నేపథ్యంలో వినవస్తున్న బోలుగా ఉరుముతున్నట్టున్న డోలు శబ్దం అక్కడి గాలిలో తేలియాడుతోంది. ఇంతలోనే దర్గా వెలుపల భిక్షాటన చేసే వ్యక్తిలాగా భక్తిగీతాన్ని పాడే గాయకుడి బొంగురు గొంతు ప్రవక్త గురించి స్తోత్రగానం చేస్తోంది; ఉపకారికి దీవెనలనూ, శ్రేయస్సునూ కోరుతూ ప్రార్థిస్తోంది.
“ఒక తులంపావు బంగారం
నా చేతిలోనూ నా సోదరి చేతిలో కూడా
ఓ దాతా! ఉదారంగా ఉండు, మమ్మల్ని అంతగా హింసించకు..."
ఇది కచ్ ప్రాంతపు గొప్ప సమ్మేళనాల సంప్రదాయాల గురించి రవంత అవగాహనను ఇచ్చే పాట. ఇది ఒకప్పుడు ప్రతి సంవత్సరం గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ మీదుగా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సింధ్ వరకు వలసపోయి, మళ్ళీ తిరిగి వచ్చే మార్గంలోనూ తమ పశువులను మేపుకు తీసుకువెళ్ళే సంచార పశుపోషకుల ప్రాంతం. విభజన తర్వాత ఏర్పడిన కొత్త సరిహద్దులు ఆ ప్రయాణానికి ముగింపు పలికాయి. అయితే కచ్, సింధ్ ప్రాంతాల సరిహద్దుల్లో ఉండే హిందూ, ముస్లిమ్ మతాలకు చెందిన పశుపోషకుల మధ్య బలమైన సంబంధాలు అలాగే నిలిచి ఉన్నాయి.
సూఫీయిజం, కవిత్వం, జానపద కథలు, పురాణాలు, ఇంకా ఆ అన్యోన్య క్రియల ద్వారా ఉద్భవించిన భాషల వంటి మతపరమైన ఆచారాల గొప్ప సంగమం, ఈ ప్రాంతంలోని సముదాయాల జీవితాలను, వారి కళలను, వాస్తుశిల్పాన్ని, మతపరమైన అభ్యాసాలను నిర్వచించింది. చాలా వరకు సూఫీ మతంపై ఆధారపడి ఉన్న ఈ భాగస్వామ్య సంస్కృతుల, సమకాలీన అభ్యాసాల భాండాగారం, ఈ ప్రాంతానికి చెందిన, ప్రస్తుతం క్షీణిస్తోన్న, జానపద సంగీత సంప్రదాయాలలో కనబడుతుంది.
నఖత్‌రాణా తాలూకా లోని మోర్గర్ గ్రామానికి చెందిన పశువుల కాపరి 45 ఏళ్ళ కిశోర్ రావర్ పాడిన ఈ పాటలో ప్రవక్త పట్ల భక్తి ప్రకాశిస్తుంది.
કરછી
મુનારા મીર મામધ જા,મુનારા મીર સૈયધ જા.
ડિઠો રે પાંજો ડેસ ડૂંગર ડુરે,
ભન્યો રે મૂંજો ભાગ સોભે રે જાની.
મુનારા મીર અલાહ.. અલાહ...
મુનારા મીર મામધ જા મુનારા મીર સૈયધ જા
ડિઠો રે પાજો ડેસ ડૂંગર ડોલે,
ભન્યો રે મૂજો ભાગ સોભે રે જાની.
મુનારા મીર અલાહ.. અલાહ...
સવા તોલો મૂંજે હથમેં, સવા તોલો બાંયા જે હથમેં .
મ કર મોઈ સે જુલમ હેડો,(૨)
મુનારા મીર અલાહ.. અલાહ...
કિતે કોટડી કિતે કોટડો (૨)
મધીને જી ખાં ભરીયા રે સોયરો (૨)
મુનારા મીર અલાહ... અલાહ....
અંધારી રાત મીંય રે વસંધા (૨)
ગજણ ગજધી સજણ મિલધા (૨)
મુનારા મીર અલાહ....અલાહ
હીરોની છાં જે અંઈયા ભેણૂ (૨)
બધીયા રે બોય બાહૂ કરીયા રે ડાહૂ (૨)
મુનારા મીર અલાહ… અલાહ….
મુનારા મીર મામધ જા,મુનારા મીર સૈયધ જા.
ડિઠો રે પાજો ડેસ ડુરે
ભન્યો રે મૂજો ભાગ સોભે રે જાની
મુનારા મીર અલાહ અલાહ
తెలుగు
ముహమ్మద్ మినార్లు, సయ్యద్ మినార్లు
ఓహ్, నేను నా మాతృభూమి పర్వతాలను చూశాను
వాటి ముందు మోకరిల్లాను
ఓహ్ నేను అదృష్టవంతుడిని!
వాటి మహిమలో నా హృదయం ప్రకాశిస్తుంది
మీర్ ముహమ్మద్ మినార్లు, అల్లా! అల్లా!
ముహమ్మద్ మినార్లు, సయ్యద్ మినార్లు
ఓహ్, నేను నా మాతృభూమి పర్వతాలను చూశాను
వాటి ముందు మోకరిల్లాను
ఓహ్ నేను అదృష్టవంతుడిని!
వాటి మహిమలో నా హృదయం ప్రకాశిస్తుంది
మీర్ ముహమ్మద్ మినార్లు, అల్లా! అల్లా!
ఒక తులంపావు బంగారం
నా చేతిలోనూ నా సోదరి చేతిలో కూడా
ఓ దాతా! ఉదారంగా ఉండు, మమ్మల్ని అంతగా హింసించకు (2)
ఓహ్, మీర్ ముహమ్మద్ మినార్లు, అల్లా! అల్లా!
గది చిన్నదో పెద్దదో అని కాదు (2)
మదీనాలో మీకు సోయారో గనులుంటాయి
మదీనాలో మీరతని విస్తారమయిన దయను పొందుతారు.
ఓహ్, మీర్ ముహమ్మద్ మినార్లు, అల్లా! అల్లా!
వర్షం పడుతుంది, రాత్రి చీకటిలో కురుస్తుంది
ఆకాశం ఉరుముతుంది, మీరు మీ ప్రియమైనవారితో ఉంటారు
మీర్ ముహమ్మద్ మినార్లు, అల్లా! అల్లా!
నేను భయపడిన జింకలా ఉన్నాను, చేతులు పైకెత్తి ప్రార్థిస్తాను
ముహమ్మద్ మినార్లు, సయ్యద్ మినార్లు
ఓహ్, నేను నా మాతృభూమి పర్వతాలను చూశాను
వాటి ముందు మోకరిల్లాను
ఓహ్ నేను అదృష్టవంతుడిని!
వాటి మహిమలో నా హృదయం ప్రకాశిస్తుంది
ఓహ్, మీర్ ముహమ్మద్ మినార్లు, అల్లా! అల్లా!
పాట స్వరూపం
: సంప్రదాయ జానపద గీతం
శ్రేణి
: భక్తి
గీతాలు
పాట
: 5
పాట శీర్షిక
:
మునారా
మీర
మమ్మద్
జా
మునారా
మీర
సయ్యద
జా
స్వరకర్త
: అమద్ సమేజా
గానం
: నఖత్‌రాణా తాలూకా మోర్గర్‌కు చెందిన 45 ఏళ్ళ వయసున్న పశుపోషకుడు, కిశోర్ రావర్.
ఉపయోగించిన వాయిద్యాలు
: డోలు
రికార్డు చేసిన సంవత్సరం
: 2004, కెఎమ్‌విఎస్ స్టూడియో
గుజరాతీ అనువాదం
: అమద్ సమేజా, భారతి గోర్
ప్రీతి సోనీ, కెఎమ్‌విఎస్ కార్యదర్శి అరుణా ఢోలకియా, కెఎమ్‌విఎస్ ప్రాజెక్ట్ సమన్వయకర్త అమద్ సమేజాల సహకారానికి; గుజరాతీ అనువాదంలో అమూల్యమైన సహాయం చేసినందుకు భారతీబెన్ గోర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి