“బాపూ తూ ఆజా(తాతా, నువ్వొచ్చేయ్)”, తన్నా సింగ్ కొడుకు ఫోన్ లో ఎప్పుడూ చెబుతుంటాడు. “నేనెలా వస్తాను? నేను అతని భవిష్యత్తు కోసమే ఇక్కడ ఉన్నాను,” తన టెంటులో ప్లాస్టిక్ కుర్చీ మీద కూర్చుని అన్నారు సింగ్.
“అతని మాటలు విన్నప్పుడల్లా గట్టిగా ఏడవాలనిపిస్తుంది(నా కొడుకుకు 15 ఏళ్లు), ఇలా మనవలని వదిలి ఎవరు వస్తారు? ఎవరన్నా తమ పిల్లలను వదిలి ఎలా ఉండగలరు?” కన్నీళ్లతో అడుగుతాడతను.
ఏది ఏమైనా తన్నా సింగ్ వెనక్కి వెళ్ళొద్దని మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాడు. నవంబర్ 26, 2020 నుండి ఒక్కరోజు కూడా అతను నిరసన స్థలాన్ని వదిలి వెళ్ళలేదు. ఒక ఏడాది తరవాత, నవంబర్ 19, 2021న, ఆ మూడు వివాదాస్పద రైతు చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని ప్రకటించాక, భార్య విగతుడైన 70 ఏళ్ళ సింగ్, ఆ రద్దును నిజంగా కాగితాలపై ముద్రించాకనే తిక్రిని వదిలి వెళతానని చెప్పారు. “మేము ఈ చట్టాలను రద్దు చేయడానికి రాష్ట్రపతి ముద్ర కోసం ఎదురుచూస్తున్నాము. ఈ రోజు కోసమే మేము మా ఇళ్లను వదిలి ఇక్కడికి వచ్చాము.” అన్నారు ఆయన.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాది క్రితం రాజధాని సరిహద్దులకు వచ్చి తిక్రీ (పశ్చిమ ఢిల్లీలో), సింగు (రాజధానికి వాయువ్యం), మరింత ముందుకు వెళ్ళడానికి అనుమతించనప్పుడు ఘాజీపూర్‌లో(తూర్పులో) బస చేసిన పదివేల మంది రైతులలో ఆయన కూడా ఉన్నారు.
సింగ్ పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలోని భంగ్‌చారి గ్రామం నుండి తన ట్రాక్టర్‌పై మరికొంత మంది రైతులతో ఇక్కడకు వచ్చారు, ఆ ట్రాక్టరు ఇప్పటికీ ఆ నిరసన ప్రదేశానికి సమీపంలో నిలిపి ఉంది. అతని గ్రామంలో, అతని కుటుంబం వారి ఎనిమిది ఎకరాలలో, గోధుమ, వరి పంటలను సాగు చేస్తుంది. "నేను మా ఖేత్ [వ్యవసాయ భూమి] బాధ్యతను నా కొడుకుకు వదిలి ఇక్కడకు వచ్చాను," అని అతను చెప్పాడు.










