బాడ్కా రాజపూర్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో తిలక్ రాయ్ కా హత్థా అనే ఊరులో 340 ఇల్లు ఉన్నాయి, ఇది బక్సర్ జిల్లాలో ఉంది. ఇందులో భూమిలేని వారే ఎక్కువ. ఇక్కడ కొందరి ఇళ్లలో ఉన్న చేతి పంపుల నుంచి మురుగు నీరు బయటకు వస్తుంది.
2013-14 లో మహావీర్ కాన్సర్ సంస్థాన్ వారు చేసిన పరిశోధనలో భూగర్జ్ జలాల్లో ఆర్సినిక్ గాఢత చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. ఇది పశ్చిమ భాగాలైన తిలక్ రాయి కా హత్థా కి లో ఇంకా ఘోరంగా ఉంది, అన్నారు ఈ పరిశోధన యొక్క ముఖ్యమైన పరిశోధకుడు, డా. కుమార్. ఆర్సెనికోసిస్ సాధారణ లక్షణాలు ఈ ఊరిలో బాగా కనపడ్డాయి అని చెప్పారు. 28 శాతం మందికి హైపర్ కెరటోసిస్(మచ్చలు) వారి చేతుల మీద పాదాల పైన, 31 శాతానికి చర్మ పిజిమెంటేషన్ లేదా మెలనోసిస్, 57 శాతం మందికి లివర్ కి సంబంధించిన సమస్యలు, 86 మందికి గాస్త్రైటిస్, 9 శాతం ఆడవారికి రుతుక్రమం సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలున్నాయని తేల్చారు.
కిరణ్ దేవి భర్త ఈ గ్రామంలో బిచ్చు కా డేరా అనే ప్రదేశంలోని మట్టి ఇళ్ల మధ్యలో ఉండేవాడు. “ఆయన 2016 లో చాలా కడుపు నొప్పిని అనుభవించి చనిపోయాడు.” అన్నది ఆమె. ఆయన కుటుంబం సిమ్రీలో, బాక్సర్లో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే రకరకాల అభిప్రాయలు చెప్పారు. “అది టి బి కానీ, లివర్ కాన్సర్ కానీ అయుండొచ్చు అన్నారు,” అన్నది 50 ఏళ్ళ కిరణ్. వాళ్ళకి ఒక చిన్న భూమి చెక్క ఉంది, కానీ ఆమె భర్త రోజు కూలీ సంపాదన పైనే ఎక్కువగా ఆధారపడేవాడు.
కిరణ్ దేవి 2018 లో ఆమె అరచేతుల మీద తెల్లమచ్చలను చూసింది, ఆర్సినిక్ వలన శరీరం విషపూరితం అయిందని తెలిపే లక్షణం ఇది. “ఇది నీళ్ల వలన జరిగినదని నాకు తెలుసు, కానీ నా చేతి పంపు వాడకుండా ఎక్కడికి వెళ్లి నీళ్లు తెచ్చుకోను?”, ఆమె ఇంటి బయట, ఒక చిన్న ఇరుకు సందులో, ఎద్దు తన మేతను తీరికగా నెమరువేసే చోట దాటగానే, ఆమె చేతి పంపు ఉంది.
నీటి నాణ్యత, వర్షాకాలం కాని సమయంలో(నవంబర్ నుండి మే వరకు) ఇంకా ఘోరంగా ఉంటుందని, కప్పులో నీళ్ల టీ లాగా ఉంటుంది అని చెప్పింది. “మేము తిండి కోసం ఇంకా గిజగిజ లాడుతున్నాము. పాట్నా వరకు వెళ్ళి డాక్టర్లకు చూపించుకుని టెస్టులు ఎలా చేయించుకోగలము?” అని అడిగింది. ఆమె అరచేతులు విపరీతంగా దురద వేస్తున్నాయి, ఆమె బట్టల సబ్బు ముట్టుకున్నా, పేడ ఎత్తినా, అవి విపరీతంగా మంటపెడతాయి.
“ఆడవారికి, నీటికి దగ్గర సంబంధముంది.” రాముని చెప్పింది. “ఎందుకంటే ఇల్లు నడిచేది వీటితోనే”, కాబట్టి నీరు కలుషితమైతే, ఆడవారి పైనే ఎక్కువ ప్రభావముండేది.” పైగా కాన్సర్ పేషెంట్ల పై ఉండే చిన్నచూపు వలన చికిత్స కోసం వెళ్ళడానికి కూడా ఇక్కడి ఆడవారు బాగా ఆలస్యం చేస్తారు, అని చేప్పారు ఉమాశంకర్.
రామునికి రొమ్ము కాన్సర్ రాగానే, ఆ గ్రామ ఆంగవాడి నీటి నాణ్యతను గురించి అవగాహన సదస్సుని ఏర్పాటుచేసామని చెప్పారు. ఆమెని ముఖియాగా ఎన్నుకుంటే, ఆమె ఇంకా చాలా కార్యాలు చేసే ఉద్దేశ్యంలో ఉంది. “అందరూ వారి ఇళ్లలో RO నీటిని కొనుక్కోలేరు”, అన్నదామె. “అందరు ఆడవారు అంత తేలికగా ఆసుపత్రికి వెళ్ళలేరు. వీటి పరిష్కారానికి వేరే మార్గాలు వెతకాలి.”
పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.
ఈ వ్యాసాన్ని మళ్లీ ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected] కి మెయిల్ చేసి అందులోనే [email protected] కు కాపీ పెట్టండి.
అనువాదం: అపర్ణ తోట