సర్కార్ బహదూర్ అతనికి అన్నదాత అని పేరు పెట్టాడు. ఇప్పుడతను తన పేరులో చిక్కుకుపోయాడు. సర్కార్ బహదూర్ 'విత్తనాలు చల్లుకోండి' అని చెప్పగానే , అతను వాటిని పొలాల్లో చల్లుతాడు. సర్కార్ బహదూర్, ‘ఎరువు వేయండి’ అని చెప్పినప్పుడు, అతను మట్టికి పోషణను అందించేవాడు. పంట సిద్ధమైనప్పుడు, అతను దానిని సర్కార్ బహదూర్ నిర్ణయించిన ధరకే విక్రయిస్తాడు. సర్కార్ బహదూర్ తన నేల ఉత్పాదకతను గురించి ప్రపంచానికి గర్వంగా ప్రగల్భాలు పలుకుతున్నపుడు, ఈ అన్నదాత తాను పండించిన అదే ఆహారాన్ని తన కడుపు నింపుకోవటం కోసం అంగళ్ళ నుండి కొనుగోలు చేస్తాడు. ఏడాది పొడవునా ఇదే తంతు, అతనికి వేరే మార్గం లేదు. ఈ దారిలోనే వెళ్తూ వెళ్తూ ఒకరోజు తాను అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టుగా కనిపెట్టాడు. అతని పాదాల కింద ఉన్న భూమి కుంగిపోయింది, అతను చిక్కుకున్న పంజరం మరింత విశాలమయింది. ఈ చెర నుండి బయటపడే మార్గం దొరుకుతుందని అనుకున్నాడు. కానీ అతని ఆత్మ కూడా సర్కార్ బహదూర్‌కి బానిసే. అతని అస్తిత్వం చాలాకాలం క్రితమే సమ్మాన్ నిధి పథకం కింద కేటాయించిన మెరిసే షిల్లింగుల క్రింద పాతిపెట్టివుంది.

దేవేశ్ తన పద్యాన్ని హిందీలో చదువుతున్నారు, వినండి

ప్రతిష్ఠ పాండ్యా ఈ పద్యం ఆంగ్ల అనువాదాన్ని చదువుతున్నారు, వినండి


मौत के बाद उन्हें कौन गिनता

ख़ुद के खेत में
ख़ुद का आलू
फिर भी सोचूं
क्या मैं खालूं

कौन सुनेगा
किसे मना लूं
फ़सल के बदले
नकदी पा लूं

अपने मन की
किसे बता लूं
अपना रोना
किधर को गा लूं

ज़मीन पट्टे पर थी
हज़ारों ख़र्च किए थे बीज पर
खाद जब मिला
बुआई का टाइम निकल गया था
लेकिन, खेती की.
खेती की और फ़सल काटी
फ़सल के बदले मिला चेक इतना हल्का था
कि साहूकार ने भरे बाज़ार गिरेबान थाम लिया.

इस गुंडई को रोकने
कोई बुलडोज़र नहीं आया
रपट में पुलिस ने आत्महत्या का कारण
बीवी से झगड़े को बताया.

उसका होना
खेतों में निराई का होना था
उसका होना
बैलों सी जुताई का होना था
उसके होने से
मिट्टी में बीज फूटते थे
कर्जे की रोटी में बच्चे पलते थे
उसका होना
खेतों में मेड़ का होना था
शहराती दुनिया में पेड़ का होना था

पर जब उसकी बारी आई
हैसियत इतनी नहीं थी
कि किसान कही जाती.

जिनकी गिनती न रैलियों में थी
न मुफ़्त की थैलियों में
न होर्डिंगों में
न बिल्डिंगों में
न विज्ञापनों के ठेलों में
न मॉल में लगी सेलों में
न संसद की सीढ़ियों पर
न गाड़ियों में
न काग़ज़ी पेड़ों में
न रुपए के ढेरों में
न आसमान के तारों में
न साहेब के कुमारों में

मौत के बाद
उन्हें कौन गिनता

हे नाथ!
श्लोक पढूं या निर्गुण सुनाऊं
सुंदरकांड का पाठ करूं
तुलसी की चौपाई गाऊं
या फिर मैं हठ योग करूं
गोरख के दर पर खिचड़ी चढ़ाऊं
हिन्दी बोलूं या भोजपुरी
कैसे कहूं
जो आपको सुनाई दे महाराज…

मैं इसी सूबे का किसान हूं
जिसके आप महंत हैं
और मेरे बाप ने फांसी लगाकर जान दे दी है.

వారు ఎవరూ కాదు - చనిపోయినవారు

పొలం నా సొంతం.
ఇంట్లోనే పండించిన ఆలుగడ్డలు
అయినా సరిగ్గా తెలియదు నాకు
నేనేం తినాలో

ఎవరు వింటారు?
ఎవరిని ఒప్పించాలి?
నా పసిడి పంటను
నగదుగా మార్చటమెలా

నా విషాద గాథను
ఎవరికని చెప్పేది
నా రోదనా గీతాన్ని
ఎక్కడని పాడేది?

భూమిని కౌలుకు తీసుకున్నా
విత్తనాల కోసం వేలల్లో వెచ్చించా
ఎరువు వచ్చింది
కానీ విత్తే సమయం గడచిపోయింది.
ఎలాగో పాటుపడ్డాం, దున్నడం
విత్తడం, కోయడం, పంటను అమ్మడం
చేతిలో పడే చిల్లిగవ్వ కోసం
మార్కెట్ మొత్తం వడ్డీ వ్యాపారి చేతుల్లో ఉంది.

