నిసత్తువగా పడి ఉన్న స్మశానాలు, ప్రాణవాయువు లేని ఆసుపత్రుల మధ్య ఆమె జీవించింది. ఇస్మాయిల్! ఊపిరి పీల్చుకోవటానికి నువ్వెంత పోరాటం చేశావు! వైద్యులు జైలుకి వెళుతున్న, రైతులను ఉగ్రవాదులుగా చూస్తున్న, ఈ గడ్డమీద ఆమె బతికింది. ప్రియమైన నజియా, సోహ్రాబ్... బంగారుకొండ అయ్లీన్... ఇక పై వాళ్ల కడుపులను ఆమె ఎలా నింపగలుగుతుంది? మనుషులను వస్తువులుగా మార్చి, ఆవులను పవిత్రంగా భావించిన ఈ భూమి మీద ఆమె మనగలిగింది. ఉన్న చిన్నచెక్క భూమి ఆమె భర్త మందులకు అమ్ముడుబోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడ తలదాచుకొంటుంది?
విగ్రహాలు, మరుగుదొడ్లు, నకిలీ పౌరసత్వాల వాగ్దానాలు - దౌర్జన్యాలకు సాధికారత ఇస్తున్న నేల మీద ఆమె జీవించింది. స్మశానాల దగ్గరి అంతులేని క్యూల నుండి ఆమె బతికి బయటపడ్డా, శవాలగోతులు తవ్విన వాళ్లకు ఆమె ఏమి ఇవ్వగలదు ? వ్యవస్థ కూలిపోనున్నదా, లేక మొదటి నుంచి ఇలాగే ఉన్నదా - అని కామెంట్లలోనో, కాపచినో తాగుతూనో బాబూ, బీబీలు మేధోపరమైన వాదనలు చేసే భూమి మీద ఆమె జీవించింది.
సోహ్రాబ్ ను ఎవరూ ఓదార్చలేకపోయారు. నజియా స్థాణువైపోయింది. వెలసిపోయిన అమ్మ కొంగును చుట్టుకొని అయ్లీన్ మూసిముసి నవ్వులు నవ్వింది. అంబులెన్స్ మనిషి 2000 రూపాయలు అదనంగా అడిగాడు. భర్త శవాన్ని తాకవద్దని పొరుగువాళ్లు ఆమెను హెచ్చరించారు. గత రాత్రి ఎవరో ఆమె తలుపు మీద పిచ్చిరాతతో ‘కత్వా సా లా’ (ముసల్మాన్ కుక్క) అని రాశారు. జనాలు రెండో లాక్ డౌన్ గురించి గుసగుసలాడుతున్నారు.
సోహ్రాబ్ స్పృహ తప్పి పడిపోయాడు. నజియా తన తండ్రి శవంపై కఫాన్ ని వేళ్లనుంచి రక్తం వచ్చేంత గట్టిగా పట్టుకుంది. ఐదు బొట్ల రక్తం తెలుపుకు వీడ్కోలునిచ్చింది . అయ్లీన్ నిద్రపోయింది. నిన్న చవక దుకాణదారుడు 50కేజీల బియ్యం బస్తాను దాచుకొని పట్టుబడ్డాడు. రైల్వేల నుండి టీకాల వరకూ, మంత్రుల నుండి పొత్తిళ్లలో పసిపాపల వరకూ - అన్నీ డబ్బున్నోడికి అమ్ముడుబోయే చోట ఆమె జీవించింది.
ఆమె తన పొలాన్ని పోగొట్టుకుంది . కానీ షెడ్లో ఇస్మాయిల్ వేసుకునే దివ్యమైన తెల్లటి జుబ్బా కింద ఫోలీడాల్ సీసా అలానే ఉంది. ఇస్మాయిల్ గ్రామ మసీదులో - ముజీన్ ( అజా పాడేవాడు) . ఈ నయీ బీమారీ తన తల్లినీ, అన్ననీ, భర్తనీ -ఒకరి తరువాత ఒకరిని తీసుకెళ్ళిపోయింది. అయినా ఆమె ముగ్గురు పిల్లలు ఆమెకు తన జీవితంలో మిగిలి ఉన్న ఖిలాబ్ (మక్కా మసీదు దశ), మీహ్ రాభ్ లు (ఇమామ్ ప్రార్థన చేసే మధ్య ద్వారం) నజియా వయసు 9 సంవత్సరాలు, సోహ్రాబ్ వయసు 13 సంవత్సరాలు, అయ్లీన్ కేవలం 6 నెలల పాప. ఇప్పుడిక ఆమెకు వేరే దారి లేదు.
చూడు నాన్నా, ఆ చందమామలో ఒక మనసుంది
-
అది వేల వేల ఎరుపు వన్నెలు గా ఛిద్రమై పోయింది.
దుమ్ము పండగ జాతర,
దుమ్ము
ఒక నిట్టూర్పు,
దుమ్ము రైతుకు ఎర్రెర్రని
జోలపాట.
ఊరుకో నా తల్లి, నిబ్బరంగా ఉండు -
కొలిమిలా నిద్రపో,
సమాధి రాగం పాడుకో.
గాజుముక్క
కలలో ఇరుక్కున్న బింబం
- మరుభూమి
అతని నెలవు,
మండుతున్న
సిలిండర్ అతని స్థావరం.
ఆకలిగొన్న చలికాలానికి మనమొక సంఖ్య మాత్రమే,
నల్లటి రోజా పూవుల్లాగా, శవాలపై
వాలిన రాబందుల్లాగా.
దైవమంటే టీకా,
దైవమే మందు,
స్మశానం లో భరించలేని ఖర్చు కూడా దైవమే.
గాయాలలో ఆకాశం,
రొట్టెల కై కీర్తినాదాలు,
సాగుతూనే ఉన్నాయి.
ఎరుపు రంగు,
నస్రత్ ;
ఎరుపంటే
సమాధి,
కూలివాని సెల్లోఫెన్ గర్భం ఎరుపు రంగే మరి.
ఈ పేదవాడి గ్రహానికి
తస్లీములు
, అయ్యా ;
శవాన్నీ కాస్త అలంకరించి పంపండి.
మరణమిప్పుడు నాట్యం చేస్తుంది, ఊరుకో నాన్న ఊరికో!
ఆ మంటలోకి చూడు, వెలుగునీడలు సిగ్గుపడుతున్నాయి.
**********
పదకోశం
ఫోలిడాల్ :
పురుగుల
మందు
ఘోమార్:
సాంప్రదాయ రాజస్థానీ
జానపద నృత్యం
జుబ్బా: పొడవైన చేతులతో పొడుగ్గా వదులుగా ఉండే చొక్కా,
చాలా వదులుగా ఉండే కుర్తా
కఫాన్ : అంత్యక్రియల సమయం లో శవాణ్ని కప్పే వస్త్రం
మెహ్ఫిల్: పండుగ లో నలుగురూ కలవడం
మెహ్రూన్: మెరూన్ రంగు
మిహ్ రబ్ : ఖిబ్లాను
సూచించే మసీదులో అర్ధ వృత్తాకార సముచితం, కాబాహ్
దిక్కును సూచిస్తుంది
ముజీన్ : మసీదు వద్ద ప్రార్థనకు పిలుపునిచ్చేవాడు
నయీ బీమారి : కొత్త అనారోగ్యం / కొత్త వ్యాధి
నుస్రత్ : విజయం, సహాయం, రక్షణ
క్విబ్లా: కాబా వైపు దిశ
తహ్సిన్: అలంకరించడం
తస్లీమ్: సమర్పణ, నమస్కారం
అనువాదం : రోహిత్ మరియు అపర్ణ తోట