దోర్జీ ఫర్నీచర్ మరమ్మత్తులు చేయడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. కానీ ఆయనకు ప్రేరణ, స్థానిక సిక్కిం సంస్కృతిలో లోతుగా పాతుకొనివున్న విలువిద్య నుండి వచ్చింది.
సిక్కింలోని పాక్‌యోంగ్ జిల్లా, కార్థోక్ గ్రామంలో ఇంతకు ముందు ఎక్కువమంది విల్లు తయారీదారులు ఉండేవారనీ, ఇప్పుడు శేరింగ్ ఒక్కరే మిగిలారని స్థానికులు చెబుతున్నారు. శేరింగ్ వెదురును ఉపయోగించి విల్లులను తయారుచేస్తారు. వాటిని బౌద్ధుల పండుగ లసూంగ్ జరిగే సమయంలో విక్రయిస్తారు
శేరింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చదవండి: శేరింగ్ : పాక్‌యోంగ్‌లో బాణంలా నికార్సయిన విల్లు తయారీ నిపుణుడు