కొల్హాపూర్ ఒక (పురోగామి) ప్రగతిశీల నగరంగా పేరొందింది. ఈ నగరం గొప్ప ఆలోచనాపరులైన శాహు, ఫూలే, అంబేద్కర్‌ల వారసత్వాన్ని కలిగివుంది. వివిధ సంస్కృతుల పట్ల గౌరవం, స్నేహభావంతో సహా ఈ ప్రగతిశీల ఆలోచనా ధారను కాపాడుకోవటానికి వివిధ మతాలకు, కులాలకు చెందిన ప్రజలు ఇప్పటికీ కృషిచేస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ సర్వపక్ష సమాజంలో విభేదాలు సృష్టించేందుకు కలిసికట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలోచనలు ఆలోచనలతో పోరాడాలి. షర్ఫుద్దీన్ దేశాయ్, సునీల్ మాలీ వంటి వ్యక్తులు సమాజంలో సామరస్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
షర్ఫుద్దీన్ దేశాయ్, సునీల్ మాలీలు మహారాష్ట్ర, కొల్హాపూర్ జిల్లాలోని తార్‌దాళ్ గ్రామవాసులు. షర్ఫుద్దీన్ దేశాయ్ ఒక హిందూ గురువును స్వీకరించగా, సునీల్ మాలీ ఒక ముస్లిమ్ గురువుపై విశ్వాసంతో ఉన్నారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి