ఏనుగు తన ఫంది (శిక్షకుడు)ని ఎన్నటికీ మరచిపోదని శరత్ మొరాన్ అంటారు. ఆయన 90కి పైగా ఏనుగులకు శిక్షణనిచ్చారు. ఏనుగు తన జీవితకాలంలో దట్టమైన అడవిలో అడవి ఏనుగుల మందతో కలిసి ఉన్నప్పటికీ కూడా తన ఫంది వద్దకు పరుగెట్టుకుంటూ వస్తుందని కూడా ఆయన అంటారు.
పిల్‌ఖానాలో - శిక్షణ కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరం - కొత్తగా పుట్టిన ఏనుగు గున్నకు నెమ్మదిగా మానవ స్పర్శను పరిచయం చేసి, దానికి అలవాటయ్యేవరకూ అనేకసార్లు కొనసాగిస్తారు. "శిక్షణా సమయంలో కలిగే చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది," అంటారు శరత్.
రోజులు గడిచేకొద్దీ, ఆ జంతువుకు అసౌకర్య భావన తొలగిపోయేంత వరకూ ఆ గున్న చుట్టుపక్కల ఉండే మనుషుల సంఖ్య పెరిగిపోతూ వుంటుంది
శిక్షణ సాగినంత కాలం శరత్, అతని తోటి శిక్షకులు జంతువుకూ, దాని శిక్షకునికీ మధ్య ఉందే స్నేహం గురించిన కథను వివరిస్తూ సాంత్వననిచ్చే పాటలను పాడుతుంటారు.