ఆ పెద్ద దగాను నేలమట్టం చేయడానికి
ఎవరూ రాలేదు
ఆత్మహత్యకు గల కారణాలు కాలమ్‌లో
‘అతని భార్యతో గొడవలు'గా పోలీసు రాతలు

పొలాల్లో కలుపు తీసింది ఆమె
మట్టిని సిద్ధంచేసింది ఆమె
విత్తనాలను మొలకెత్తించింది ఆమె
అప్పుల్లో మునిగివున్నా, పిల్లలకు తిండి పెట్టినది ఆమె
పొలాల నడుమ గట్టయినదీ ఆమే
నగరం నడిబొడ్డున
ఆకుపచ్చని చెట్టయినదీ ఆమే

తీరా ఆమె వంతు వచ్చేసరికి
రైతు అని పిలిచేందుకు
ఆమె హోదా సరిపోలేదు

వాళ్ళు లెక్కలోకి రారు,
ఊరేగింపులలో
ఉచిత రేషన్ సంచులలో
హోర్డింగులలో
భవనాలలో
ప్రకటనల దుకాణాలలో
పెద్ద పెద్ద మాల్‌ల అమ్మకాలలో
పార్లమెంటు హాలు మెట్ల మీద
కారుల్లో
కాగితపు చెట్లలో
రూపాయి నోట్లలో
ఆకాశంలోని నక్షత్రాలలో
సాహెబుల కుమారులలో కూడా
వాళ్ళు లెక్కలోకి రారు.

ఇప్పుడెవరు వాళ్ళను లెక్కించేది?
వాళ్ళు మరణించారు

హే నాథ్! నా భగవంతుడా!
నేను శ్లోకాలు చదవాలా,
లేక నిర్గుణ ఆరాధనా?
సుందరకాండను వల్లించాలా,
తులసి చౌపాయ్ పాడాలా?
హఠ యోగా చేయాలా,
గోరఖ్ పాదాల వద్ద ఖిచిడీని అర్పించాలా?
హిందీలో మాట్లాడాలా, భోజ్‌పురిలోనా?
నేనెలా చెప్పాలి
మీరు నా స్వరం వినగలిగేలా మహారాజ్...

నేను అదే రాష్ట్రానికి చెందిన ఒక రైతును,
అది మీరు మహంత్‌గా పరిపాలించే చోటు
నా తండ్రి ఉరివేసుకుని చనిపోయిన చోటు


మీకు ఆత్మహత్య గురించిన ఆలోచనలు వస్తుంటే , లేదా అటువంటి ధోరణి ఉన్నవారి గురించి మీకు తెలిస్తే , దయచేసి నేషనల్ హెల్ప్ లైన్‌కు చెందిన కిరణ్‌కు 1800 -599 -0019 (24/7 టోల్ ఫ్రీ) ఫోన్ చేయండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న ఈ హెల్ప్‌లైన్‌లలో దేనికైనా ఫోన్ చేయండి. మానసిక ఆరోగ్య నిపుణుల , లేక సేవల సమాచారం కోసం దయచేసి SPIF మానసిక ఆరోగ్య డైరెక్టరీ ని సందర్శించండి సందర్శించండి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Poem and Text : Devesh

ਦੇਵੇਸ਼ ਇੱਕ ਕਵੀ, ਪੱਤਰਕਾਰ, ਫ਼ਿਲਮ ਨਿਰਮਾਤਾ ਤੇ ਅਨੁਵਾਦਕ ਹਨ। ਉਹ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਹਿੰਦੀ ਅਨੁਵਾਦ ਦੇ ਸੰਪਾਦਕ ਹਨ।

Other stories by Devesh
Editor : Pratishtha Pandya

ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਪਾਂਡਿਆ PARI ਵਿੱਚ ਇੱਕ ਸੀਨੀਅਰ ਸੰਪਾਦਕ ਹਨ ਜਿੱਥੇ ਉਹ PARI ਦੇ ਰਚਨਾਤਮਕ ਲੇਖਣ ਭਾਗ ਦੀ ਅਗਵਾਈ ਕਰਦੀ ਹਨ। ਉਹ ਪਾਰੀਭਾਸ਼ਾ ਟੀਮ ਦੀ ਮੈਂਬਰ ਵੀ ਹਨ ਅਤੇ ਗੁਜਰਾਤੀ ਵਿੱਚ ਕਹਾਣੀਆਂ ਦਾ ਅਨੁਵਾਦ ਅਤੇ ਸੰਪਾਦਨ ਵੀ ਕਰਦੀ ਹਨ। ਪ੍ਰਤਿਸ਼ਠਾ ਦੀਆਂ ਕਵਿਤਾਵਾਂ ਗੁਜਰਾਤੀ ਅਤੇ ਅੰਗਰੇਜ਼ੀ ਵਿੱਚ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਹੋ ਚੁੱਕਿਆਂ ਹਨ।

Other stories by Pratishtha Pandya
Illustration : Shreya Katyayini

ਸ਼੍ਰੇਇਆ ਕਾਤਿਆਇਨੀ ਇੱਕ ਫਿਲਮ-ਮੇਕਰ ਹਨ ਤੇ ਪੀਪਲਜ਼ ਆਰਕਾਈਵ ਆਫ਼ ਰੂਰਲ ਇੰਡੀਆ ਵਿਖੇ ਸੀਨੀਅਨ ਵੀਡਿਓ ਐਡੀਟਰ ਹਨ। ਉਹ ਪਾਰੀ ਲਈ ਚਿਤਰਣ ਦਾ ਕੰਮ ਵੀ ਕਰਦੀ ਹਨ।

Other stories by Shreya Katyayini
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli